180922a2002. 190822-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀638.
నేటి…
ఆచార్య సద్బోధన:
➖➖➖✍️
భగవంతుడికి ప్రియమైనది ఏమిటి??
సత్యభామ ఒకనాడు బంగారుతట్టలో కొన్ని ఫలములు తెచ్చి కృష్ణుని ముందుంచి, "ఇవి నా తోటలో పండిన పండ్లు, ఈ జాతి మరి ఎక్కడనూ లేదు" అని వాటిని గూర్చి గొప్ప గా వర్ణించినది.
కృష్ణుడు ఒక తేలిక నవ్వు నవ్వి, ఒక పండును రుచి చూచి, ఇవి సారహీనములని చప్పరించి పడవేశాడు.
ఇంతలో "గుబ్బి" అనుఒక గొల్లపిల్ల దోసిటలో కొన్ని పండ్లు తెచ్చి, "స్వామీ,! ఇవి అల్ల నేరేడుపండ్లు, స్వామి వలె శ్యామసుందరములు, అందువలన నాకు మిక్కిలి ప్రియములు, దయతో గైకొని అనుగ్రహింపవలెను." అనుచూ పాదముల మ్రోల వ్రాలినది.
కృష్ణుడు వాటి రుచిని అడుగడుగునా మెచ్చుకొనుచూ, అన్నియూ తిని వేశాడు.
నిజానికి సత్యభామ ఇచ్చిన ఫలములు విలువ కలవి, రుచి కలవి.... ఐన నేమి?ఆమె అహంభావము, స్వాతిశయము మూలమున భగవానుని దృష్టి లో అవి రసహీనము లైనవి.
గోపిక స్వచ్ఛమైన ప్రేమ, అమాయకత్వము, అణుకువ మూలమున అవి భగవంతునికి అత్యంత ప్రియంకరములైనవి.
భగవంతుడు ఎప్పుడూ - భావ ప్రియుడు కానీ - బాహ్య ప్రియుడు కాడు.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment