త్రిపురా రహస్యము - 27
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉
స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము
17. ఆత్మ అంటే వెలుతురా ? చీకటా?
“గురువుగారూ ! హేమలేఖ సంసార బంధనాల గురించి తన నాధుడికి వివరించింది కదా! ఆ తరువాత ఏమైందో వివరించండి” అన్నాడు కృష్ణశర్మ. వివరించటం ప్రారంభించాడు రత్నాకరుడు.
హేమలేఖ మాటలు విన్న హేమచూడుడు చాలా ఆశ్చర్యపోయి గద్గద స్వరంతో “దేవీ నీవు చాలా నైపుణ్యము గలదానవు. నీ జ్ఞాన వైభవము అమోఘము. అద్వితీయము. నాకు అనేక విషయాలు తెలియచేశావు. నా వృత్తాంతము ఇది అని నాకు తెలియచెప్పావు. నీ తల్లియైన పరాచితి ఎవరు ? ఆమెకు ఎందుకని పుట్టుకలేదు? అసలు మనమెవరము. మన స్వరూపం ఏమిటి ?” అన్నాడు. దానికి హేమలేఖ “రాకుమారా ! ఇది చాలా రహస్యమైన విషయము. ఆతిశ్రద్ధగా విను. నిర్మలమైన మనస్సుతో ఆత్మతత్తాన్ని గురించి విచారించు.
ఆత్మ అనేది కంటికి కనిపించేది కాదు. వాక్కుతో చెప్పబడేది కాదు. అందుచేత దాన్ని గురించి ఏ విధంగానూ చెప్పలేము. ముందుగా నీ ఆత్మ స్వరూపం గురించి నువ్వు తెలుసుకో. ఆ తరువాత నీ తల్లియైన త్రిపురాదేవి గురించి తెలుసుకుందువు గాని.
ఆత్మస్వరూపాన్ని గురించి ఎక్కడా చెప్పబడలేదు. చెప్పేవారు కూడా లేరు. శుద్దబుద్ధి స్వరూపమైన నీ స్వరూపమే నీ అత్మ. శుద్ధబుద్ధి అంటే విషయభోగాలవైపు మొగ్గుచూపని బుద్ధి. ఆ బుద్ధికి కూడా ఆశ్రయమైనది ఆత్మ. కంటికి కనిపించేదంతా నిషేధిస్తే చివరకు మిగిలేదే ఆత్మ. ఆత్మ అనేది అన్ని జీవుల యందు పిపీలికాది బ్రహ్మ పర్యంతము నిండి ఉన్నది. అంటే ఆత్మ అన్నింటినీ ప్రకాశింపచేస్తుంది. కాని అది దేనిచేత ప్రకాశింప చెయ్యబడదు. అది అన్నిచోట్లా ఉంటుంది. ఏ ప్రమాణాలకూ అందదు. దేనితోనూ నిరూపితం కాదు. ఎవరైనా “ఆత్మ స్వరూపాన్ని నాకు తెలియచెయ్యి' అని అడిగితే అతడు 'నా కళ్ళు నాకు చూపించు” అని అడిగినట్లే. గురువుకూడా నీకు ఆత్మ సాక్షాత్కారానికి మార్గాన్ని మాత్రమే చెప్పగలడు. అంతేకాని ఆత్మసాక్షాత్కారం చేయించలేడు. సాధకుడి మనసు బహిర్ముఖమైనప్పుడు, అంటే విషయవాంఛల మీద లగ్నమయినప్పుడు అతడు ఆత్మకు దూరమవుతాడు. అప్పుడు గురువు శిష్యుడి మనస్సు అంతర్ముఖం చేసి ఆత్మసాక్షాత్మారానికి మార్గం చూపిస్తాడు. ఆ మార్గాన్ని నేను ఇప్పుడు నీకు వివరిస్తాను. శ్రద్ధగా వినవలసినది.
నీకు 'నాది” అనిపించేదంతా నువ్వు కాదు. నీది అంతకన్నా కాదు. నాది అనే దానికన్న వేరైనది ఏదైతే ఉన్నదో అదే నీ నిజస్వరూపము. వెళ్ళి ఏకాంతంగా కూర్చుని, నీ వివేకాన్ని ఉపయోగించి పరిశీలించు. నాది అనిపించే వాటన్నింటినీ వదిలెయ్యి.
చివరకు మిగిలేదేదో అదే నీ ఆత్మ. భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు ఏవీ నువ్వు కాదు. నీవి కావు. వీటన్నింటినీ వదిలెయ్యి. దేన్నయితే వదలటానికి సాధ్యం కాదో, అదే నీ ఆత్మ అని తెలుసుకుని శ్రేయస్సు పొందు.” అన్నది.
ఆ మాటలు విన్న రాకుమారుడు గుర్రమెక్కి నగరందాటి, అవతలగా ఉన్న తన ఉద్యానవనం చేరాడు. అందులో స్పటిక నిర్మితమందిరం ఉన్నది. ఆ మందిరంలోకి ప్రవేశించాడు. సేవకులందరినీ వదిలేశాడు. “నేను ఏకాంతంగా ఉండటానికి వెడుతున్నాను. నా కోసం ఎవరు వచ్చినా, చివరకు రాజుగారైనా సరే లోపలకు రానీయవద్దు” అని చెప్పి మందిరాంతర్భాగాన తొమ్మిదవ అంతస్తుకు వెళ్ళి, అక్కడ సుఖంగా కూర్చుని మనసును ఏకాగ్రం చేసి హేమలేఖ చెప్పినట్లుగా ఆలోచించటం ప్రారంభించాడు.
అ లోకంలోని జనం అంతా మోహంతో పడిపోయి ఉన్నారు. వీరెవరికీ తన ఆత్మగురించి తెలియదు. అందరూ తమ లాభం కోసం ఏదో ఒక పని చేస్తుంటారు. వేదశాస్తాలు చదివినా, వ్యవసాయం చేసిన, వ్యాపారం చేసినా అంతా తమ లాభం కోసమే. ఆత్మను గురించి తెలుసుకోకుండా ఏ పని చేసినా ఉపయోగం ఏమీ లేదు. ఈ రకంగా ఆలోచించి ముందుగా దేహాన్ని గురించి ఆలోచిస్తున్నాడు.
దేహం అంటే ఆత్మకాదు అని ఆలోచించటం ప్రారంభించాడు. రక్తము, మాంసము, ఎముకలు, మజ్జ చర్మము, మలమూత్రాలు వీటితో కలిసినదే ఈ దేహము. ఇది ప్రతిదినము వృద్ది పొందుతూ ఉంటుంది. లేదా క్షీణిస్తూ ఉంటుంది. చివరకు నశిస్తుంది. అలాంటి కనిపించింది. అలాగే స్వప్రకాశము, చిదేక రసము, అయిన ఆత్మతత్త్వము పూర్వవాసనలచే కలిగిన మనోవికల్పముచే ఆవరించబడిన దానివలె ఉంటుంది. ఎప్పుడైతే మనసును నిగ్రహించామో, అప్పుడు ఆ వికల్పాలు అన్నీ నశిస్తాయి. అప్పుడు ఆత్మస్వరూపము గోచరిస్తుంది. కుండను చీకటి ఆవరించి ఉన్నట్లే ఆత్మకన్న ఇతరములైన మానసిక భావాలు వేరుగా ఉంటాయి అనుకోవాలి....🙏
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
J N RAO 🙏🙏🙏
No comments:
Post a Comment