Monday, March 25, 2024

****విద్యాగీత

 త్రిపురా రహస్యము - 65
================

స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము 
 
విద్యాగీత - 3 

6. మోక్షానికి సాధనము : మోక్షం సాధించాలంటే తత్పరత్వము కావాలి. అది ఉంటే ఇతర సాధనలు ఏవీ అవసరం లేదు. 'తత్పరత్వము' అంటే - దానియందు శ్రద్ద, మోక్షాన్ని సాధించి తీరుతాను అనే పట్టుదల. సాధించాలి అనే తీవ్రజిజ్ఞాస. అది ఉన్నవాడికి, బుద్దిలోని నిర్మలత్వాన్నిబట్టి కొంచెం ముందు వెనుకలుగా ఫలితం లభిస్తుంది. బుద్దికి అనేక దోషాలున్నాయి. అవే పురుషార్థాలను నాశనం చేస్తాయి. అందువల్లనే మానవుడు సంసారబంధనాలలో పడిచిక్కుకుపోతున్నాడు. ఈ దోషాలలో ముఖ్యమైనవి.  
 
1. గురువాక్యం మీద (శ్రద్ధ లేకపోవటం (అవిశ్వాసము) 
 
2, కామవాసన 3. చిత్తమౌధ్యము. 
 
1. అవిశ్వాసం ; ఇది రెండు రకాలు : 1) సంశయము, 2) విపర్యయము 
 
మోక్షమున్నదో, లేదో అనేది సంశయం. మోక్షం లేనే లేదు అనేది విపర్వ్యయం. తత్పరత్వం రావాలంటే ఈ రెండూ ఉండకూడదు. ఇక్కడ నిశ్చయ జ్ఞానమే కావాలి. మోక్షమున్నది. అంతే అసలు తర్మమే అవిశ్వాసానికి మూలం. అందుకు తరాన్ని వదిలిపెట్టాలి. అప్పుడు నిశ్చయబుద్ది కలుగుతుంది. శాస్తాలయందు విశ్వాసం కలుగుతుంది. 
 
2 కామవాసన : ఇదే ఐహిక వాంఛ. ఇహలోక సుఖాలమీద కోరికలున్నప్పుడు మోక్షంమీద అపేక్ష ఉండదు. అందుచేతనే వాసనలు జ్ఞానానికి ప్రతిబంధకాలు. లోకంలో పురుషుడు ధనధాన్యాలను, తాను కోరుకున్న స్రీనే తప్ప ఇతరాలను గమనించడు. అతనికి ఏ ఉపదేశం తలకెక్కదు. దీన్ని కేవలము వైరాగ్యంతోనే జయించాలి. 
 
3. చిత్తమౌధ్యం : బుద్దిలేకపోవటం. దీనికి కేవలము సాధన ఒక్కటే మార్గం. సాధన ద్వారానే మనసుకు ఏకాగ్రత సాధించాలి. 
 
7. ఎవడు సాధకుడు : తత్పరత్వం ఉన్నవాడే సాధకుడు. సాధకులలో కూడానా భక్తుడు సర్వపూజ్యుడు. ఉత్తముడు. అతని సాధన ఫలించి తీరుతుంది. 
 
8. సిద్ధుడు : దేహమే ఆత్మ అనే భావన అందరికీ సహజంగా ఉంటుంది. ఆ రకంగా 'దేహాత్మభావన' లేకపోవటమే సిద్ది. సుషుప్తిలో కూడా దేహాత్మభావన అనేది 
ఉండదు. కాని అది తమోగుణ ప్రధానము. మూధస్టితి. దేహము, ఆత్మ వేరు వేరని తెలుసుకోలేకపోవటమే ఈ అనర్ధ్జానికి కారణం. అన్నింటికీ కారణం ఆత్మ ఒక్కటే అనే భావన రావాలి. ఈ విషయం తెలిసిన తరువాత సాధించే సిద్ధులు ఇంక ఏవీ లేవు. 
 
9. ఉత్తమమైన సిద్ధి: అణిమాది అష్టసిద్ధులు సాధించటం జరుగుతుంది. అవి 
 
1. అణిమ - శరీరాన్ని అతిచిన్నదిగా చెయ్యటం 
 
2. మహిమ  - శరీరాన్ని అతిపెద్దదిగా చెయ్యటం 
 
3. గరిమ - శరీరం బరువు విపరీతంగా పెంచటం 
 
4 లఘిమ - శరీరం బరువు పూర్తిగా తగ్గించి వెయ్యటం. 
 
