ఈ లోకంలో మనుషులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలను చేస్తారు ఈ దుష్కరముల ఫలితంగా మనిషికి మృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు బోధిస్తున్నాయి ఈ భోగదేహం రెండు రకాలు
ఒకటి సూక్ష్మ శరీరం ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గ లోకాలకు చేరుతుంది. రెండవది యాతనా దేహము ఇది మానవుడు చేసిన పాప ఫలాలను అనుభవించడానికి నరక లోకాలకు చేరుతుంది. మృత్యువు తరువాత వెంటనే కొత్త దేహం ధరించడం వీలుకాదు కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవి సుకృత దుష్కృత సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవించవలసి వస్తుంది
శ్రీమధ్భాగవతంలో యాతనా దేహం అనుభవించే వివిధ శిక్షలు వాటిని అమలు చేసే 28 నరకాల వర్ణన ఉన్నది వాటి సంక్షిప్త వివరణ
తామిస్ర నరకం
--------------------
పరధనాపహరణ, పర స్త్రీ, పరపుత్రహరణం వలన ఈ నరకం పొందుతాడు ఇక్కడ అంధకార బంధురమున పడవేసి ఇనుప కర్రలచే బాదుదురు
అంధతామిస్ర నరకం
----------------------------
మోసగించి స్త్రీల ధనమును తీసుకున్నవారు కండ్లు కనిపించని చీకటిలో నరికిన చెట్ల వలె నరకబడుదురు
రౌరవ నరకం
-----------------
ఇతర ప్రాణులను చంపి తన కుటుంబమును పోషించుకున్న వారిని ఇక్కడ రురువులు అను జంతువులు పాముల కన్నా ఘోరముగా హింసించును
మహారౌరవ నరకం
-------------------------
ఇతర ప్రాణులను బాధించి తన శరీరాన్ని పోషించుకునే వాడు ఈ నరకానికి చేరుతాడు పచ్చి మాంసము తిను రురుగులు వారి మాంసమును కండలు కండలుగా పీక్కుతినును
కుంభీపాక నరకం
------------------------
సజీవంగా ఉన్న పశుపక్ష్యాదులను చంపి వాటి మాంసాన్ని తిన్నవాడు ఈ నరకాన్ని పొందుతాడు సలసల కాగే నూనెలో పడవేసి గారెలు వలె వేపుదురు
కాలసూత్ర నరకం నరకం
----------------------------------
తల్లిదండ్రులను సద్భ్రాహ్మణులను వేదాలకు ద్రోహం తలపెట్టిన వారు ఈ నరకానికి వెళతారు బాగా కాలిన రాగిలాంటి నేలపై నడిపిస్తూ ఉంటే సూర్యుడు అగ్నిజ్వాల కురిపిస్తూ మాడ్చివేయును
అసిపత్ర నరకం
----------------------
వేదములను దిక్కరించిన వారు ఈ నరకాన్ని పొందుతారు కొరడాలతో గొడ్డును బాదినట్లు బాదుచు సర్వాంగములను కత్తులతో కోసి ఈ శిక్షలను అమలుపరుస్తారు
సూకర ముఖ నరకం
----------------------------
నేరము చేయకపోయినా నేరం చేశారని దండించిన రాజులను అధికారులను చెరకు గడల వలె గానుగలో పెట్టి తిప్పుదురు
అంధ కూప నరకం
-------------------------
చిన్న చిన్న ప్రాణులను చంపిన వానిని పాములు, నల్లులు, దోమలు, చీమలు మూకుమ్మడిగా దాడి చేసి హింసించును
క్రిమి భోజన నరకం
-------------------------
అతిథులకు, అనాధలకు అన్నం పెట్టక తన పొట్ట నింపుకున్నవాడు క్రిములతో నిండిన లక్ష యోజనముల కుండలో పడవేయుదురు
సందంశ నరకం
--------------------
ఇతరుల ధన ధాన్యాలను బంగారము రత్నములు దోచుకున్న వారిని మండుతున్న ఇనుప కడ్డీలతో పొడుస్తూ పటకారుతో చర్మం పీకుట వంటి శిక్షలు వేస్తారు
తప్తోర్మి నరకం
-------------------
సంభోగించరాని స్త్రీలతో సంభోగించిన మగవారు, అట్టి మగవారితో సంభోగించిన స్త్రీలు మండుచున్న ఇనప స్త్రీ ,పురుష ప్రతిమలచే కౌగిలింప చేయబడుదురు
