*మన కోసం-మంచి మాటలు*
🕉️🌞🌎🏵️🦚🪷🚩
*💧అమృత బిందువులు🔺*
*🌟నేడు స్వామి వివేకానంద జయంతి*
_*స్త్రీ తత్వం మాతృత్వం*_
🕉️🌞🌎🏵️🦚🪷🚩
*_🍁ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే పద్దతుల్లోనూ అంతే శ్రద్ధ పాటించాలి._*
*_మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు... బలహీనులని భావిస్తే.. బలహీనులే అవుతారు.. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు._*
*💎స్వామి వివేకానంద*
*వేద పురుషుల హృదయాన్ని, మహర్షుల నైతికతను వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకొని ఆచరణాత్మక విధానాలు రూపొందించినవాడు, తానుగా ఆచరించి చూపినవాడు, మన సంస్కృతి సాంప్రదాయాలను ఖండాంతరాలు దాటించిన వాడు, భారతీయ స్త్రీల విశిష్టతను చాటి చెప్పిన వాడు, విశ్వమానవాళి నవశకం వైపు పరుగులు తీయాలని కోరుకున్న వాడు వివేకానందుడు.*
*స్వామి వివేకానంద ప్రపంచ మత సమ్మేళనంలో భారతదేశానికి, హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ 1893 సెప్టెంబర్ 11న చికాగోలో ప్రపంచవ్యాప్తంగా పలు మతాల ప్రతినిధులు పాల్గొన్న సమ్మేళనంలో ప్రసంగిస్తూ “ప్రియ మైన అమెరికా సోదర సోదరీమణులారా!” అని సంబోధిస్తూ ప్రారంభించడంతోనే శ్రోతలను ఆక ట్టుకున్నారు.*
*సాధారణంగా “లేడిస్ అండ్ జెంటిల్ మెన్” అన్న సంబోధనకు అలవాటుపడ్డ వారిని ఈ పిలుపులోని ఆత్మీయత ఆకర్షించింది.*
*ఆయన సందేశానికి, వాక్ఫటిమకు, నిజాయితీతో కూడిన సంభాషణకు అక్కడి ప్రతినిధులు* *ఆకర్షితులయ్యారు. అమెరికన్ పత్రికలు సైతం వివేకానందుని వ్యక్తిత్వం సందేశాన్ని ప్రశంసించాయి. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలో అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి* *వివేకానందుడే.*
*మన సంస్కృతిలో మహిళకు ఇచ్చిన స్థానం, గౌరవం గురించి మాట్లాడుతూ నేటి భారతీయ మహిళ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విద్యలేక పోవటం. ఎలాంటి సమస్యనైన విద్య మాత్రమే పరిష్కరిస్తుంది. సమాజం మహిళ విద్యకోసం గట్టి ప్రయత్నాలు చేయకపోవటం విచారకరమని, వేద కాలం లోనే మహిళలు విద్యను అభ్యసిం చారని, గార్గె, మైత్రేయి వంటి మహిళామణులు.. పీఠాలను అలంకరించారని అంటూ చికాగో సభలో వివేకానందుడు చెప్పారు.*
*తన దేశం అలాంటి స్థితికి రావాలని, చరిత్ర పునరావృతమవుతుందనే ఆకాంక్షని వ్యక్తం చేశారు. భారతీయ మహిళలు ఆదర్శ మహిళలని వారిని గురించి ప్రపంచం ఎంతో తెలుసుకోవలసి ఉందని అనేవారు.*
*భారతదేశంలో స్త్రీత్వం అంటే మాతృత్వమే. నిస్వార్ధత, త్యాగశీలత సహనము ఈ గుణాలతో విలసిల్లే స్త్రీ మూర్తియే మాతృమూర్తి అనేవారు. స్త్రీ పురుషుల సమానత్వానికి కృషి చేసిన ఆధునిక నాయకుడు. సమాజాభివృద్ధికి స్త్రీ పురుషులు బండికి ఉన్న రెండు చక్రాల వంటి వారని సమాజం అనే పక్షి ఎగరాలంటే రెండు రెక్కలుండాలని, ఒక రెక్కతో ఎగరలేదని వివేకానంద చెప్పేవారు.*
*భారతీయ తత్వవేత్త, గొప్ప మేధావి స్వామి వివేకానంద సందేశాలు సూటిగా యువత హృదయాన్ని తాకుతాయి.*
_*యువ శక్తి తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదని ఆయన యువతకు ఇచ్చిన సందేశాల్లో ఇదో మచ్చు తునక....*_
