Thursday, September 1, 2022

నేటి కాలంలో మనం ఆనందంగా జీవించాలంటే...

  నేటి కాలంలో మనం ఆనందంగా జీవించాలంటే ఎలా ఉండాలో తెలుసుకుందాం.
శోధన, సాధన చేసిన జ్ఞానం మాత్రమే
శాశ్వతమని నమ్మండి  నిరంతరం ప్రశ్నించుకుంటూ,నిజాన్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తూ ఉండండి 
మీకు తెలిసిన ప్రపంచాన్ని,మీకు నచ్చేటట్లు చూసే అవకాశం ,ఒక్క మీకు మాత్రమే ఉంది!అని గుర్తుంచుకోండి. 
జీవితం నీది,బ్రతుకు నీది,మంచైనా చెడైనా,కష్టమైనా, సుఖమైనా నీదే కాబట్టి...నీకు ఏది ఇష్టమైతే అది చెయ్,
ఎందుకో తెలుసా...?విమర్శలకు భయపడి,నువ్వు నీ నిర్ణయాలను,
నీ ఇష్టాలను మార్చుకుంటే,రేపు నీవు ఎదుర్కోబోయే కష్టాలను,వాళ్ళెవరూ తీర్చరు!
అలాగేకష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటే ఉపయోగం లేదు.బయటపడే ప్రయత్నం చేయాలి.కాళ్లు చేతులు కదిలించకుండా దైవాన్ని ఎంత కష్టపడి ప్రార్ధించినా గట్టెక్కలేరు. ఈ ప్రయత్నాలకు ప్రాధేయపడటానికి  కూడా అర్హత కావాలి.ఇతరులకు వెలుగు చూపే ప్రయత్నం ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారైనా కొంచెమైనా చేసివుంటేనే నీకు చీకట్లు తొలగుతాయి.ఇతరులకు సాయపడటం అంటే మనకు మనం సాయం చేసుకోవడమే!ఏదో ఎవరికో మేలు చేశామని ఎవరూ పొంగిపోవలసిన అవసరం లేదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మంచి లక్షణం

సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment