మితిమీరిన భక్తి
నిజమైన భక్తులు ప్రతి మనిషిలో, వస్తువులో దైవాన్ని చూడగలరు గోవిందా!
చేసిన పాపాలన్నీ ఆ ఒక్కరోజు దర్శనంతో పటాపంచలు కావు గోవిందా!
దీని పేరు అతి భక్తి లేక అవివేకం అనుకోవాలా గోవిందా!
పోలీసులు, యాజమాన్యం కూడా మితిమీరిన వెర్రిని ఆపలేరు గోవిందా!
ప్రజల వెర్రికి కాపలా కాస్తుంటే ఇక ప్రభుత్వానికి అభివృద్ధి చేసే సమయం ఏది గోవిందా!
మంచితనంతో, సన్మార్గంలో జీవిస్తే నీలోనే దైవాన్ని దర్శించవచ్చు గోవిందా!
నీ ఆత్రం, ఆవేశం దైవమైనా మెచ్చడు గోవిందా!
తోసుకుంటూ తొక్కుకుంటూ అందరినీ ఇబ్బంది పెట్టే పైశాచిక దర్శనం ఎందుకు గోవిందా!
దైవదర్శనానికి అర్థం మార్చేసిన గొర్రెల మంద మేలుకోవాలి గోవిందా!
ఇకనైనా మారకుంటే మీతో పాటు పక్కవాళ్ళ జీవితాలు కూడా గుంపులో గోవిందా.!
No comments:
Post a Comment