Tuesday, January 3, 2023

క్రోధానికి విరుగుడు ఏమిటో తెలుసుకుందాం.

ఈరోజు మంచిమాట లో క్రోధానికి విరుగుడు ఏమిటో తెలుసుకుందాం.

*క్రోధానికి విరుగుడు ప్రేమే..! కానీ, క్రోధంతో రగిలిపోయే మనస్సులో ప్రేమభావనను ఎలా కలిగించాలి?*

*ఎవరినైతే ద్వేషిస్తామో వారి గురించి మన మనస్సులో ప్రతికూల ఆలోచనలే ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. అవి మనలో ద్వేష భావానికి మరింతగా శక్తినిస్తూ ఉంటాయి, మనఃశాంతిని దూరం చేస్తాయి.* 

*కనుక, ద్వేషంగా ఉన్నప్పుడు ఒక్కసారి మన మనస్సును నిలువరించి, ఆలోచనలను గమనించి వాటిని సకారాత్మకంగా మార్చేందుకు ప్రయత్నించాలి. ద్వేషం వలన ఎంతటి నష్టం వాటిల్లుతుందో దానికి అర్ధం చేయించాలి.**ద్వేషించేవారిని మనస్ఫూర్తిగా క్షమించి, వారిపట్ల దయతో కూడిన ప్రేమ భావనను కలిగి ఉండాలి.

*ఒకరు మనల్ని ద్వేషిస్తున్నా, మనకు వేరొకరి పట్ల ద్వేషం ఉన్నా దానికి కారణం గత జన్మల కర్మ బంధన. కనుక, ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్న అందులో న్యాయమే ఉంటుంది. త్రికాలదర్శి అయి వివేకంతో చూస్తే ప్రతీ ఒక్కరి పాత్ర మనకు సమ్మతంగానే అనిపిస్తుంది.*

*ఈ ఒక్క జ్ఞాన పాయింట్ చింతన ద్వారా ద్వేషించే వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమించి,  'నీవు శుద్ధాత్మవు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను...నీపై నాకు ఎటువంటి ద్వేషం లేదు, దుఃఖాన్ని ఇచ్చిపుచ్చుకున్నందుకు నన్ను క్షమించు...ఈ క్షణం నుండి మనం ఆత్మీయులము' ...ఇలా సంకల్పాలు చేస్తూ ఉంటే కనుక మొదట స్వయం ద్వేషాన్ని కలిగించే కర్మ బంధన నుండి స్వతంత్రమై, అవతలి వ్యక్తిని కూడా స్వతంత్రునిగా చేయగలము.*ద్వేషాన్నీ ద్వేషంతో కాక ప్రేమతో జయించే శక్తి జ్ఞాన ఖడ్గానికి మాత్రమే కలదు.

శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment