అప్పాజీ కి ముందే తెల్సా?హనుమాన్ వచ్చాడా?goose bumps తెప్పించే వీడియో@nandurihemamalini
శ్రీమతే నమః మొన్న ఈ మధ్య అప్పాజీ అంటే గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కోకిలని నాలుగేళ్ల అమ్మాయి చేత భగవద్గీత చెప్పించారు ఏ శ్లోకం అడిగినా అమ్మాయి చెప్పేస్తుంది నువ్వు కర్మ యోగంలో ఒక శ్లోకం చెప్పు జ్ఞాన యోగంలో ఒక శ్లోకం చెప్పు అంటే ఆ అమ్మాయి చెప్పేస్తుంది అప్పుడు స్వామి వారు చెప్తూ ఏమన్నారు అంటే ఈ కోకిల అనే నాలుగు సంవత్సరాల అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు ఆ అమ్మాయిని కడుపుతో ఉన్నప్పుడు భగవద్గీత విను అని చెప్పి స్వామీజీ చెప్పారట స్వామీజీ చెప్పిన మీదట ఈ కోకిల వాళ్ళ అమ్మగారు భగవద్గీతను విన్నారట కడుపులో ఉండగానే ఈ కోకిల ఇంకా భూమి మీదకి రాకముందు నుంచి భగవద్గీత వాళ్ళ అమ్మ పొట్టలో ఉన్నప్పటి నుంచే నేర్చుకుంది ఆ అద్భుతమే మనకి వీడియోలో చూపించారు అన్నమాట నాలుగు సంవత్సరాల వయసుకే మొత్తం భగవద్గీతని ఔపోసన పట్టేసింది ఇలాంటివి చూసినప్పుడు మనకు అనిపిస్తుంది నిజంగా ఇలాంటివి జరుగుతాయా అని మనకి పురాణాలలో అభిమన్యుడు ప్రహ్లాదుడు చిన్నప్పుడే వాళ్ళ అమ్మ కడుపులో ఉండగానే అన్ని నేర్చుకున్నారు అని మనకి పురాణ కథలు చదువుతున్నప్పుడు దానిని ఒక మిత్గా చూస్తాం పురాణాలని మైథాలజీ అంటాం వాటిల్ని కథలుగా ప్రచారం చేశాం కాబట్టి కథలుగానే మిగిలిపోయాయి అవి జరిగాయా లేదా అని అనుకుంటాం కానీ ఇప్పుడు ఈ సంఘటన చూస్తే మనకు ఏమనిపిస్తుంది నిజమే కదా అని అనిపిస్తుంది అయితే మనం ఎప్పుడూ ఏదైనా సరే సైన్స్ చెప్తేనే నమ్ముతాం మనకి భగవంతుడు భగవద్గీత భాగవతం ఇలా పురాణాలకు సంబంధించి దేవుడు అంటే మనం నమ్మం సైన్స్ చెప్పాలి సైన్స్ కిను భగవంతుడికి లింక్ చేస్తేనే ఏదైనా నమ్ముతాం అంతే అలా అక్కడికి వెళ్ళిపోయాం అంతే ఏ భగవంతుడు గురించి విషయం చెప్పాలి అన్నా ఇదిగో ఇక్కడ సైన్స్ చెప్పింది అంటే అవునా సైన్స్ చెప్పిందా అని అప్పుడు నమ్ముతాం కానీ అప్పుడు అభిమన్యుడు ఇలా విన్నాడు అప్పుడు ప్రహ్లాదుడు ఇలా చేశాడట అంటే మనం నమ్మం హిందుస్తాన్ టైమ్స్ అని ఒక పత్రిక ఒక జర్నల్ ని పోస్ట్ చేసింది అన్నమాట సైన్స్ అనే వారపత్రికలో వేసిన విషయాన్ని ఇందులో ప్రచురించారు దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు అంటే మనకి అమెరికా అనంగానే అమెరికా వాళ్ళు చెప్తే మనకి నమ్మకం శంఖంలో