Thursday, January 2, 2025

*లక్షల శ్లోకాలు గల* *"మహాభారత" సారాంశం...* *తొమ్మిది వాక్యాలలో...*

 *జై శ్రీకృష్ణ.....*

*లక్షల శ్లోకాలు గల*
*"మహాభారత" సారాంశం...*
*తొమ్మిది వాక్యాలలో...*

*మీరు 'ఏ మతస్తులు' అయినా, స్త్రీ లేక పురుషుడు అయినా, బీదా ధనిక అయినా ఏ ప్రాంతం వారైనా సరే.. ఆణిముత్యాలు వంటి "ఈ తొమ్మిది వాక్యాలలో మహాభారత సారాంశం తెలుసుకోండి".*

1. *మీ పిల్లల 'అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు' తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి,మీ ఆధీనంలోంచి దూరం అవుతారు... వారి ఆధీనంలో కి మీరు వెళ్తారు.*
*ఉదా:-  "కౌరవులు."*

2. *నువ్వు ఎంత బలవంతుడు అయినా,ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ..ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ.. వాటిని 'అధర్మం' కోసం వినియోగిస్తే..అవి నిరుపయోగమవుతాయి.*
*ఉదా:- "కర్ణుడు"*

3. *యోగ్యత తెలుసుకోకుండా 'పుత్ర వాత్సల్యం' తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది.*
*ఉదా:- "అశ్వత్థామ".*

4. *పాత్రత తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ 'నిర్వీర్యుడై' బ్రతకవలసి వస్తుంది.*
*ఉదా :-" భీష్ముడు."*

5. *సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము  'దురహంకారం' తో అధర్మం గా వినియోగిస్తే వినాశం జరుగుతుంది.*
*ఉదా :-"దుర్యోధనుడు "*

6. *"స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు,గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా తనవారి పట్ల వల్లమాలిన అభిమానం గల అంధునికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది".*
*ఉదా:- "ధృతరాష్ట్రుడు."*

7. *తెలివితేటలకి 'ధర్మం, సుజ్ఞానం' తోడైతే విజయం తప్పక లభిస్తుంది.*
*ఉదా:- "అర్జునుడు".*

8. *'మోసం,కపటం,' జిత్తులమారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు.*
*ఉదా:- "శకుని."*

9. *నీవు 'నైతిక విలువలు' పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు హానిచేయదు.*
*ఉదా :- "యుధిష్ఠిరుడు."*


*🌷||సర్వం శ్రీ కృష్ణార్పణ మస్తు||🌷*
🍁🍁🍁 🙏🕉️🙏 🍁🍁🍁

No comments:

Post a Comment