Friday, December 23, 2022

రమణ మహర్షి : ఉడుతలు మరియు కోతుల గురించి

 *రమణ మహర్షి : ఉడుతలు మరియు కోతుల గురించి*

*ఒక ఉడుత ఎప్పుడూ లాగే రమణ మహర్షి దగ్గరకు వచ్చింది, ఆయన దానికి జీడిపప్పు పెడుతున్నారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు. " నిన్న ఒక భక్తుడు కొన్ని జీడిపప్పులు నా ఈ మూగ స్నేహితుల కోసం పంపాను అన్నాడు. కాని ఇవి మూగావి కావు. అవి నాతో మాట్లాడుతాయి. ఎప్పుడైనా నేను స్వల్ప నిద్రలో ఉన్నప్పుడు అవి నా దగ్గరకు వచ్చి నా వేళ్ళు కొరికి మరీ నా ధ్యానము వాటి పైకి మలచుకుంటాయి. అంతే కాదు వాటికి తమ సొంత భాష ఉంటుంది. ఉడుతలలో ఒక గొప్ప నేర్చుకోవలసిన విషయం ఉంది. వాటి ముందు మీరు ఎంత ఆహారము పెట్టినా, అవి వాటికి ఎంత కావాలో అంత తిని వెళ్ళిపోతాయి. అవి ఎలుకల వలె దొరికినది అల్లా తీసుకుని తమ చిల్లి లో దాచుకోవు. "*

*భక్తుడు : బహుసా ఉడుతకు ఎలుక కన్నా తక్కువ తెలివితేటలు ఉంటాయేమో. అందుకనే అవి ఎలుక వలె భవిష్యత్ గురించి ఆలోచించక ప్రస్తుత అవసరాల గురించి ఆలోచిస్తాయి ఏమో.*

*రమణ మహర్షి : అవును. అవును. అలా ఒక పధకం ద్వారా అన్ని భవిష్యత్ కోసం దాచుకోవటం మనం తెలివితేటలు అంటాం. ఇలా ఎన్ని పక్షులు, జంతువులు హాయిగా రేపటి దిగులు లేకుండా జీవిస్తున్నాయి. అవి అన్ని మరణిస్తున్నాయా ?*

*ఇక కోతులను చూస్తే, అవి కూడా గూడు కట్టుకోవు ఏమి దాచుకోవు. వాటికి ఏది దొరికితే అవి తిని, రాత్రి అవ్వగానే చెట్టు మీదకు వెళ్లి పడుకుంటాయి. అవి చాల సంతోషం గా ఉన్నాయి కదా. నేను కోతుల సంస్దలు, వాటి రాజులు, న్యాయం, క్రమము గురించి తెలుసుకున్నాను. అంతా చాల ఖచిత్తం గా రూపొందింపబడ్డాయి. వాటి వెనుక చాలా బుద్ధిజ్ఞానం ఉన్నాయి. ఇంకా కోతులకు తపస్సు తెలియనిది కాదు.*

*మొట్టైపైయం అనే ఒక కోతి ఒకసారి కొంతమంది దుష్ట కోతుల వలన భాదింపబడినది. అప్పుడు అది బాధతో అరణ్యం లోకి వెళ్లి తపస్సు చేసి జ్ఞానము, బలము సాధించి తిరిగి వచ్చింది. అప్పుడు ఆ దుష్ట కోతులు అన్ని దానికి నమస్కరించాయి. ఖచ్చితంగా కోతులకు తపస్సు తెలుసు అని నేను అర్ధం చేసుకున్నాను.* 

No comments:

Post a Comment