భగవాన్ రమణ మహర్షి నిత్య పారాయణం
ఓం నమో భగవతే శ్రీ రమణాయ
అధ్యాయము 5
మార్పు
పై అధ్యాయమున భగవాన్ కి ఏ విధంగా ఆత్మభోద కలిగినదో విశదీకరించబడినది . శరీరము నశించిన ' నేను ' నశించునా ? ' నేను ' ఈ శరీరమేనా ? అని అనుకొనెను భగవాన్ . మరియు " ఈ శరీరము నిశ్శబ్దముగా , నిశ్చలముగా ఉంది . ( కాళ్ళు చేతులు చాచి పెదాలతో సహా బిగపట్టి శవంగా పడుకొనినప్పుడు అనుకొనిన మాటలు ) కాని జీవశక్తి ఉన్నట్లు తెలుస్తుంది . ' నేను ' అన్న శబ్దము కూడా లోలోపల వినిపిస్తుంది . పెదాలతో పలుకకపోయినా లోలోన ఆ ' నేను ' అన్న శబ్దము వినిపిస్తుంది . కాబట్టి ' నేను ' అన్నది దేహానికి అతీతమైనదని అది అతీతమైన శక్తి అని భౌతికముగా అగుపించే శరీరము చనిపోయినా మృత్యువు మటుకు ఆ చైతన్యశక్తిని తాకలేదు . దీనిని బట్టి చావులేనిదే చైతన్యమని ఆ చావులేని చైతన్యాన్ని ' నేను ' అని భగవాన్ నిర్ధారించినారు . మరియు భగవాన్ ఈ ' నేను ' యే ఆత్మ అని భగవాన్ దృష్టి ఆ ' నేను ' లేక ' ఆత్మ ' పైనే కేంద్రీకరించినారు .
ఈ మార్పు కలిగిన పిదప భగవానునిలో కొన్ని క్రొత్త మార్పులు కలిగినవి . అవి
1. సదా ఆత్మలోనుడైనారు .
2. బంధువులతో మిత్రులతో దూరముగా ఉంటూ వచ్చారు .
3. చదువులో ముందున్న కొద్ది ఆసక్తి కూడా పోయినది .
4. ధ్యాస బాహ్య వాటి పైకాక అనంతానికి తీసుకువెళ్ళింది .
5. స్నేహితులతో బంధువులతో వినయముగా ప్రవర్తించినారు .
6. ఇది వరకు ఎవరైనా కొట్టినా తిరిగి కొట్టే భగవాన్ ఇప్పుడు పట్టించుకొనక మౌనముగా ఉండేవారు .
7. స్నేహితులతో ఆటలు లేవు .
8. ఎప్పుడూ ధ్యాన నిమగ్నులై అంతర్ముఖమై ఆత్మపై ధ్యాస నిలిపేవారు .
9. ప్రతిరోజు దేవాలయమునకు వెళ్ళి శివుని ముందు ఎంతోసేపు నిలబడేవారు .
10. అలాగే శివయోగుల ప్రతిమల ముందు , మీనాక్షీదేవి ముందు నిలబడేవారు .
11. ఎటువంటి కోరికలు కోరేవారు కాదు .
పైన చూపిన మార్పులు గమనించినచో ఆత్మావలోకన కలుగక పూర్వము ఆత్మసాక్షాత్కారము కలిగిన పిదమ మనిషిలో ఎంతో వ్యత్యాసము వచ్చునని గమనించవలెను . దేహము అనుభ్రాంతిలో ఉన్నప్పుడు బంధువులు , స్నేహితులు , శత్రువులు , నా వారు , నీ వారు , నేను , వాడు ఇలా తేడాలు కన్పిస్తాయి . దీనివలన సుఖము , దుఃఖము కలుగుతాయి . రాగద్వేషాలు చెలరేగుతాయి. మాట పడకపోవటం , ఎవరైనా ఆటపట్టించినా లేదా కోప్పడినా తిరిగి దెబ్బకొట్టడం జరుగుతాయి . ఆటలలో ఉల్లాసం అదే సంతోషమని భ్రమ కల్గిస్తాయి . దేహము పై వ్యామోహము ఈ విధముగా దినదినాభివృద్ధియై జీవితముపై తీపి కలిగిచావుపై భయము కల్గుతాయి . దేహము అనుకొనువాడు సంసారములో పడి జనన మరణ చక్రములో ఒక రంగుల రాట్నము వలె క్రింద నుండి పైకి తిరిగి మళ్ళీ పై నుండి క్రిందికి పడతారు . అనగా పుట్టుట మరియు చచ్చుట ఇలా జరుగుతూనే యుండును . కావున భగవానకు కలిగిన ఆత్మబోధను జాగ్రత్తగా గమనించి తెలిసికొనిన జీవి సంసార చక్రములో పడక జీవించి ఉండగనే మోక్షము పొందగలడు . భగవాన్ భోదించిన ఆత్మభోదను మనకు కూడా అర్థమై స్వామి అనుగ్రహముచే ఆత్మానుభూతి కల్గి ఆత్మ సాక్షాత్కారము కావాలని భగవాన్ రమణుని శరణాగతి కోరుదాం .
1. పుట్టినా డెద్దయో పూనుదురే యుత్సవము
పుట్ట మన కెద్ధియను బుద్ధిగొని - పుట్టుక
గిట్టుకలే దై వెలుగు కేవల వస్తువులో
పుట్టినదే పుట్టిదినంబు.
2. పుట్టునా డైనను పుట్టుక కేడ్వక
పుట్టినా డుత్సవము బూనుట - గిట్టిన
పీనుగు నలంకరించి పెట్టుటని తన్నెఱింగి
యే నణంగటే జ్ఞానమే.
అరుణాచల శివ.
No comments:
Post a Comment