Tuesday, March 26, 2024

స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము 19. విశాలనగరమే - విద్యానగరము - 2

 త్రిపురా రహస్యము - 31

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము 
 
 19. విశాలనగరమే - విద్యానగరము - 2  

అటువంటి ఆత్మ ఒకానొక సమయంలో ప్రకాశింపదు అంటే అది అసత్యం కదా ! ఆత్మ 'ప్రకాశించనటువంటి స్టితి ఉండదు.

 ప్రతిబింబానికి ఆధారం అద్దం.  అటువంటి అద్దం లేకపోతే ప్రతిబింబం ఏ రకంగా ఉండదో, అలాగే దేశ కాలామానాలకు ఆధారమైన ఆత్మ లేకపోతే, దేశ కాలమానాలనేవే ఉండవు. ఆత్మను దేశ కాలాదులచే పరిమితం చెయ్యటం సాధ్యంకాదు. అంటే-ఆత్మ ఇక్కడ ఉన్నది, ఇక్కడ లేదు అని చెప్పటం సాధ్యంకాదు. ఆత్మ సర్వాంతర్యామి. కాబట్టి ఆత్మ లేకపోతే ఏదీ ఉండదు. 
 
అందుచేత, కళ్ళు మూసుకుంటే కనుపించకుండా, కళ్ళు తెరిస్తే కనుపించటం జరగదు. “సామాన్య చైతన్యాన్ని నేను ఇప్పుడు ఈ రూపంలో చూస్తున్నాను” అని అనుకున్నంతకాలము ఆ స్థానము నీకు దక్కదు. ఈ భావన కూడా ఒక అజ్ఞానపు గ్రంధి. అవిధంగా లభించేది పూర్ణ చైతన్యం కాదు. ఆత్మ లేనిచోటు లేదు. కళ్ళు మూసుకుంటేనే ఆత్మ కనిపిస్తుంది అంటే, ఆత్మకు పరిమితి కల్పించినట్లవుతుంది. 
 
అటువంటి ఆత్మ, తనలో వేసిన కట్టెలను అగ్ని బూడిద చేసినట్లుగా, చరాచర జగత్తునూ తనలో లీనం చేసుకుంటుంది. ఆ విషయం గనక తెలుసుకున్నట్లెతే నీకు తెలియవలసినది ఏదీ ఉండదు. మనసును నిగ్రహించు. నీ హృదయంలోనే ఆత్మను చూస్తున్నానే భావన కూడా ఒక (గగ్రంధే. దాన్ని కోసెయ్యి బ్రహ్మానంద రూపమైన ఆత్మను దర్శించు, అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్టుగా నీలోనే సమస్త లోకాన్ని దర్శించు.  
 
మొదటగా లోపల, బయటా కూడా ద్వైత ప్రపంచాన్ని ఆత్మగా చూస్తున్నాననే భావన కలగాలి. ఆ తరువాత అన్నింటినీ ఆత్మగానే చూస్తున్నాననే భావన కలగాలి.  
 
తరువాత అన్నింటినీ ఆత్మగానే చూడాలి. ఆ తరువాత అన్నిటిలోనూ నేనే ఉన్నాను అనే భావన రావాలి. అదే నీ ఆత్మరూపం. దాన్ని దర్శించటానికి ప్రయత్నించు” అన్నది.  భార్య చెప్పిన మాటలు విన్న తరువాత హేమచూడు ని ఆంతఃకరణ పరిశుద్ధమైంది.  
 
కళ్ళు మూసుకుంటేనే ఆత్మ దర్శనమవుతుందనే భ్రాంతి తొలగిపోయింది. హేమలేఖ చెప్పినట్లే మొదట అన్నింటినీ ఆత్మగానే చూసి, చివరకు అన్నిటా తానే ఉన్నాను. అనే భావన చేశాడు. గతంలో నేను అంటే శరీరము అని ఎంతగా నమ్మడో, ఇప్పుడు నేను అంటే ఆత్మ అని నమ్ముతున్నాడు. ఆ భావనతోనే అన్ని పనులు చేస్తున్నాడు. జీవన్ముక్తుడైనాడు. 
 
హేమచూడుడు తన భార్యతోనూ, ఇతర స్తీలతోను విహరించాడు. రాజ్యాలు జయించాడు. శాస్తాలు చదివాడు. ఇతరులకు ఉపదేశించాడు. యజ్ఞయాగాదులు చేశాడు.  ఈరకంగా ఇరవైవేల సంవత్సరాలు రాజ్యం చేశాడు. 
 
కొడుకు జీవన్ముక్తుడైనాదని తండ్రి ముక్తాచూడుడు తెలునుకున్నాడు. అతడు. ఇదివరకటిలా లేడు. కష్టం కలిగితే బాధ పడటం లేదు. సుఖం కలిగితే సంతోషించటం లేదు. 

లాభనష్టాలు, జయాపజయాలు, కష్టసుఖాలు, శత్రుమిత్రులు అన్నీ సమానంగానే చూస్తున్నాడు. తనకు ఏవీ అంటకుండా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఒకనాడు ముక్తాచూడుడు కుమారుడి దగ్గరకు వచ్చి అతను ఈ విధంగా ఉండటానికి కారణమడిగాడు. 
 
హేమ చూడుడు తనస్థితి గురించి తండ్రికి, తమ్ముడికి వివరించి వారికి కూడా పరతత్త్వాన్ని ఉపదేశించాడు. వారు జీవన్ముక్తులైనారు. ఇక మంళ్రులు, సేనాపతులు, సేనా సమూహము, దాసదాసీజనము, ఒకరేమిటి ఆబాలగోపాలము పరతత్తాాన్ని గురించి తెలసుకుని జీవన్ముక్తులైనారు. 

విశాలనగరంలో అందరూ విద్యావంతులే. అందరూ పరతత్త్వాన్ని గురించే చర్చించేవారు. చివరకు శుకశారికొలు కూడా పరతత్తాన్ని గురించే మాట్లాడేవి. పూర్వజన్మ కర్మవల్ల పనులు చేసేవారు. మంచిగాని, చెడుగాని జరిగిపోయిన దాన్ని గురించి ఆలోచించరు. ఏపనిచేసినా అది కర్తవ్యము అన్నట్లుగా చేసేవారు.   
 
సనకసనందనాది మహర్షులు పరతత్త్వంతో విరాజిల్లుతున్న విశాల నగరాన్ని చూసి 'విద్యానగరము' అని దానికి నాఘకరణం చేశారు. అంటూ పదవ అధ్యాయాన్ని పూర్తి చేశాడు రత్నాకరుడు.....🙏


☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

J N RAO 🙏🙏🙏

No comments:

Post a Comment