Monday, December 19, 2022

పంచ పునీతాలు....!!

 *పంచ పునీతాలు....!!*

     🌹వాక్ శుద్ధి 

     🌹దేహ శుద్ధి 

     🌹భాండ శుద్ధి 

     🌹కర్మ శుద్ధి 

     🌹మనఃశ్శుద్ధి...

      *వాక్ శుద్ధి :*

🌸వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు .... 

🌿కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు .... పగ , కసి , ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు ....

🌿మంచిగా , నెమ్మదిగా , ఆదరణతో పలకరించాలి .... అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి ....

   *దేహ శుద్ధి :*

🌸మన శరీరం దేవుని ఆలయం వంటిది .... దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ , 

🌿రెండు పూటలా స్నానం చెయ్యాలి .... 
చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు ....

   *భాండ శుద్ధి :*

🌸శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం .... అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి .... 

🌿స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది ....

   *కర్మ శుద్ధి :*

🌸అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు .... అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు .... 

🌿తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు ....

   *మన: శ్శుద్ధి :*

🌸మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి .... మనస్సు చంచలమైనది ....

 🌿ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది .... దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి .... దీని వల్ల దుఃఖం చేకూరుతుంది .... 

🌸కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి ...

🌸ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది !!

🌿ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది !!

🌸నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది !!
యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది !!

🌿సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది !!
గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది !!

🌸సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది !!పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది !!

🌿భక్తి ప్రవేశిస్తే మనిషి మహాత్ముడవుతాడు !!..
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ  కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే🌷🙏🙏🌷 🌹🌹🇮🇳👍

No comments:

Post a Comment