*🌺☘ *శ్రీ రమణుల బోధ:*
🌺☘* *ప్రశ్న: భగవాన్!దైవాన్ని చూసే మార్గం ఏమిటి? మహర్షి: దైవాన్ని ఎక్కడ చూడాలి? దాని కన్నా ముందు, నిన్ను నువ్వు చూసుకోగలవా? నిన్ను నువ్వు చూసుకోగలిగితే దైవాన్ని కూడ చూడగలవు. మన కళ్లను మనం చూసుకోగలమా? అవి మనకు కనిపించవు కాబట్టి "నాకు కళ్ళు" లేవు అనగలమా?అలాగే ఎప్పుడూ చూస్తూనే ఉన్నా, దైవాన్ని చూడనట్లే ఉంటుంది. మనం భగవంతుడి కన్నా వేరేగా ఉన్నాము అనే ఆలోచన దైవాన్ని చూడటానికి ప్రతిబంధకం. ఇది నశించడమే దైవాన్ని దర్శించడం. నిజానికి "నేను" భగవంతుడి నుంచి వేరుగా ఉన్నాను అనే ఆలోచన అతి విచిత్రం! పెద్ద వింత!*
*శ్రీ రమణ మహర్షి*.🙏
No comments:
Post a Comment