ఒక రాజు గారు తన రాజ్యంలో తప్పు చేసిన వారిని,
తన వేటకుక్కలను మీదకు వదిలి,
దారుణంగా చంపించేవారు.
ఒకరోజు మంత్రి కూడా తప్పు చేశారు.
రాజు ఆయనకు కూడా అదే శిక్ష వేశారు.
మంత్రి రాజును వేడుకున్నారు. అయినా వినలేదు.
మంత్రి 10 రోజుల గడువు కోరారు.
రాజు అనుమతించారు.
ఆ సమయంలో కుక్కలను పెంచే వాడిని కోరి,
తాను కుక్కలకు అన్నీరకాల సేవలు చేశారు.
10 రోజుల తరువాత రాజు శిక్షకు ఆదేశించారు.
కానీ కుక్కలు మంత్రిని దగ్గరికి తీసుకుని ముద్దాడాయి.
రాజు ఆశ్చర్యపోయి మంత్రిని అడిగారు.
అప్పుడు మంత్రి "10 రోజుల సేవకే కుక్కలు విశ్వాసం చూపాయి.
కానీ మీరు 20సం. సేవచేసిన నన్ను,
ఒక్కతప్పుకే మరణశిక్ష వేశారు.
తప్పు ఎవరయినా చేస్తారు. కానీ పరిస్థితులను బట్టి,
వెనుకటి ప్రవర్తన బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి.
ఆవేశం కన్నా, ఆలోచన ఉండాలి.
శిక్ష విధించడం కన్నా, బంధాలు,
ప్రేమతో మార్పు తేవాలి"అన్నారు.
అలాగే మనసు మాయను మచ్చిక చేసుకోవాలి, అన్నిరకాల సమస్యలను accept చేస్తూ బుజ్జగించి ప్రేమించి బయటకు పంపాలి. కావాల్సినవి ప్రేమించి ఆహ్వానించాలి.. అందుకు సరైన సాధన చేయ్యాలి, అన్నీ నీలోనే నీతోనే ఉంటే ఎక్కడికి ఉరుకులు, పరుగులు, తెలియనప్పుడు చేశాం తప్పు లేదు తెలిశాక కూడా చేస్తే వారిని ఈ సృష్టిలో ఎవరూ మార్చలేరు, మార్పు రాదు...సత్యాన్ని తెలుసుకున్నాక కూడా సరైన సాదన చేయకపోతే చేసేదాకా జనన మరణ చక్ర బంధం లోనే తిరుగుతూ ఉంటారు... ఆన్ని సబ్జెక్ట్ లలో ఉత్తీర్ణత సాధించే వరకూ మార్చి - సెప్టెంబర్ పరీక్షలు తప్పవు.
నీకున్న రకరకాల సమస్యలు ద్వారా సమాజం, బంధు మిత్రుల నుండి అవమానాలు, హేళనలకు గురి అవ్వడం జరుగుతుంది... వాటి గురించి అలోచించి ఆవేదన పడే కన్నా వాటన్నింటి నుండి బయటపడే ప్రయత్నంనకు సమయాన్ని అనగా సరైన సాధన చేస్తే సరిపోతుంది... అపుడు అవమానించినవారే అభినందిస్తారు, హేళన చేసిన వారే కీర్తిస్తారు..
####
No comments:
Post a Comment