Monday, March 25, 2024

ఐన్-స్టీన్ అనేవాడట స్పినోజా చెప్పిన దేవుడి మీద నమ్మకం!" ఉంది

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
           *భగవంతుడి మాట*
                  ➖➖➖✍️

*విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త ఆల్భర్ట్ ఐన్-స్టీన్ పలు విశ్వవిద్యాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళు అతడిని 'మీకు దేవుడి మీద నమ్మకం ఉందా?' అని అడిగేవాళ్ళట.*

*"ఉంది. స్పినోజా చెప్పిన దేవుడి మీద నమ్మకం!" అనేవాడట  ఐన్-స్టీన్.*

*స్పినోజా 17 వ శతాబ్దపు  డచ్ తాత్వికవేత్త. అతడు చెప్పినదాన్ని ఎవరో చాలా గొప్పగా తెలుగులో ఈ విధంగా అనువదించారు. ఓ సారి చూడండి !*

*దేవుడు మనిషికి చెప్పేది... స్పినోజా మాటల్లో ....*

*"...ప్రార్థనలేవీ అక్కర్లేదు. ప్రపంచం లోకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించండి. సృష్టి సర్వం తో మమేకం కండి. హాయిగా నవ్వండి. భువన గానం లో భాగం కండి.*

*ప్రార్థనా మందిరాలకు వెళ్లడం దేనికి? నేనక్కడ ఉంటానని ప్రకటిస్తూ అవన్నీ మీ నిర్మాణాలేగా! పర్వతాలూ, చొరలేని అరణ్యాలూ, నదులూ, సరోవరాలూ , సాగరతీరాలూ... ఇవీ నా నివాసాలు.*

*మీ దౌర్భాగ్యాలకు నన్ను నిందించడం వదిలెయ్యండి. మీ తప్పటడుగులూ, పాపాలతో నాకు ప్రమేయం లేదు.*

*మీ పవిత్ర గ్రంధాలతో నాకే సంబంధమూ లేదు.*

*ఒక పొద్దు పొడుపులో, ఒక నిర్జన మైదానంలో, ఒక ఆత్మీయ మిత్రుడి స్పర్శలో, మీ బిడ్డ కళ్ళలో ఉంటాను నేను. ఏవో పుస్తకాల పుటల్లో కాదు.*

*అవధి లేని ప్రేమ నేను. నేను ఏ తీర్మానాలు చెయ్యను,  నిన్ను విమర్శించను. నువ్వంటే కోపాలూ, పట్టింపులూ ఉండవు. క్షమాపణలేవీ నన్ను అడగకు. క్షమించ వలసినవేవీ ఉండవు.*

*నీ పరిధులూ , పరితాపాలూ , ఉద్వేగాలూ , సుఖాలూ అవసరాలూ అన్నీ నేను నీలో నింపినవే. అలాంటప్పుడు నీ అతిక్రమణలకు నిన్నెలా శిక్షిస్తాను నేను ?.*

*నిన్ను కాల్చివేసే నరకమొకటి నేను సృష్టించి ఉంటే నేనేం దేవుణ్ణి? నిత్య జాగృతిలో బతుకు. అదే నీ దిక్సూచి. ఇతరులు నీకేది చేయకూడదని నువ్వు భావిస్తావో అది నువ్వు వాళ్లకు చెయ్యకు.*

*బతుకంటే అదేదో పరీక్ష కాదు. ఒక రిహార్సల్ కాదు. ఏ స్వర్గద్వారాలకో పీఠిక అసలు కాదు. ఇక్కడ నడిచే , గడిచే వాస్తవం!!! అంతమాత్రంగానే చూడు దాన్ని.*

*పరిపూర్ణ స్వేచ్ఛనిచ్చాను నీకు. శిక్షలూ , పురస్కారాలూ , పాపాలూ , సద్గుణాలూ నా నిఘంటువులో మాటలు కాదు. ఏదో కలంతో వాటినెవ్వరూ నా దివాణంలో లెక్క కట్టరు. స్వర్గం, నరకం నీకు నువ్వే నిర్మించుకోవాలి. ఆ స్వేఛ్చ నీదే.*

*ఈ బతుకు ముగిశాక ఇంకొకటేదైనా ఉందో , లేదో నేను చెప్పను. కానీ దీని తరువాత ఇంకేదీ లేదన్నంత దీక్షగా బతుకు. ఇంకొక బతుకు ఉంటే ఇంతకుముందు నువ్వు ఏం చేశావు , ఇంకేం విస్మరించావు - అనే లెక్కలు నేను తిరగదోడను.*

*నన్ను నమ్మకు. నమ్మడం అన్నది ఊహాత్మకం. నిన్ను నువ్వు నమ్ముకో.      ఏ సాగర జలంలోనో ఈత కొడుతున్నప్పుడో , ఒక శిశువును హత్తుకున్నప్పుడో, పెంపుడు పశువును నిమిరేటప్పుడో నేను గుర్తురావడమే నేను ఆశించేది.*

*నీ కీర్తనలు అన్నీ వదిలెయ్యి. వాటికి ఉప్పొంగిపోతే నేనేం దైవాన్ని?  నీ ఆరోగ్యం, నీ సంబంధాలూ, సంతోషాలూ సరిచూసుకో. అదే నాకు నువ్వు పఠించే స్తోత్ర పాఠం.*

*నా గురించి ఇప్పటికే నీ బుర్ర నిండా ఉన్న సరంజామా అంతా చేజార్చుకో. చిక్కుముడి అదంతా. అద్భుతాలూ , వాటికి అన్నేసి వివరణలూ దేనికి?*

*నువ్వు ఇప్పుడు ఇక్కడ శ్వాసిస్తూ ఉన్నావ్. అంతకు మించిన అద్భుతం ఏదో ఇంకా ఎందుకు...?*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
https://t.me/omshivayanamaha143

No comments:

Post a Comment