లక్ష్మీ నివాసం ఎక్కడ???...
ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవి తో ఇలా అన్నాడట,
"ప్రజలలో ఎంత భక్తి పెరిగింది ... అందరూ నా కరుణ కోసం "నారాయణ నారాయణ" అని నా నామం జపిస్తున్నారు
ఆ మాటలు విని లక్ష్మీదేవి
" అది మీకోసం కాదు నా కరుణా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది...
అలా అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మీ అని ఎందుకు
జపించటం లేదు అని అంటాడు నారాయణుడు.
అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకు అని అంటుంది లక్ష్మీదేవి.
సరే అని అంటాడు నారాయణుడు.
నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి
ఒక గ్రామం లోని గ్రామాధికారి ఇంటి తలుపు తట్టుతాడు.
గ్రామాధికారి తలుపు తెరిచి, మీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు?" అని అడుగుతాడు.
నాపేరు లక్ష్మీపతి,
నేను వైకుంఠం అనే వూరి వాడిని,
నేను మీ నగరంలో హరికథ చెప్పాలని అనికొంటున్నాను
అని అంటాడు...
దానికి గ్రామాధికారి అలాగా మా గ్రామ ప్రజల మహాభాగ్యం.
హరికథ విని పుణ్యం సంపాదించు కొంటారు, మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు నా ఇంట్లో ఉండండి అని
అన్నాడట...
గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై అన్ని సన్నాహాలు చేస్తారు...
మొదటి రోజు పది మంది వస్తారు,
రెండవ మరియు మూడవ రోజులలో మంది మరింత పెరిగి కూర్చోటానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ
వుంటారు...
ప్రజల అనన్య భక్తి చూసి
నారాయణుడు అమిత సంతోషపడిపోతాడు.
ఇదంత గమనించిన లక్ష్మీ మాత ఒక వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి అప్పడే ఇంటికి తాళం వేసి హరికథ కాలక్షేపం కోసం వెళుతున్న ఒక స్త్రీతోని దాహం గా వుంది నాకు కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డా అని అడుగుతుంది.
అమ్మా సమయం సాయంత్రం 5.00 అయింది నేను హరికథ వినెందుకు వెళుతున్నాను అని అంటుంది...
"నాకు కొన్ని మంచి నీరు ఇవ్వు తల్లీ చాలా దాహం వేస్తుంది. నీకు అమితమైన పుణ్యం లభిస్తుందని వృద్దురాలి రూపం లో వున్న లక్ష్మీమాత దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది...
లక్ష్మీమాత నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబు గా మారుతుంది...
అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి రెండు చేతులు జోడించి ఎంత మహిమగల తల్లివి నీవు.
నీకు ఆకలి వేస్తుందేమో వుండు కంచం లో నీకూ అన్నం పెడతాను అని అంటుంది.
ఆ కంచం కూడ బంగారంది అవుతుంది అన్న ఆశతో , లేదు బిడ్డ నాకు ఆకలిగా లేదు, నీ హరికథకు సమయం అవుతుంది అని అక్కడనుంచి వెళ్లుతుంది...
ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుపక్కల ఉన్న మొత్తం ఆడవారికి చెబుతుంది, అది వింటునే హరికథ వింటున్న స్త్రీలందరు మధ్య లోనే లేచి వెళ్లిపోతారు...
మరుసటి రోజు నుండి హరికథ కు వచ్చేవారి సంఖ్య గణనయంగా తగ్గడంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చింది అని అడుగుతాడు.
అప్పుడు ఎవరో అంటారు 'ఒక మహిమ గల తల్లి గ్రామానికి వచ్చింది.
ఆమె ఎవరింటికైన వెళ్లి ఏ వస్తువులో ఏమి తాగిన, తినిన ఆ వస్తువు బంగారంగా మారుతుంది, అందువలన భక్తుల సంఖ్య తగ్గింది అని అంటాడు.
... లక్ష్మీదేవి వచ్చిదని నారాయణుడికి అర్థం అవుతుంది.
.... ఇది వింటునే ఆ గ్రామాధికారి కూడ అక్కడి నుండి మెల్లగా జారుకొని ఆ వృద్దురాలి దగ్గర కు పోయి
"అమ్మా, నేను హరికథ నిర్వహిస్తున్నాను అటవంటిది మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు అని అడుగుతాడు...
అప్పుడు లక్ష్మీమాత ఇలా అంటుంది
"మీ ఇంటికే నేను మొదట వచ్చాను! మీ ఇంట్లో హరికథ చెప్పేవారు వుండటంతో నేను రాలేదు, అతను వెళ్లిపోయాకనే నేను వస్తాను."
ఓస్ ఇంతేనా తల్లీ నేనిప్పడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను అని అక్కడ నుండి తన ఇంటికి వస్తాడు...
ఆ రోజున హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే, గ్రామాధికారి ఇలా అంటాడు
"మహారాజ్, మీరు మీ పెట్టేబేడ సర్దుకొండి.
ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో వుండండి, అక్కడ మీకూ ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు.
అప్పుడు లక్ష్మీపతి మాట్లాడుతూ,"హరికథ పూర్తి అయ్యెందుకూ ఇంకా రెండు, మూడు రోజులు మిగిలి ఉన్నాయి, ఇక్కడనే ఉంటాను అని అంటాడు.
లేదు - లేదు, మీరు త్వరగా వెళ్లండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు...
ఇంతలో లక్ష్మీమాత వచ్చి, గ్రామాధికారిని మీరు కొంచెం బయటకు వెళ్లండి, నేను వారితో మాట్లాడుతాను అని
అంటుంది.
"ప్రభు నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నావా నీ భక్తులు నీకోసం కాదు నాకోసం మీనామం జపిస్తున్నారని అని నవ్వుతూ అంటుంది..."
భగవంతుడు నారాయణుడు ఇలా అన్నాడు,
"అవును ఇదంతా నీ ప్రభావం. కానీ నీవు కూడ ఒక విషయాన్ని అంగీకరించాలి, నీవు నాకోసం వైకుంఠం విడిచి వచ్చావు"...
ఎక్కడ అయితే నాకథలు చెప్పుతారో, భజనలు చేస్తారో (లక్ష్మి) ఖచ్చితంగా అక్కడనే నీవూ వుంటావు అని అంటాడు నవ్వుతూ...
ఇలా అని నారాయణుడు వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు.
నారాయణుడు బయలుదేరిన తర్వాత, మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా గుంపుగా చేరుతారు.
ప్రతి ఒక్కరి ఇళ్లలోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు, కానీ ఇది ఏమిటి అని అంటారు...
లక్ష్మీ మాత గ్రామాధికారి మరియు ఇతర గ్రామస్తులందరికీ తో ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను అని అనటంతో
అందరూ ఒకేసారి అమ్మా, ఎందుకు అలా చేస్తున్నారు, మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు...
నారాయణుడు ఎక్కడ వుంటే అక్కడనే నా నివాసం, మీరు నారాయణుడిని పంపించారు, అందుకే నేనుకూడ ఆయన దగ్గరకు పోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది...
దేవుని స్మరణ ఉన్నచోటనే - అక్కడ లక్ష్మి నివసిస్తుంది...
లక్ష్మి వెంట పరిగెత్తే వారికి లక్ష్మీ నిలవదు మరియు లక్ష్మీపతి దొరకడు...*
సేకరణ

No comments:
Post a Comment