వజ్ర కంటక నరకం
------------------------
పశువులతో ఇతర జంతువులతో సంభోగించిన వాడిని ఇనుప చవ్వల లాంటి ముళ్ళు ఉన్న బూరుగు చెట్టు మీదకి ఎక్కించి కిందకు లాగుదురు
శాల్మలి నరకం
------------------
కుల మర్యాద పాటించని రాజు లేక రాజోద్యోగి చీము, నెత్తురు, తల వెంట్రుకలు, గోళ్ళచే నిండి ఉన్న నదిలో త్రోయబడుదురు
వైతరణి వియోద నరకం
---------------------------------
సౌచము మొదలైన ఆచారములను పాటించని వారిని మలమూత్రాలచే నిండిన చెరువులో పడవేయుదురు
ప్రాణరోధ నరకం
---------------------
కుక్కలను గాడిదలను పెంచి వేటనే వృత్తిగా పెట్టుకున్న బ్రాహ్మణులను కోలలచే వేటాడి హింసించెదరు
విశ విశసనరకం
---------------------
దంభ యజ్ఞములు చేసి పశుపక్ష్యాదులను హింసించు వారిని ప్రాణాంతకమైన రకరకాల హింసలకు గురిచేసి హింసించెదరు
లాలాభక్షణ నరకం
-------------------------
కులభార్యచే వీర్యపానము చేయించిన వారిని వారిచే వీర్యపానము చేయించి అతికిరాతకముగా హింసించెదరు
సారమో యోదన నరకం
---------------------------------
ఇండ్లు తగులు పెట్టుట ,విషము పెట్టుట, బిడార్లు దోచుట గ్రామములను దోచుకొను వారిని వజ్రముల వలె కరకుగా ఉన్న కోరలు గల 700 జాగిలములు ఒకేసారి పీక్కొని తినును
అలీచారయ నరకం
--------------------------
అబద్ధ సాక్ష్యాలను చెప్పి లావాదేవీలలో మోసం చేసిన వారిని 100 యోజనముల ఎత్తైన పర్వత శిఖరముల నుండి పడద్రోసి పచ్చడి పచ్చడిగా చేయబడుదురు
రేతః పాననరకం
-----------------------
వ్రతనిష్టలో ఉండి మద్యపానము చేసిన బ్రాహ్మణులు సోమపానము చేసిన క్షత్రియ వైశ్యులను బాగా కరిగిన ఇనుమును వారిచే త్రాగింతురు
క్షాంకర్ధ నరకం
-------------------
తనకన్నా అధికులను పెద్దలను తిరస్కరించు వారిని తలక్రిందులుగా వ్రేలాడదీసి నానా బాధలు పెట్టి హింసించెదరు
రక్షో గణ భోజన నరకం
-------------------------------
నరమేధములు చేయువారిని నర మాంసము పశువుల మాంసము తిను స్త్రీ పురుషులను వాడి గల ఆయుధములచే ముక్కలు ముక్కలుగా నరికి వేసెదరు
శూల ప్రోత నరకం
------------------------
నిరపరాధులైన అడవి జంతువులను ఊర పశువులను నమ్మించి పొడిచి చంపిన వారిని శూలములచే పొడుస్తూ కంభములకు వ్రేలాడదీయుదురు
దండ శూత నరకం
---------------------------
ప్రాణికోటికి భయము కలిగించు ఉగ్ర స్వభావులను ఐదు, ఏడు తలల పాములు అనేకం కలిసి ఎలుకలను హింసించినట్లు హింసిస్తాయి
మల నిరోధన నరకం
----------------------------
ఇతరులను ఏ నేరము చేయని వారిని గదులలోను నూతులలోనూ బంధించిన వారిని విషాగ్నులు మండించి విషపు పొగలు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేయుదురు
పరావర్తన నరకం
-----------------------
అతిథులను అభ్యాగతులను మోసంతో హింసించిన వారిని కనుగ్రుడ్లను కాకులచే గ్రద్దలచే పొడిపింతురు
సూచి ముఖ నరకం
----------------------------
ధన మదాంధముతో అందరినీ చిన్నచూపు చూచిన వానిని శరీరమును దబ్బలం లాంటి సూదులతో బొంతను కుట్టినట్లు కుట్టెదరు
మీ
*ధర్మవీర్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక*
No comments:
Post a Comment