Wednesday, September 21, 2022

ప్రశ్న:--- క్రమం తప్పని ధ్యానం, ధ్యాన స్థితిని రోజంతా కొనసాగిస్తూ ఉండటం అనేవి ధ్యానాన్ని ఆపకుండా ఉండటంలో మొదటి మెట్టు. అయితే నిత్య జీవితంలో ధ్యానాన్ని తిరిగి తెచ్చుకోవటానికి ఏవైనా ఉపకరణాలు ఉంటే బావుంటుందని నేను ఆశిస్తున్నాను. నాకు మీ గైడెన్స్ కావాలి.

🔺 *పత్రీజీ సమాధానాలు*🔺
🌹 *చాప్టర్ --13:--- స్వీయ నిర్వహణ* 

🍁 *ప్రశ్న:---  క్రమం తప్పని ధ్యానం, ధ్యాన స్థితిని రోజంతా కొనసాగిస్తూ ఉండటం అనేవి ధ్యానాన్ని ఆపకుండా ఉండటంలో మొదటి మెట్టు. అయితే నిత్య జీవితంలో ధ్యానాన్ని తిరిగి తెచ్చుకోవటానికి ఏవైనా ఉపకరణాలు ఉంటే బావుంటుందని నేను ఆశిస్తున్నాను. నాకు మీ గైడెన్స్ కావాలి.* 

🍀 *పత్రీజీ :---* ఇలా చూడండి. మనస్సు ఎప్పుడూ ధ్యానాన్ని కోరుకోదు. మనస్సు ఒక విలన్. మనందరిలోనూ ఒక విలన్ ఉన్నాడు. అదే మన మనస్సు, మనమంతా మనస్సుతో పోరాడుతూనే ఉంటాం. మెడిటేషన్ అనేది మీరో. మరి హీరోకి, విలన్ కి మధ్య ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కొన్ని సార్లు విలన్ గెలుస్తాడు. ధ్యానం ఆపేస్తాం. 

🌸 హీరో గెలిచినప్పుడు మళ్ళీ ధ్యానం మొదలు పెడతాం. మనస్సు అనే విలన్ కి ధ్యానం అనే హీరోకీ మధ్య ఇది అనునిత్యం, శాశ్వతంగా జరిగే పోరాటం.

🌳 ప్రతి మూవీలో చివరాఖరికి ఎప్పుడూ హీరోనే గెలుస్తాడు కదా ! మరి హీరోయిన్ హీరోతో కలిసి ఆనందంగా ఉంటుంది. అంతులేని ఆనందం, ఆత్మానందం. ఆత్మ ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ ధ్యాన యుక్తంగా ఉంటుంది కనుక.

🌿 ఆత్మ, ధ్యానంతో కలిసి ఉండాలని, వాళ్ళకు కళ్యాణం జరగాలని కోరుకుంటుంది. ఆత్మకు ధ్యానం కావాలి. కానీ మనస్సు అడ్డు వచ్చి ఆత్మను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆత్మకు మనస్సు అవసరం లేదు. హీరోయిన్ విలన్ ని కోరుకోదు కదా ! కానీ విలన్ హీరోయిన్ని పట్టుకుంటాడు. మనస్సు ఆత్మను అడ్డుకుంటుంది. ఆత్మ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. బందీ అయిపోతుంది. హీరోయిన్ కి హీరోనే కావాలి. ఆత్మకు అనుక్షణం ధ్యానమే కావాలి. ధ్యానంతో ఉండాలి. మనస్సు అనేది విలన్. ఆత్మ అనేది హీరోయిన్. మరి ధ్యానం అనేది హీరో. అదీ లెఖ్ఖ ! 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌷 *పత్రీజీ సమాధానాలు పుస్తకం* మరియు ఇతర *పత్రీజీ పుస్తకాల సెట్* కావాల్సిన వాళ్ళు *9032596493* కి what's app msg చేయగలరు.

No comments:

Post a Comment