. *లోకం ! ఈ లోకంలో మనం !*
. ***************************
అనంతమైనది ఈ సువిశాల ఆకాశం !
ఐనా అందులో కొంతే మనకవకాశం !
ఏమిటో ఏమో మన ఇప్పటి రోజులు !
తీర్చుకొనుటకే మన నాగరిక మోజులు !
ఎవరి జీవితం ఎపుడెటులవునో !
ఎవరికెవరు ఏమౌతు ఉందురో !
ఎల్ల కాలముండనిది జీవితం !
ఎపుడెవ్విటికో ఇది ప్రభావితం !
మంచికొ చెడుకో తెలియదు కానీ
బ్రతుకున ఎన్నో మార్పులు చేర్పులు !
అందులొ కొన్నీ స్వయంకృతమైతే
మన ప్రమేయమూ లేనివి ఎన్నో !
ప్రపంచమున మన తీరు తెన్నులూ
ఒకలా ఉండవు మనసులు మనువులు !
ఇంతేగా మన గతులు సంగతులు !
మన మతుల స్మృతులు సంస్కృతులు !
సమ్మతులూ ! ఇంకెన్నో అసమ్మతులూ !
ఇష్టాలూ, ఆయిష్టాలూ ! మిత్ర శత్రుత్వాలూ !
కుటుంబాలు, బంధువులు, ఇతరులూ
చచ్చిన పిదప వీరందరు మాయం !
కాలం ఎపుడూ అసలాగనిదీ !
కలకాలం ఆగక కొనసాగేదీ !
మన జీవన గమనం ఎపుడో ఆగేదీ !
పుట్టితి మెపుడో ! బ్రతికేదిపుడూ చచ్చేదెపుడో !
ఒడుదొడుకుల ఈ జీవన పయనం ఎన్నాళ్ళో !?
ఇంతకె మనలో స్వార్థం, తలబిరుసుతనం !
పెడదారిన బడుతూ తిరిగెడి వైనం !
చాలు చాలు ! మారుమ ఇకనైనా !
మంచిని ఆశ్రయించి బ్రతికి తరించుమ !
పదుగురితో నీ స్నేహశీలతే
కృషి, పట్టుదల, సమాలోచనలే
చక్కని సుగతీ, ప్రగతుల బాటగునులె !
ఇది మనది విధి !
సద్గతుల సారథ్యమిది !
ఇదే సంతృప్తుల సన్నిధి !
ఇదే స్వర్గ సోపాన వారధి !
**********************
రచన:---రుద్ర మాణిక్యం.(✍️కవి రత్న)
రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా)
************************************
No comments:
Post a Comment