*ధ్యాన 😌మార్గ*
లౌకికుడు మొసలిలాంటివాడు. ఎలాంటి ఆయుధాలకైనా దాని చర్మం దుర్భేద్యం కదా! కడుపుమీద కొడితేనేగాని అది చావదు. అదే విధంగా లౌకికుడికి నువ్వు ఎంత హితబోధ చేసినా, అతడిపై అతడికెంత వెగటు పుట్టించినా అతడు అంటిపట్టుకొన్న విషయాలనుండి ఇవతలకు లాగితేగాని తన పరిస్థితులను అతడు గుర్తించలేడు. శ్రీ రామకృష్ణ
😌😌😌
మైలపట్టిన అద్దం సూర్యకిరణాలను ప్రతిఫలింప చెయ్యలేదు. అలాగే మాయామోహితులైన మలినహృదయులు, అపవిత్ర హృదయులు భగవన్మహిమను చూడలేరు. కానీ నిర్మలమైన అద్దం సూర్యుణ్ణి ప్రతిఫలింపచేసే రీతిలో పవిత్ర హృదయులు భగవంతుణ్ణి చూడగలరు. కాబట్టి పవిత్రుడవుకమ్ము.
శ్రీ రామకృష్ణ
😌😌😌
ఇతరులలో దోషాలను అందరూ కనిపెట్టగలరు, కాని కొందరు మాత్రమే వారి సుగుణాలను గమనించగలరు. ఇతరుల సామర్థ్యాన్ని గుర్తించాలి.
😌😌😌
మకిలపట్టిన అద్దం సూర్యకిరణాలను ప్రతిఫలింప చెయ్యలేదు. అలాగే మాయామోహితులైన మలినహృదయులు, అపవిత్ర హృదయులు భగవన్మహిమను చూడలేరు. కానీ నిర్మలమైన అద్దం సూర్యుణ్ణి ప్రతిఫలింపచేసే రీతిలో పవిత్ర హృదయులు భగవంతుణ్ణి చూడగలరు. కాబట్టి పవిత్రుడవుకమ్ము.
No comments:
Post a Comment