*#మరిచిపోతున్నాం....*
🦚🌹🌻💎🪷🌈
*తెలుసుకోవడమే* *మరిచిపోతున్నాం*
*ప్రపంచంలో జరిగే*
*యుద్దాల గురించి*
*అన్యాయాల గురించి*
*ప్రతిరోజు ఆరా తీస్తూ*
*మన పక్కనున్న మనుషుల్ని*
*పట్టించుకోకుండా పక్కకు తప్పుకుంటున్నాం*
*తెలుసుకోవడమే* *మరిచిపోతున్నాం*
*అమ్మ ను వంట గదిలో వదిలిపెట్టి*
*అమ్మకైన గాయాలను ఖాతరు చేయకుండా*
*ఏం కర్రీ చేసావంటూ పైపైకి*
*నవ్వుతూ అడుగుతున్నాం*
*తెలుసుకోవడమే* *మరిచిపోతున్నాం*
*నాన్నను డబ్బులు అడగడమే తప్పా*
*నాన్న మన కోసం చేస్తున్న*
*అప్పులెన్నీ*
*కడుతున్న వడ్డీ లెన్నీ*
*పడుతున్న పాట్లెన్నీ*
*అడగడం మరిచిపోతున్నాం*
*తెలుసుకోవడమే* *మరిచిపోతున్నాం*
*మనకున్న ఎకరాలు ఎన్నో గుర్తుపెట్టుకొని*
*నాన్న వాటిని కాపాడడానికి పడుతున్న కష్టాలను* *లోలోపల కార్చుతున్న కన్నీళ్లను* *గుర్తించలేకపోతున్నాం*
*బాధ్యతలు బరువులు మోసీ మోసీ*
*కుంగిపోయిన నాన్న వెన్ను ను*
*బక్కచిక్కిన అమ్మను*
*కనీసం దగ్గరికి* *తీసుకోలేకపోతున్నాం*
*వీకెండ్ విందుల్లో విలాసాల్లో*
*మునిగితేలి*
*ప్రపంచాన్ని మరిచిపోవడమే*
*మన ప్రపంచం* *అనుకుంటున్నాం*
*ఇక్కడ మందు బాటిళ్లు, చికెన్ ముక్కలు*సిగరెట్ డబ్బాలే కాదు*
*అంతకన్నా మత్తు నిచ్చే* *మనుషులు ఉన్నారని* *మరిచిపోతున్నాం*
*తెలుసుకోవడమే* *మరిచిపోతున్నాం*
*క్లబ్బులు పబ్బులే కాదు*
*మనల్ని తిరిగి మనుషుల్ని*
*చేసే పుస్తకాలు ఉన్నాయని*
*మన స్వేచ్ఛ స్వాతంత్రాల* *కోసం వాళ్ళ ప్రాణాలనే* *పణంగా పెట్టిన పోరాట* *యోధులు ఉన్నారని*
*మరిచిపోతున్నాం*
*తెలుసుకోవడమే* *మరిచిపోతున్నాం*
*ఎప్పుడంటే అప్పుడు బిర్యానీ*
*ఆర్డర్ పెట్టుకొని*
*తినే మనం*
*కలుషిత ఆహారం తిని*
*విగత జీవులైన విద్యార్థులు*
*ఉన్నారని*
*తెలుసుకోవడమే* *మరిచిపోతున్నాం*
*తెలుసుకోవడమే* *మరిచిపోతున్నాం*
*అర్ధరాత్రి బెనిఫిట్ షోలకు వెళ్లి*
*తిరిగి వచ్చే కొడుకు కోసం*
*భర్త కోసం*
*తెల్లవార్లు ఎదురుచూసే*
*తలుపు గడియ తీసే ఉంచే*
*మన అమ్మ , భార్య మన కోసం ఉన్నారని*
*ఎదురుచూస్తుంటారని మరిచిపోతున్నాం*
🦚🌹🌻💎💜🌈
No comments:
Post a Comment