5. ప్రాప్తి - కావలసిన వస్తువులు పొందటం. 
 
6. ప్రాకామ్యము - ఆకాశ సంచారము 
 
7, ఈశిత్వము - సమస్తానికీ అధికారము పొందటం 
 
8. వసిత్వము  - సమస్త భూతాలను లోబరచుకోవటం 
 
ఇవన్నీ దేశకాలములచే పరిచ్చిన్నమైనవి. ప్రళయందాకానే ఉంటాయి. కాని ఆత్మజ్ఞానము అలా కాదు. ఇది సంపూర్ణ చిదానందస్వరూపము. మిగిలిన సిద్ధులన్నీ ఇందులోని చిన్న చిన్న అంశాలు మాత్రమే. అందుకే ఉత్తమమైన సిద్ది ఆత్మజ్ఞానము తప్ప వేరు కాదు. 
 
10. సిద్ధులలో శ్రేష్టుడు : జ్ఞానసిద్ధిలో ఉత్తమ, మధ్యమ, అధమ అని మూడు రకాలు ఉన్నాయి. ఉత్తములు తమ పని తాము చేస్తూనే మిగిలిన పనులు కూడా చెయ్యగలుగుతారు. 
 
అంటే ఒకేసారి అనేకమైన పనులు చేస్తారు. మధ్యములు ఏ పనీ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే తమ మనసుకు ఒక పనిమీద లగ్నం చెయ్యగలుగుతారు. అధములు ఏ పనీ లేకపోయినా ఒక పనిమీద ఆసక్తి ఉంటెనే ఆ పని చెయ్యగలుగుతారు. 
 
అత్మవిజ్ఞాన సిద్ధికూడా ఇలాగే మూడు రకాలుగా ఉంటుంది. రాజ్యపాలనలో మునిగిపోయినా, ఆత్మజ్ఞానమందు ఏకాగ్రత లేకపోయినా జనకాదులకు కలిగినది 
ఉత్తమసిద్ధి. లోకవ్యవహారాలలో లేనప్పుడు, ఏకాగ్రమైన మనస్సు లేకపోయినా కలిగేది మధ్యమసిద్ది. లోకవ్యవహారాలు లేనప్పుడు మాత్రమే కలిగేది అధమసిద్ది. 
 
వీటన్నింటిలోనూ ఉత్తమసిద్ధియే జ్ఞానస్థితిలో చివరి దశ. స్వప్నదశలోను, బావ్యా వ్యవహారదశలోను కూడా 'పరమాత్మను నేనే” అనే జ్ఞానం గనక ప్రకాశించినట్లైతే, అది పరమోత్తమ దశ. లోక వ్యవహారంలో అతనికి సహజమైన సంకల్పం కలగదు. అతడికి పూర్వవాసనలుండవు, అయినప్పటికీ ప్రయత్న పూర్వకంగా సంకల్పాలను తెచ్చుకొని ప్రవర్తిస్తాడు. ఆ స్టితియే పరాకాష్ట. అటువంటివాడు లోకవ్యవహారంలో అద్వైత భావన చూస్తున్నా చూడనట్లే లెక్క ఆప్పుడు అతడి జ్ఞానసిద్ధి పరిపూర్ణమయిందన్న మాట. ఇటువంటి స్థితి పొందినవాడు ఉత్తమ సిద్ధుడు. అటువంటి సిద్దుడికి నాకు తేడా ఉండదు అంటూ పరమేశ్వరి మహర్షుల సంశయాలను తీర్చింది. 
 
పరశురామా ! భగవద్గీతను చెప్పిన శ్రీకృష్ణుడు కూడా శరీరధారియేనయ్యా ! కాని ఈ విద్వాగీతను సాక్షాత్తూ పరబ్రహ్న స్వరూపమయిన పరమేశ్వరి చెప్పింది. అన్నాడు దత్తాత్రేయుడు అంటూ ఇరవైయవ అధ్యాయం ముగించాడు రత్నాకరుడు.
                                                    
🪷⚛️✡️🕉️🪷

No comments:

Post a Comment