🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
మూలం : " కపాల మోక్షం" అనే మోక్ష సాధనా గ్రంథం
అనుభవం, అనుభూతి, రచన : శ్రీ పవనానంద సరస్వతి
శీర్షిక : మనుజుని లోని చక్రాలు - చక్రాల జాగృతి, శుద్ధి, ఆధీనం, విభేదనం - మనుజునిలో గల శరీరాలు
మన శరీరం ఐదు శరీరాలుగా... స్థూల, సూక్ష్మ, కారణ, సంకల్ప, ఆకాశ శరీరాలుగా ఉంటాయి. ఇందులో స్థూల శరీరము నాలుగు నుండి 24 అడుగుల దాకా ఉంటే, సూక్ష్మ శరీరము 83 అంగుళాలు నుండి మూడు అడుగుల దాకా ఉంటే,కారణ శరీరం మూడు అడుగుల నుండి బొటనవేలు ఆకారం వరకు, సంకల్పం బొటనవేలు ఆకారం నుండి అంగుళం ఆకారం వరకు, ఆకాశ శరీరం అంగుళం నుండి రేణువు అంత పరిమాణంలో ఉంటుంది. అలాగే స్థూల శరీరము బయటికి కనిపించే శరీర స్వరూపంగా చెప్పబడుతుంది. ఇక సూక్ష్మశరీరము తెల్లని కాంతితో కంటికి కనిపించని ఆత్మశక్తితో ఉంటుంది. ఇంకా కారణ శరీరము సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. ఇక కారణ శరీరము బొటనవేలు అంత ఉంటుంది. ఇక సంకల్ప శరీరము అంగుళం అంత ఉంటుంది. ఇక ఆకాశ శరీరము పిండి పరమాణువు అంత ఉంటుంది. ఇక యోగచక్రాలు విషయానికి వస్తే మన శరీరంలో 13 ప్రధాన యోగ చక్రాలు ఉంటాయి. అవి వరుసగా 1.మూలాధార చక్రం 2.స్వాధిష్ఠాన చక్రం 3.మణిపూరక చక్రము 4.అనాహత చక్రము 5.విశుద్ధి చక్రము 6.ఆజ్ఞా చక్రము 7.గుణ చక్రము 8.కర్మచక్రం 9. కాలచక్రం 10.బ్రహ్మ చక్రం 11.సహస్రార చక్రం 12.హృదయ చక్రం 13. బ్రహ్మచక్రము(బ్రహ్మరంధ్రం) ఇలా మన సూక్ష్మ శరీరంలో 13 యోగ చక్రాలు ఉంటాయి. మన సూక్ష్మ శరీరంలో మూడు యోగ నాడులతో అనగా ఇడా పింగళ సుషుమ్న నాడులతో మూడు త్రివేణి గ్రంథులు అనగా బ్రహ్మ - విష్ణు - రుద్ర గ్రంధులతో అనుసంధానం అయి ఉంటాయి. మూలాధార స్వాధిష్ఠాన చక్రం పైన బ్రహ్మ గ్రంధి అలాగే మణిపూరక అనాహత చక్రాల పైన విష్ణు గ్రంధి అలాగే విశుద్ధి ఆజ్ఞా చక్రం పైన రుద్రగ్రంథి ఉంటాయి. అలాగే ఈ చక్రాలు కలిసి అనుసంధానం అవుతాయి. అనగా మూలాధార చక్రము - ఆజ్ఞాచక్రంతో, అలాగే స్వాధిష్ఠాన చక్రం - విశుద్ధిచక్రంతో, అలాగే మణిపూరక చక్రం- అనాహత చక్రం తోనూ అనుసంధానమై ఉంటాయి. అలాగే ఈ చక్రాలు స్థూల శరీరం లోని వివిధ అంగాలతో అనుసంధానమై వాటి మీద ప్రభావం చూపుతాయి. చక్రాలు బలంగా ఉంటే అంగాలు బలంగా ఉంటాయి. ఒకవేళ చక్రాలు బలహీన పడితే అంగాలు కూడా బలహీనపడి వివిధ రకాల వ్యాధులు వస్తాయి అని తెలుసుకున్నాను. అలాగే యోగ చక్రాలకి ఆయా చక్ర దేవతలుంటారని వాటికి బీజాక్షరాలు ఉంటాయని వీటికి క్షేత్రాలు ఉంటాయని ,వాటికి ఆయా చక్రాలు యోగ మాయలు అలాగే యోగ శక్తులు ఉంటాయని తెలుసుకున్నాను.
