వ్యక్తి యొక్క విలువ దేనితో?
వివేకానందుడు అన్నాడు :
. “మీ దేశంలో బట్టలే వ్యక్తికి విలువైనవి కానీ నేను ఈ ఏ దేశం నుండి వచ్చానో అక్కడ మనిషి యొక్క వ్యక్తిత్వంతో అతడి విలువను లెక్కించడం జరుగుతుంది, బట్టలకు ఎలాంటి ప్రత్యేకమైన విలువా ఉండదు.”
స్వామీ వివేకానంద అమెరికాలో ఎక్కడికో వెళుతూ ఉన్నాడు. సాదా సీదా సాధువు దుస్తులు, తలకు తలపాగా, మెడలో ఎలాంటి టై లేదు. అలాంటి వేషధారణను చూసి అక్కడివారు అనుకున్నారు 'ఇతడు విచిత్రమైన వ్యక్తి.' కాబట్టి వారు ‘హోయ్ హోయ్...' అంటూ అతడి వెంటపడ్డారు. వివేకా నందుడు వెళుతూ ఉన్నాడు అలాగే అతడిని తమాషాను కోరుకునే వాళ్ళు వెంట వెంట వెళుతూ ఉన్నారు. ఒక వ్యక్తి అతడిని కావాలని నెట్టాడు. అతడిని ఇంగ్లీషు భాషలో నెట్టడానికి గల కారణాన్ని అడుగగా అతడు సిగ్గుతో నత్తి-నత్తిగా క్షమించమని కోరుతూ అడిగాడు : “మీరు అలాంటి వేషధారణను ఎందుకు ధరించారు?"
వివేకానందుడు అన్నాడు : “మీ దేశంలో బట్టలే వ్యక్తికి విలువైనవి కానీ నేను ఈ ఏ దేశం నుండి వచ్చానో అక్కడ మనిషి యొక్క వ్యక్తిత్వంతో అతడి విలువను లెక్కించడం జరుగుతుంది, బట్టలకు ఎలాంటి ప్రత్యేకమైన విలువా ఉండదు.”
అమాయకులు బయటి టై-పాయింట్లను చూసి ప్రభావితులౌతారు. బుద్ధిమంతులు వ్యక్తిత్వానికి విలువనిస్తారు. బుద్ధిమంతుల ఎదుట టై-ప్యాంట్లకు ఎలాంటి విలువా ఉండదు. మన దేశం వేడితో కూడిన ప్రాంతం, ఇక టై కట్టుకోవలసిన అవసరం ఏముంటుంది ? చూపించుకోవాల్సిన అవసరం ఏముంది ? మెడకు కట్టుకుని తనను గొప్పగా భావించుకోవడం వివేకం అనిపించుకోదు. ఎవరి హృదయం విశాలంగా ఉంటుందో అలాగే ఎవరైతే గొప్పలో గొప్పయగు భగవంతుని కొరకు అందరితో వ్యవహరిస్తారో వారు గొప్ప.
No comments:
Post a Comment