1. మూలాధార చక్రం.. గుదా స్థానం. భూతత్వం.
2. స్వాధిష్ఠాన చక్రం.. లింగ స్థానం. జల తత్వం.
3. మణిపూరక చక్రం.. నాభి స్థానం. అగ్నితత్వం.
4. అనాహత చక్రం.. హృదయస్థానం. వాయు తత్వం.
5. విశుద్ధ చక్రం.. కంఠస్థం. అగ్ని తత్వం, ఆకాశ తత్వం.
6. ఆజ్ఞ చక్రం... భ్రూమధ్యం.
7. సహస్రారం.. బ్రహ్మరంధ్రం.
1. బ్రహ్మ గ్రంధి
2. విష్ణు గ్రంధి
3. రుద్ర గ్రంధి
గ్రంధి త్రయము గ్రంధులు అంటే
ముడులు అని అర్థం.
ఇవి శరీర అంతర్భాగంలో ఉండి జీవుని పరమాత్మ వద్దకు చేరకుండా మార్గ మధ్యంలో ఉంటాయి
1. బ్రహ్మ గ్రంధి : ఈ దృశ్య ప్రపంచం దేహ ఇంద్రియములు అన్ని శాశ్వతం అని భ్రమ పడటం
అన్ని అనుభవిస్తూ భ్రాంతికి లోను కావడమే ఈ గ్రంధి లక్షణం
ఈ గ్రంధి స్వాధిష్టానం కుండలిని శక్తి దాటగానే భ్రాంతి తొలగిపోవును. బ్రహ్మ గ్రంధి ఇక్కడనే బుద్ధి వికసిస్తుంది
2. విష్ణు గ్రంధి : ఇది స్థూల శరీరంలో అంతర్లీనంగా ప్రకాశించును. సూక్ష్మ శరీరం.
ఇది ప్రాణమయ కోశం మనోమయ కోశం
విజ్ఞానమయ కోశం అనబడే సమిష్టి స్వరూపం .
భ్రాంతి భౌతిక నుండి దూరమైన విష్ణు మాయ అనబడును. అద్వైత భావ భ్రమలో పాడగలడు నేను సూక్ష్మశరీరము అని భ్రమలో అనుభవము నకు కలిగించుట ద్వారా కుండలిని శక్తి మణిపూరక నుండి విడిపడగానే విష్ణు గ్రంధి చేదించడం. సాధకుడు ఈ సూక్ష్మ శరీరం కూడా నేను కాదు అని, ఇది కూడా ఒక కల్పితమే, ఇది నా స్వరూపం కాదు అని భావన కలగడమే విజ్ఞాన జ్ఞాన స్థితికి రాగలడు సాధకుడు
3. రుద్రగ్రంధి : సమస్త శక్తులకు పుట్టినిల్లు ఆజ్ఞాచక్రం. కుండలిని శక్తి చేరగానే సాధకుడికి విశ్వ విశ్వంతరాల సమస్త విషయముల యొక్క యదార్ధ తత్వము తెలియుటయే కాక మహత్తరమైన దైవత్వం అద్భుతం దివ్య శక్తులు రాగలవు
అట్టి స్థితిలో జీవ బ్రహ్మ యొక్క సంయోగమునకు విస్మరించడం, లేదా నేను అనునది ఏదో ఇంకా సరిగా అర్థం కాక ఉండుటయే అవిద్య రూపమైన రుద్రగ్రంధి లక్షణం
ఈ రుద్రగ్రంధి చేరిన వెంటనే కుండలినీశక్తి సహస్రం కమలం చేరుతుంది. అప్పుడు
జీవుడు బ్రహ్మైక్యం చేరగానే ఆత్మ.. సూక్ష్మాతిసూక్ష్మం, అతిసూక్ష్మం, గొప్పలలో మహత్, మహా గొప్పది, సర్వవ్యాపకమైన
అనంతమైనది ఈ ఆత్మ నేను అని తెలిసి రావడమే రుద్రగ్రంధి చేదించడం అవుతుంది.
అప్పుడు సాధకుడడికి పై సంకల్పాలు లేని పరమోత్కృష్టమైన ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం పొంది నిరంతరం శుద్ధ బ్రహ్మానందం అనుభూతి కైవల్య ప్రాప్తి అందగలడు. దీని కొరకే అన్ని యోగములు, అన్ని ముద్రలు అన్ని ఆసనములు. సహస్రం వరకు కుండలిని శక్తి చేర్చుట కొరకే.
అక్కడికి కుండలినీశక్తి చేర్చిన సాధకుడు విజయం సాధించినవాడే అవుతున్నాడు.
(సేకరణ)(ఆదిత్యనారాయణ)(తిప్పానా)
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
No comments:
Post a Comment