Sunday, December 18, 2022

ఎందుకు బలరాముడు( సంకర్షణుడు) కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం!

 Xi. X. 1-3.  191222-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                  సంకర్షణుడు
                  ➖➖➖✍️

మహాభారతం.. ఈ కథ ఎప్పుడు విన్నా, ఎన్నిసార్లు విన్నా, విన్న ప్రతిసారి ఒక సరికొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాము. ఇదే మహాభారతం కథ యొక్క అద్భుతం! 

ఇంతటి మహా అద్భుతమైన మహాభారతంలో కురుక్షేత్రం వంటి విషాద ఘట్టం లో యుద్ధం జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా కౌరవ వంశం మొత్తం సర్వనాశనం అయ్యింది. 

అంతేకాదు పంచ పాండవులు తమ కుమారులను కూడా కోల్పోవడం జరిగింది. 

ఐతే ఇలా ఎన్నో అనర్దాలకు దారి తీసిన ఈ కురుక్షేత్ర యుద్ధంలోకి, మహాబలశాలి అయిన బలరాముడు మాత్రం ఈ యుద్ధంలో పాల్గొనలేదు. అయితే ఎందుకు బలరాముడు కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం!

బలరాముడి మరొక పేరు సంకర్షణుడు. అంటే ఒక గర్భం నుంచి మరొక గర్భమునకు లాగిన వాడు అని అర్థం. 

దేవకీ వసుదేవులకు పుట్టిన పిల్లలందరినీ కంసుడు చంపేస్తుంటే, దేవకి ఏడవ గర్భమునందు జన్మించవలసిన బలరాముడు, ఆ విష్ణుమూర్తి ఆదేశంతో యోగమాయ సహాయం ద్వారా ఆమె గర్భం నుంచి, వసుదేవుని మరొక భార్య అయిన రోహిణీ గర్భంలోకి ప్రవేశించాడు. అందువల్ల ఇతనికి సంకర్షణుడు అనే పేరు వచ్చింది. 

బలరాముడు భగవంతుడైన                        శ్రీ కృష్ణుడు దగ్గరే ఉన్నట్లుగా ఉన్నా,         కొన్ని సందర్భాలలో మాత్రం దుర్యోధన పక్షపాతిగా కనిపిస్తారు.

కౌరవులు జూదం లో మోసం చేసి సంపాదించిన….  పాండవుల ఆస్తిని, కౌరవులు తిరిగి ఇవ్వాలి లేదా యుద్ధంలో చావాలి అని శ్రీకృష్ణుడు అంటుంటే, జూదంలో ఆస్తి పోగొట్టుకోవడం ధర్మరాజు యొక్క స్వయంకృతాపరాధాలే తప్ప, ఇందులో దుర్యోధనుడి తప్పు ఏమీ లేదు అన్నట్లుగా బలరాముడు మాట్లాడతారు. అప్పుడు భీముడు, దుర్యోధనుడి తొడలు విరిగగొడతాననీ మహా సభలో శపదం చేస్తారు. 

ఇక దుర్యోధనుడు.. వనవాసం నుంచి భీముడు తిరిగి వచ్చిన తర్వాత….    ‘యుద్ధం జరిగితే నాకు_ భీముడికే యుద్ధం జరుగుతుంది అని, అందువల్ల నేను ఇంకా గధా విద్యలో ఎంతో ప్రావీణ్యం సంపాదించి, భీముడిని ఓడించాలని, భీముడు అడవిలో ఉన్నంతకాలం.. దుర్యోధనుడు, బలరాముని దగ్గర గధ విద్య నేర్చుకున్నాడు.

శ్రీకృష్ణ భగవానుడి సహాయాన్ని అడగడానికి దుర్యోధనుడు, అర్జునుడు ద్వారకకు వచ్చినప్పుడు, వీరిని గమనించిన శ్రీకృష్ణుడు నిద్రపోతున్నట్లు నటించాడు. ముందుగా వచ్చింది దుర్యోధనుడు. ఇక గర్వశాలి కాబట్టి శ్రీకృష్ణుడి తల దగ్గర కూర్చుంటే, భక్తిశ్రద్ధలతో వచ్చిన అర్జునుడు వినయంగా శ్రీకృష్ణుడి పాదాల దగ్గర కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు నిద్ర మేల్కొని, వారితో ఇలా అన్నాడు... ‘దుర్యోధనా!నీవు అర్జునుడు కంటే ముందుగా వచ్చినా, తర్వాత వచ్చిన అర్జునుడు నా ఎదురుగా కూర్చోవడం వల్ల లేవగానే అర్జునుడినే చూశాను. ‘ 

కానీ.."నేనే ముందు వచ్చాను మీ సహాయాన్ని అడగడానికి" అని దుర్యోధనుడు అన్నాడు. 

అప్పుడు శ్రీ కృష్ణ భగవానుడు నా సహాయాన్ని రెండు భాగాలుగా చేస్తాను. ఒక భాగంలో ఏ ఆయుధమూ చేపట్టకుండా కేవలం మాట సహాయం మాత్రమే చేస్తాను. 

ఇక రెండవ భాగంలో కోట్లాదిమంది ఉన్న నారాయణ సేన ఉంటుంది. మీ ఇద్దరిలో అర్జునుడు నేను ముందు చూసిన వాడు కనుక అతడిని ముందుగా అడుగుతాను అని శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు.

అందుకు ఇద్దరూ సరే అన్నారు. అర్జునుడు ఎక్కడ నారాయణ సేనను తీసుకుంటాడేమోనని దుర్యోధనుడు భయపడుతూ ఉండంగా, అర్జునుడు మాత్రం కేవలం శ్రీకృష్ణుడిని మాత్రమే కోరుకున్నాడు. శ్రీకృష్ణుడు ఎటువైపు ఉంటే ధర్మం ఆ వైపు గెలుస్తుందనే నమ్మకం అర్జునుడిది. 

ఆ తరువాత సంతోషంగా దుర్యోధనుడు శ్రీకృష్ణుని మోసం చేశాను అంటూ నారాయణ సేన తీసుకుంటాడు. 

తిరిగి దుర్యోధనుడు బలరాముడి సహాయం కోసం వెళ్ళినప్పుడు అప్పుడు బలరాముడు భీముడికి దుర్యోధనుడికి ఇద్దరికీ నేను గధ విద్య నేర్పించాను. మీరిద్దరూ నాకు ఆప్తమిత్రులు. నేను ఎవరి పక్క ఉండలేను. శ్రీకృష్ణుడు ఎటువైపు ఉంటే అటువైపు ధర్మం ఉంటుందని, నేను ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేను అని,                     శ్రీ కృష్ణుడికి విరుద్ధంగా యుద్ధం చేయలేనని దుర్యోధనుడికి బలరాముడు చెప్పి, ఆ యుద్ధానికి దూరంగా ఉంటాడు.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
           

No comments:

Post a Comment