Thursday, March 23, 2023

భగవంతుని చేరడానికి సాధన అవసరము

 భగవంతుని చేరడానికి సాధన అవసరము
                ➖➖➖

*మానవుడు నిత్యమూ ఆనందం, సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటాడు. కానీ ఇవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. తనలోనే ఉండిన వీటికోసం ఎక్కడెక్కడికో తిరుగుతున్నాడు. రోగము వలన కలిగే బాధలు ఎక్కడ నుండి వచ్చాయి? కాశీ నుండా? రామేశ్వరం నుండా?! అవి మన నుండియే వచ్చాయి కదా! బాధలు మన నుండియే వచ్చినపుడు సుఖ సంతోషాలు కూడా మన నుండియే రావాలి కానీ ఎక్కడో బయట నుండి ఎలా వస్తాయి!??  కాలికి ముల్లు గుచ్చుకుంటె బాధ అంటున్నాం. అదే రోడ్ మీద ఐదు వందల నోటు దొరికితే సంతోషిస్తున్నాము. అంటే సుఖ దుఃఖాలు దొరికే వస్తువు బట్టి మనలో నుండియే వస్తున్నాయి కదా! అంటే బాధలు, సంతోషాలు అన్నీ మనలోనే ఉన్నాయి. మరి మనలో ఉండిన వాటికోసం బయట ఎందుకు వెతకడం?! ఇది కేవలము భ్రమ. నిజమునకు మనలో లేనిదేది బయట లేదు. పాలలో అంతరముగా ఉన్న వెన్న రావాలంటే కవ్వం పెట్టి చిలకాలి. అలానే మనస్సును భగవన్నామము అనే కవ్వం పెట్టి చిలికితే అపుడు అనందమనే వెన్న రావడం జరుగుతుంది. లోపల సాధన చేయనిదే బయట తిరుగుతూ అది కావాలి ఇది కావాలి అంటే ఏమొస్తుంది?! 

No comments:

Post a Comment