*🍁ఆనందం*🍁
✍️ మురళీ మోహన్
👌ఒక ఆఫీసులో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన సెమినార్ జరుగుతోంది. పాల్గొన్న యాభై మందికీ శిక్షకుడు తలా ఒక బెలూన్ ఇచ్చి దాని మీద వారి పేరు రాయమన్నాడు. అందరూ రాశాక తీసుకెళ్లి పక్కన ఖాళీగా ఉన్న ఓ గదిలో పెట్టి రమ్మన్నాడు. అలాగే పెట్టి వచ్చారు. తర్వాత మళ్లీ అందర్నీ ఎవరి బెలూన్ వాళ్లు ఐదే నిమిషాల్లో తెచ్చుకోవాలని చెప్పాడు. అందరూ ఒకర్ని తోసుకుంటూ ఒకరు గదిలోకి పరుగులు తీశారు. కిందామీదా పడ్డారు. అందరికీ దూరంగా తమ పేరున్న బెలూన్ కన్పించినట్టే కన్పిస్తోంది. అందరినీ తోసుకుని దగ్గరకెళ్లేసరికి మాయమైపోతోంది. ఐదు నిమిషాలైనా ఎవరి బెలూన్ వారికి దొరకలేదు. అప్పుడిక ఎవరికి దొరికిన బెలూన్ వారు తీసుకొచ్చి, దాని మీద ఎవరి పేరుంటే వారికి ఇవ్వమని చెప్పాడు శిక్షకుడు. ఏ గొడవా లేకుండా రెండే నిమిషాల్లో ఎవరి చేతికి వారి పేరున్న బెలూన్లు వచ్చేశాయి. అందరూ వాటిని పట్టుకుని నవ్వుతూ నిలబడ్డారు. అప్పుడు చెప్పాడు శిక్షకుడు- *ఆనందం కూడా అంతే. మనకోసం మనం వెతుక్కుంటే దొరకదు. ఇతరులకు సహాయపడినప్పుడే మన ఆనందం మనకు దొరుకుతుంది*... అని!😄
No comments:
Post a Comment