Tuesday, March 26, 2024

****** ప్రశ్న

 హరిఓం  , 

*ప్రశ్న: మౌనమెప్పుడు అవసరం ?*

*జవాబు: ఆత్మానుభవమునకు అది ఒక సహాయకారి మాత్రమే. మాట్లాడటం శక్తిని వ్యర్థపరిచే పని అని యోగులు అంటారు. యోగులతో, మునులతో, జ్ఞానులతో సాహచర్యము మనోనిగ్రహానికి ఉపయోగపడుతుంది.*

*ప్రశ్న: ఏ పనీ చేయకుండా కేవలం ధ్యానంలోనే గడిపితే ..*

*జవాబు:  చేసిచూడు. నీలోని వాసనలు నిన్ను ఆపని చేయనీయవు. గురుకృప వలన క్రమంగా వాసనలు సన్నగిల్లితే కాని మనసు ధ్యానంలో నిలవదు.*

*ప్రశ్న: కనుబొమ్మల మధ్య ధ్యానము యొక్క ప్రాధాన్యత ఏమి ?*

*జవాబు: కనులతో ఏమి చూడవద్దని హెచ్చరిక. మనసు వస్తువులుగాను, కాంతిగాను పనిచేయును. వస్తుదృష్టి విడిస్తే కాంతి మాత్రమే మిగులుతుంది.*

*దృష్టి, గుర్తింపు అవి నీ ఇప్పటి స్థితికి సంబంధించినవి. ఎందుకంటే ఇపుడు కాంతి ఉంది. చూచేందుకు కాంతి అవసరం. అది తెలిసిన విషయమే. కాంతివంతమైన వాటిల్లో సూర్యుడి తేజస్సు గొప్పది. అందుకే దైవమును కీర్తించేటపుడు కోటిసూర్యులకాంతిని చెపుతారు.*

*ప్రశ్న: ఏ ఆసనం మంచిది.*

*జవాబు: ఏ ఆసనమైనా మంచిదే. సుఖాసనమైతే బాగుంటుంది. జ్ఞానమార్గంలో వుండేవారికి ఆసనం అంత ముఖ్యం కాదు. మనసును ఆత్మలో వుంచడమే నిజమైన ఆసనం. ఇతర ఆసనాలన్నీ శరీరమే నేను అన్నభావన వుండేవారికి మాత్రమే.*
               
*భక్తుడు* :-
   యోగి తన సిద్దులను ఇతరులను ఆత్మజ్ఞులను ( అంతర్ముఖం ) చేయటానికే ఉపయోగిస్తాడా! లేక అట్లా చేయుటకు అతని ఆత్మజ్ఞానమే చాలునా?
                
*మహర్షి* :- 
ఇతర శక్తులకన్నా అతని ఆత్మజ్ఞాన బలమే అధికము. తనలోని అహంకారం ఎంత తగ్గితే, తనకు అన్యం ( ఇతరములకన్నా తను వేరు అనే భావము ) అంత తక్కువన్న మాట. 

   ఇతరులకు నీవు ఇవ్వగల పరమ శ్రేష్ఠమైనది ఏది అంటే, ఆనందమే. అది శాంతి వలన వస్తుంది. విక్షేపం ( మనసు చెదరకుండా ఉండడం ) లేకుంటేనే శాంతి వర్థిల్ల గలదు. 
   
    మనస్సులో తలెత్తే ఆలోచనలే విక్షేపానికి మూలం. మనస్సే లేనిరోజున నిశ్చల పూర్ణశాంతి కలుగుతుంది. మనస్సును సర్వనాశనం చేయనంత వరకూ శాంతి ఆనందాలు లభించుట సాధ్యంగాదు. తనకే ఆనందం లేనివారా ఇతరులకు ఆనందం ఇవ్వగలిగేది?

  మనసే లేని పక్షంలో గుర్తించడానికి ఇతరములు కూడా ఉండవు. అందుచేత ఆత్మజ్ఞానం మాత్రమే ఇతరులకు ఆనందదాయకం కాగలదు...

               పూజ  చేయుటకు  పువ్వులు,  జపము  చేయుటకు  జపమాల  అవసరము.  కానీ,  బాహ్య  పరికరములతో  నిమిత్తము  లేకుండానే  సుగుణములను  సంపాదించవచ్చును.

            సుగుణములు  లేనివాడికి  సుగుణముల  విలువ  తెలియదు.  అందువలన  వాటిని  సంపాదించటానికి  ప్రయత్నము  చేయడు.  సహృదయము  లేనివాడు  గీతను  లోతుగా  అధ్యయనము  చేయలేడు.  భగవంతుని  ధ్యానించలేడు.  

             గుణవంతులే  భవిష్యత్తులో  ఉజ్వలంగా  ప్రకాశిస్తారు.  గుణవంతులే  శాంతికి,  సుఖానికి  వారసులు.  

            మీ  మనస్సు  ఏకాగ్రమై  నిర్మలమైతే,  మీకు  సూక్ష్మ  శక్తి  వస్తుంది.  మనస్సు  సూక్ష్మమైతేనే  కదా  సృష్టి  రహస్యాలు,  మీ  లోని  అందాలు  మీకు  తెలిసేది?
            
             మీ  శరీరానికి  శక్తి  అన్నము  వల్ల  వస్తుంది.  మీ మనస్సుకి  శక్తి  శరణాగతి  వల్ల  వస్తుంది.  మీ  శరణాగతే  గనుక  నిజమైతే  మీకు  ప్రశ్నలే  ఉదయించవు... *సర్వేజనాసుఖినోభవంతు*  ...........................                       -                                                      -            🙏🙏 .......                                         -        వలిశెట్టి  లక్ష్మి శేఖర్...                -          98660 35557 .....                                -           22.03.2024 ......

No comments:

Post a Comment