పోస్తేనే తీర్థం అని మనం నమ్ముతాం కదా అలాగే అమెరికా వాళ్ళు జపాన్ వాళ్ళు జర్మనీ వాళ్ళు చెప్పారు అంటే అవును వాళ్ళు చెప్పారు కదా వాళ్ళు చెప్తే నిజమే అంటాం భారతీయులు మన భారతీయ ఋషులు మన శాస్త్రజ్ఞులు చెప్పారు అంటే అది మనకు పెద్దగా నమ్మకం ఉండదు ఎందుకంటే ఎప్పుడూ కూడా పక్కింటి పుల్ల కూడా మనకి రుచి కాబట్టి వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి నిజమే కడుపుతో ఉన్నప్పుడు అభిమన్యుడు ప్రహ్లాదుడు వీళ్ళందరూ కూడా నేర్చుకున్నారు అని చెప్పి దానిని బేస్ గా తీసుకున్నారు మళ్ళీ వాళ్ళకి కూడా బేస్ ఏం కావాల్సి వచ్చింది ఈ అభిమన్యుడి కథ అలాగే ప్రహ్లాదుడు గురించి అవే బేస్ గా తీసుకుని వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తే వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే కడుపులో ఉన్న ఈ పిండం వింటుంది వినే శక్తి దానికి ఉంటుంది అలా ప్రతి రోజు ఆ కడుపులో ఉన్న బేబీ తో మాట్లాడటం మొదలు పెడితే పుట్టిన తర్వాత తల్లి ఏదైతే మాట్లాడుతుందో ఆ ఇంపాక్ట్ ఆ పిల్లల మీద ఉంటుంది అని వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి దానిని ఒక జర్నల్ గా ముద్రిస్తే అప్పుడు దాన్ని మనం చదువుకొని అవును నిజమే వీళ్ళు ఇలా నిరూపించారని అప్పుడు మనం నమ్ముతాం మీ కోసమే ఈ ఫస్ట్ ఈ జర్నల్ ని నేను నేను కూడా చదువుతాను వాళ్ళు ఇంగ్లీష్ లో చూపించారు నేను తెలుగులో మీకు చెప్తాను ఒకసారి చూడండి ఇందులో రాసి ఉంది ఏంటంటే అమెరికన్ శాస్త్రజ్ఞుల పరిశోధనల ఆధారంగా పుట్టబోయే శిశువులు సైతం వినగలుగుతారని విషయాలు నేర్చుకోగలుగుతారని వెల్లడైంది అంటే మహాభారత కథలోని అభిమన్యుడు మాతృ గర్భం నుంచే తన తల్లి సుభద్రకు తెలిపిన యుద్ధ తంత్రాలు గ్రహించగలిగాడు అనే అంశానికి ఆధారం లభించింది అన్నమాట గర్భస్థ పిండాలకు సంబంధించి అమెరికన్ శాస్త్రజ్ఞులు కావించిన పరిశోధనలు శిశువు పుట్టడానికి మునుపే వినగలిగే సామర్థ్యం ఏర్పడుతుందన్న అంశాన్ని నిర్ధారిస్తున్నాయని సుప్రసిద్ధ అంతర్జాతీయ విజ్ఞాన పత్రిక సైన్స్ ఈ మధ్యనే వెల్లడించింది ఈ రిపోర్ట్ వెలుబుచ్చిన అభిప్రాయాల ప్రకారం మానవ శిశువులు మాతృగర్భం నుంచే మొదట వినిన కంఠధ్వని పద్యాలని గుర్తించగలరని తేలింది ఉత్తర కెరోలిన విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఆంటోనీ డెకాస్పర్ అలాగే విలియం హైపర్ ఈ అంశంపై అప్పుడే జన్మించిన పది మంది