*లేవండి.. మేల్కోండి.. గమ్యం చేరే వరకు ఎక్కడా నిలవకండి.. ఎప్పుడూ జాగృతంగానే ఉండండి. బలమే జీవితం, బలహీనతే మరణం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలని వివేకానందుడు కోరుకునేవాడు.*
*ఆధునిక యువతపైనే తనకు విశ్వాసం ఉందని, తను నిర్మించిన ఆదర్శాన్ని దేశమంతా వ్యాప్తి చేసేది వారేనని, అలాంటి యువత ముందు బలిష్టంగాను, జీవ సంపన్నులుగాను, ఆత్మ విశ్వాసులు గాను ఋజువర్తనులుగాను మారాలని, అలాంటి యువత వందమంది ఉన్నా చాలని ఈ ప్రపంచాన్నే మార్చవచ్చని యువశక్తిని స్వామి వివేకానంద కొనియాడారు.*
*జీవితం మిథ్య అన్న ఆలోచనను పక్కన పడేసి పని చేయడం మొదలు పెట్టాలంటారు. నూరేళ్ల పుణ్యకాలాన్ని గాలికి, ధూళికి, దేవుడికి, దయ్యానికి వదిలిస్తే మనంగా బతికేదెప్పుడు, పనిచేసేదెప్పుడు, పుట్టినందుకు సార్ధకత సాధించేదెప్పుడు అంటారు వివేకానంద.*
*దేవుడు పరీక్షిస్తున్నాడు, కాలం కలిసి రావడం లేదు, అంతా నా తలరాత అంటూ కష్టాన్ని తెచ్చుకుంటూ కూచోడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. నీ జీవితానికి నువ్వే కర్తవు, నీ జీవితానికి సంబంధించిన బాధ్యత అంతా నీదే, నీ విధికి నువ్వే కర్తవు. తలరాత అంటూ వేరే లేదు. నీ తలరాతను నువ్వే రాసుకోవాలి. ధాతవు, విధాతవు అన్నీ నువ్వే అంటాడు.*
*మనిషి మనిషిగా చక్కగా చల్లగా బతకాలంటే సహనం, శాంతం కావాలి. ఒక్క క్షణం సహనంగా ఉండగలిగితే అనేక ప్రమాదాలు తప్పుతాయి. క్షణకాలం అసహనంతో అనర్థాలు జరిగి పోతాయి అంటాడు. మనిషి రాణించడానికి విజ్ఞానం, వివేకం ఎలా అవసరమో, శాంతం సహనం కూడా అంతే అవసరం అంటాడు. లోకంలో చాలా మంది తోచిందనో, తోచలేదనో ఎదుటి వారితో మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సార్లు వాళ్ల పనులు చెడగొట్టేస్తూ మాట్లాడుతారు. అయిన దానికి, కాని దానికి సలహాలు, సూచనలు అడుగు తుంటారు. అలా చేసి అందరిని ఇబ్బంది పెట్టడం కన్నా మనలో ఉన్న మనిషితో మాట్లాడండి. అద్భు తమైన సలహాలిస్తాడు. అలా చేయకపోతే జీవితంలో ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే మధుర అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతారు అంటాడు వివేకా నంద.*
*కనుక పక్కవారిని సలహాలు, సూచనలు అడగటానికి ముందు మిమ్మల్ని మీరు సంప్రదించండి. దాన్నే ఆత్మావలోకనం అంటారు. ఆత్మ విచారణ చేశాకే మరెవరితోనైనా మాట్లాడండి. అద్భుతాలు చేయడానికి ఇదొక మహత్తరమైన చిట్కా. వివేకానందుడు చెప్పిన సూచనను గౌరవిద్దాం. ఆచరిద్దాం జీవితకాలం బాగుపడదాం.*
*”దేనికీ భయపడవద్దు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకూ పనికి రాకుండా పోతారు. ఈ ప్రపంచంలో దు:ఖానికి మూలకారణం భయమే. నిర్భయమే మనకు సర్వాన్ని ప్రసాదించగలదు. భయరాహిత్యమే అనిర్వచనీయమైన మనశ్శాంతికి మార్గం.*
*- వివేకానంద*
_*వివేకానందుని జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ వారు ఇచ్చిన సందేశాలను, పాటించడానికి అందరూ తమ వంతు కృషి చేయాలని కోరుకుంటూ....!*
*⚖️-✍🏻*
🕉️🌞🌎🏵️🦚🪷🚩
No comments:
Post a Comment