*🌻మానవుని పతనానికి కారణాలు.🌸*
*🪷తథాగత గౌతమ బుద్ధుడు ఒకప్పుడు శ్రావస్తీలో జేతవన విహారంలో ఉండగా రాత్రి చాలా పొద్దు పోయాక ఒక దివ్యుడు ఒకరు బుద్ధుణ్ణి ఇలా అడిగారు.*
*🍂భగవాన్ " మానవుని పతనానికి కారణాలు ఏమిటో తెలుపగలరని కోరుతున్నాను..? "*
*భగవానుడు ఈ విధంగా తన ఉపదేశించారు.*
*🌸"ఒకడు నాశనం అవ్వాలి అన్నా, అభివృద్ధి చెందాలి అన్నా అతని అలవాట్లు,అతని ప్రవర్తన,అతనికి ఉన్న సంబంధాలు కారణం అవుతాయి." అని మనిషి పతనానికి పన్నెండు కారణాలను ఇలా వివరించారు.*
*🌺1.ధర్మాన్ని ద్వేషించేవాళ్ళు నాశనము అవుతారు.*
*🍁2.మంచివారిని వ్యతిరేకించి చెడ్డ వారితో స్నేహం చేయు వాళ్ళు నాశనం అవుతారు.*
*☘️3.నిద్రావస్థలో ఉంటూ, చెడ్డ వారితో సహవాసి అయి, శ్రమించడం ఇష్టముండని వారు,సోమరితనంతో ,కోపిష్టిగా ఉండడం వల్ల నాశనం అవుతారు.*
*🍀4.ఐశ్వర్యవంతులయి ఉన్నప్పటికీ వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రులను పోషించక పోవడం నాశనానికి కారణం.*
*5.అసత్య భాషణుడు అయి సాధువుల్ని,యోగిపుంగవుల్ని మోసగించడం అయిదవ కారణం.*
*🦚6.విస్తారమయిన ఆస్తిపాస్తులు,బంగారం,ఆహారం అన్ని కలిగియుంటూ అవన్నీ తన స్వంత సుఖాలకే పరిమిత పరుచుకోవడం ఆరవ కారణం.*
*🌱7.ఆస్తిపాస్తులు,తెలివి ఉన్నాయని గర్విస్తు సాటి వారిని కించపరచడం ఏడవ కారణం.*
*🪸8.వ్యభిచారి అయి ,త్రాగుడుకు లోనై,తనకున్నదంతా జూదాలకు వ్యయ పరుచుకోడం మనిషి పతనానికి ఎనిమిదవ కారణం.*
*🌻9.తన భార్య చాలదని ఉంపుడు గత్తెల కోసం లేక ఇతరుల భార్యల కోసం వెంపర్లాడటం తొమ్మిదవ కారణం.*
*🌹10.విచ్చలవిడిగా ఖర్చుచేసే స్త్రీకి గాని ,పురుషునికి గాని ఆధిపత్యం ఇవ్వడం పదవ కారణం.*
*🌸11.గొప్ప వీరుణ్ణి అని చెబుతూ సమస్తం హస్తగతం చేసుకోవాలి అనుకోవడం మనిషి నాశనానికి కారణాలు.*
*🪴12.తనకు మాత్రమే దక్కాలి అన్న ఆశతో ఇతరులను మోసం చేయడం మనిషి పతనానికి పన్నెండవ కారణం.*
*🌾ఈ విధంగా బుద్ధుడు మనిషి పతనానికి గల 12 కారణాలు వివరించారు..*
ఈ మంచి గుణాలు అన్నీ సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం .
*✍️ఎ.ఎన్. బోధి*
🐎🪷🔱🐘🌼🦣☸️🕊️
*🌾భవతు సబ్బ మంగలమ్🎋*
No comments:
Post a Comment