**వజ్రవైచనీ, చిన్నమస్త విద్య**
**మన యొక్క సనాతన ధర్మం ఓ అద్భుతమైన దివ్య గ్రంధాలు మరియు కావ్య నిథి మాత్రమే కాదు, అద్భుతమైన కథల సాగరం కూడా, ఇందులో ఎప్పుడూ నిత్య సత్యం అనే సీక్రెట్ కోడ్స్ తో నిండి ఉంది,**
**మొత్తం మానవ ప్రపంచం రాబోయే ఆటంకాలు, ప్రమాదాలు,అనేక ఈతి బాధలు ఎదుర్కోవడానికి నిరంతరం వివిధ ప్రణాళికలను సిద్ధం చేస్తూ ఉంటుంది అలాగే మనుగడ కోసం వివిధ రకాల పరిష్కార మార్గాల ప్రయత్నం చేస్తుంది, కానీ పరిస్థితి పరిదికి మించిన మూలం నుంచి ఏదో తెలియని సంక్షోభం ఉద్భవిస్తూనే ఉంది, ఇది ఎందుకు ఇలా జరిగింది?, ప్రతీ జీవి యొక్క మెదడు శక్తి ఎంతో గొప్పది అని మెదడుకు అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని శాస్త్రవేత్తలు సైతం ఎన్నో పరిశోధనలు చేసి చెప్పారు, అయినప్పటికీ ఈ మెదడు యొక్క పరిది అసంపూర్ణమైనది, మన యొక్క పంచ ఇంద్రియాల యొక్క పరిమితి కూడా చాలా తక్కువ**
**పంచ ముఖ, షణ్ముఖ, దశ ముఖ, లేక త్రిముఖి కూడా 360 డిగ్రీల వృత్తంలో దర్శనాన్ని చూడలేరు**
**మానవ మెదడు చాలా చిన్నది, పరిది తక్కువ, ఇంద్రియాల సామర్థ్యం కూడా తక్కువ, మెదడు మొత్తం సమాచారాన్ని సేకరించి, బద్రపరచి, అపారమైన జ్ఞాపకాలు, జ్ఞానంతో నిండి పోయి ఉంది, కానీ ఇక్కడ ఇంత తెలిసినా ఇంతటి విజ్ఞానం మన మెదడులో నిక్షిప్తం చేసి ఉంచినా నిత్య సత్యం యొక్క వాస్తవ రూపం దర్శనం కాదు, ఎంతో అనుభవం ఉన్న ఓ ప్రొఫెసర్ యొక్క మనసు కూడా పరిమితం, ఎంతో గొప్ప అవగాహన ఉన్న రచయిత కూడా తన మెదడు పరిది దాటి కొత్తవి రాయలేడు, ఓ గొప్ప ప్రవచన కర్త కూడా మెదడు పరిమితి దాటి కొత్తవి చెప్పలేడు, కాబట్టి అతి త్వరలో వీరి యొక్క రచనలు వీరి యొక్క ప్రసంగం యొక్క వైభవం కూడా ముగిసిపోతుంది, ప్రజలు కూడా మర్చిపోతారు**
**మన మెదడు కంటే కొన్ని కోటానుకోట్ల రెట్లు అద్భతమైనది, ఏదైనా ప్రత్యేకమైన కాంతి మనసు పరిమితులను దాటితే తప్ప సాధ్యం కాదు**
**ప్రతీ జీవికి, మనిషికి తన మెదడు పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది, చేయి విరిగినా పర్వాలేదు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే మళ్లీ చేయి నైయం అవుతుంది, కాలు విరిగినా పర్వాలేదు, వేలు తెగిపోయినా పర్వాలేదు, మెదడు తప్ప మిగిలిన శరీర బాగాలకు ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు ఉన్నాయి, ప్రతీ అవయవం కూడా మెదడు పని తీరు సరిగా ఉంటే చాలు అనే విధంగా నిర్మాణం చేయబడింది, కానీ మెదడుకి మాత్రం ఎటువంటి ఇబ్బందీ కలుగకూడదు అని పని చేస్తుంది శరీరం**
**కానీ ఈ యొక్క మహావిద్య యొక్క విశేషం ఏమిటంటే ఈ మెదడునే లేపేస్తుంది, అప్పుడు ఒకటి కాదు రెండు కాదు పది కాదు ఏకంగా సహస్ర శీర్ష తో జీవించాలి అని ఈ మహావిద్య యొక్క లక్ష్యం*
No comments:
Post a Comment