చక్ర స్థితుల వివరణ:
ఒక విషయం తెలుసుకోండి. పన్నెండు యోగ చక్రాలు మొదట జాగృతి, శుద్ధి,ఆధీనం, విభేదనం జరగాలి. ఇందులో విభేదనం స్థితి అనేది సాధకుడు తన జీవ సమాధి స్థితిలోకి వెళ్ళేముందు చేసుకుంటాడు. తర్వాత అతను జీవ సమాధి సిద్ధి పొందుతాడు. కానీ 13 యోగ చక్రాల జాగృతికి మూడు నెలల నుండి 12 సంవత్సరాలు ఒక్కొక్క చక్రం జాగృతి పడుతుంది. ఇది చక్రాల జాగృతి అయిన తర్వాతే చక్రాల శుద్ధి ఆరంభమవుతుంది. మళ్లీ ఇది ఆరు నెలల నుండి 12 సంవత్సరముల వరకు ఒక్కొక్క చక్రం శుద్ధి అవ్వడానికి సమయం పడుతుంది. ఇది చక్రాల శుద్ధి అయిన తర్వాతనే యోగ చక్రాలు ఆధీనం స్థితికి వస్తాయి. ఆధీనం అవ్వాలంటే పన్నెండు చక్రాలు 12 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత నాలుగవ స్థితి అనేది కేవలం తీవ్రధ్యాన స్థితిలో సాధకుడు ఉంటే 48 నిమిషాల్లో విభేదనం చెంది సమాధి స్థితి పొందుతాడు లేదంటే 21 రోజుల సమయం పడుతుంది. ఇక ఆ తర్వాత జరిగే విభేదనం విధానానికి శరీరము తట్టుకోలేక అకాల శరీరత్యాగం అనగా సమాధి స్థితి పొంద కుండా మరణం పొంద వలసి వస్తుందని రామకృష్ణ పరమహంస సెలవిచ్చారు. అంటే ఈ లెక్కన చూస్తే యోగ చక్రాలు జాగృతి,శుద్ధి, ఆధీనముకు వరుసగా 36 నెలలు (12X3),72 నెలలు(12X6),12సంవత్సరాలు పడుతుంది. మొత్తం కలిపి 36 నెలలు అంటే మూడు సంవత్సరములు, 72 నెలలు అంటే ఆరు సంవత్సరములు మరియు 12 సంవత్సరములు అనగా 3 + 6 + 12 = 21 సంవత్సరాలు పడుతుంది. అదే మీరు చక్రాల జాగృతి మరియు సిద్ది అలాగే ఆధీనానికి ఒక్కొక్క సంవత్సరం తీసుకుంటే 36 సంవత్సరాలు పడుతుంది. ఒక సంవత్సరంలో ఒక చక్రం జాగృతి కాకుండా ఎక్కువ సంవత్సరాలు పడితే ఆ లెక్కన చూస్తే ఈ మానవ జన్మ సరిపోదు.ఒకవేళ మీ అదృష్టం బాగుండి గత జన్మలో మీరు ఈ సాధన స్థాయిలో ఒక దానిని పూర్తి చేసి తర్వాత స్థాయికి వస్తే అక్కడ నుండి చక్రాల స్థితి ప్రారంభం అవుతుందని తెలుసుకోండి.ఉదాహరణకు మీరు క్రింద జన్మలోనే చక్రాలు జాగృతి చేసుకుంటే ఈ జన్మలో చక్రాల శుద్ధి నుండి ప్రారంభం అవుతుంది. మీరు ఒకవేళ క్రిందటి జన్మ లోచక్రాల జాగృతి, చక్రాల శుద్ధి చేసుకుని ఉంటే ఈ జన్మలో మీ పరిస్థితి చక్ర ఆధీనంతో మీ సాధన స్థితి ఆరంభమవుతుంది. గత జన్మలో కేవలం కుండలినీ శక్తిని జాగృతం చేసుకుంటే ఈ జన్మలో చక్రాల జాగృతి, శుద్ధి, ఆధీనం, విభేదనం దాకా మీ ఈ సాధన స్థితి కొనసాగుతుంది.
ఒకవేళ మీరు ఈ స్థితిలో ఎక్కడైనా యోగ మాయలో పడి వ్యామోహం చెందితే అంతటితో ఆ సాధన స్థితి వద్ద ఈ సాధన ఆగిపోయి మరుసటి జన్మలో ఎక్కడైతే ఆగిపోయారో అక్కడనుండి మీ సాధన స్థితి ఆరంభం అవుతుందని గ్రహించండి.
ఇక్కడ చిన్న సందేహం రావచ్చు. అసలు మనం చక్ర జాగృతి లేదా చక్రశుద్ధి లేదా చక్ర ఆధీనం లేదా చక్ర విభేదనంలో ఎందులో ఉన్నామో ఎలా తెలుసుకోగలము ? ఇది తెలియాలంటే మీకు వచ్చే గురువులు బట్టి మీరు ఏ చక్ర స్థితిలో ఉన్నారో తెలుస్తుంది. ఒకవేళ మీకు మంత్ర గురువు వస్తే మీరు చక్ర జాగృతి లో ఉన్నట్లుగా అదే మీకు ఏదైనా పుణ్యక్షేత్రంలో మీకు దీక్ష గురువుగా వస్తే మీరు చక్ర శుద్ధిలో ఉన్నట్లుగా,అదే మీకు మోక్ష క్షేత్రాలలో పరమ గురువు వస్తే మీరు చక్రం విభేదనంలో ఉన్నట్లుగా భావించుకోవాలి. అలాగే మీకున్న నాలుగు రకాల గ్రంధులు అనగా బ్రహ్మగ్రంధి, విష్ణుగ్రంధి, రుద్రగ్రంధి, హృదయ గ్రంధి జాగృతి, శుద్ధి, ఆధీనం,విభేదనం కు ఒక్కొక్క దానికి మళ్లీ ఒక నెల నుండి ఆరు నెలలు పడుతుంది.వీటి కోసం విశ్వ గురు దత్తాత్రేయ స్వామి అలాగే జగద్గురువులు శ్రీకృష్ణుడు వస్తారు. ఒకవేళ మీకు తాము వచ్చినట్లుగా ప్రత్యక్ష దైవం అనుభవాలు ఇస్తే మీరు చక్ర గ్రంధిలలో ఏదో ఒక గ్రంధిని జాగృతి, శుద్ధి, ఆధీనం,విభేదనం చేసుకోటానికి ఈ జన్మలో ఉన్నారని గ్రహించండి.
No comments:
Post a Comment