నేటి ఆణిముత్యాలు
*నిజాన్ని మార్చే శక్తి ప్రపంచానికి లేదు. కానీ, ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి వుంది.
మనల్ని మోసం చేశారని తోటివారిని, మనకోసం ఆగలేదని కాలాన్ని, ఎప్పుడూ నిందించకు.ఎందుకంటే, మోసపోవడంలో, కాలాన్ని వృధా చేయడంలో, మన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది.
మనిషి చుట్టూ మంచి - చెడు, కష్టం - నష్టం, ప్రేమ - ద్వేషం, అన్నీ వుంటాయి. మనం దేన్ని వదిలేస్తాం,! దేన్ని తీసుకుంటాం,! అన్నదాన్ని బట్టి, మన సంతోషం ఆధారపడి ఉంటుంది.*
నువ్వు బాగున్నప్పుడు, పువ్వులాంటి మాటలు విసిరినవారే,నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళలాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో,బాగున్నప్పుడు కూడా అలాగే ఉండు.రెండు సందర్భాల్లో అలాగే ఉండు.రెండు సందర్భాల్లో నీతో ఉన్న వారే నీ వారు.
కనిపించే మనిషిని మోసం చేస్తూ,కనిపించని దేవుణ్ణి మొక్కినంత మాత్రాన మంచి వాళ్ళం అయిపోము.ఎదుటివారు మనకు విలువ ఇచ్చినప్పుడు కాపాడుకోవాలి,ఎదుటి వాళ్ళ దగ్గర వీలైతే మంచిగా ఉండు, అంతే గాని మంచిగా నటించకు.
మంచి మనసుతో మంచి చేసేవారు ఏ గుడి గోపురాలు తిరగకపోయిన వారికి దేవుడి కృప ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు మంచే జరుగుతుంది.
శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం 👏
No comments:
Post a Comment