శిశువులపై ప్రయోగాలని గావించారు ఒక టేప్ రికార్డర్ తో సంబంధించిన ఒక పదునైన నిప్పుల్ లాంటి మొనను పీల్చడం ద్వారా శిశువులు ఒక పద్ధతిలో తల్లి స్వరాన్ని మరొక పద్ధతిలో వేరొక స్త్రీ స్వరాన్ని వినే రీతిగా ఏర్పాటైన పరికరం ఈ ప్రయోగంలో వాడబడింది శిశువులు తమ తల్లి గొంతు వినబడే పరికరాన్ని అధికంగా ఉపయోగించడాన్ని ఆ శాస్త్రజ్ఞులు గమనించారు అంతేకాకుండా మాతృ స్తన్యాన్ని గ్రోలించిన పాలసీసా వాడిన ఈ లక్షణాన్ని శిశువులు వెల్లడించాయి ఈ పరిశోధనలు 36 గంటల లోపున 72 గంటల పైన ఉన్న శిశువుల మీద జరిగాయి డెకాస్పర్ అలాగే అతని సహచరుడు ఫిలిన్ ప్రెస్కాట్లు ఈ అంశంపై గావించిన ఇంకొక ప్రయోగం అప్పుడే జన్మించిన శిశువుల మీద వాళ్ళు చేశారన్నమాట వాళ్ళు గొంతును గుర్తుపట్టడంలో ఎక్కువ తేడాలను కూడా చూపించారు మొదటి రెండు రోజుల్లో తండ్రి గొంతును పెద్దగా వాళ్ళు గుర్తించలేదు లేదట కానీ కొన్ని వారాల అనంతరము తండ్రి గొంతును వినటానికి వాళ్ళు ఉత్సుకతను చూపించారని ప్రయోగాలు వెల్లడి చేశాయట గర్భస్థ కాలంలో శిశువులు విన్న శబ్దాల ప్రభావం పుట్టిన తర్వాత శిశువులు వ్యక్తపరిచే ఏదైనా సరే శ్రవణ సంబంధ లక్షణాల మీద ప్రభావం చూపిస్తాయని ఈ శాస్త్రజ్ఞులు నిర్ధారించారు 16 మంది గర్భిణీ స్త్రీలు ఒక పుస్తకాన్ని రోజుకి రెండు సార్లు శిశువు పుట్టడానికి ముందు పుట్టిన తర్వాత గట్టిగా చదివే రీతిగా భావించిన ప్రయోగాలు సైతం ఈ పరిశోధనలను ధృవీకరించాయి ఆ ఇంగ్లీష్ లో ఉన్నదానికే ట్రాన్స్లేషన్ అది అన్నమాట ఇప్పుడు అర్థమైంది కదా అంటే ఇది ఎందుకు చూపించాను అంటే ఆ జర్నల్ లో ఉన్నది చూపించకపోతే మళ్ళీ నేను ఏదైనా సొంతంగా చెప్పాను అనుకుంటారేమో అని చెప్పి నేను మీకు చెప్పాను అలాగే కడుపుతో ఉన్నప్పుడు తల్లి యొక్క మానసిక స్థితిని చాలా అద్భుతంగా ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్తారు కోపంగా ఉండడము లేదు అంటే ఉద్రేకపూరితంగా ఉన్నవి వినకండి చూడకండి అని మన పెద్దవాళ్ళు చెప్తారు మన పెద్దవాళ్ళు చెప్తే ఆ అని మనం కొట్టి పారేస్తాం వాళ్ళ మాట వినం కానీ సైంటిస్టులు ప్రయోగపూర్వకంగా దాన్ని చేసి చూపించారు మానసికంగా వాళ్ళు ఉద్రేకానికి లోనవుతున్నారు అనుకోండి తల్లి ఆ ప్రభావం ఏం చేస్తుందంటే బొడ్డు ద్వారా ఒక రసాయనిక చర్య జరిగి ఆ కడుపులో ఉన్న పిల్లవాడి దగ్గరికి వెళ్తుంది కోపం ద్వేషం అభిమానం ప్రేమ ఇలాంటి మానసిక ఏది ఏదున్నా సరే ఆ తల్లి ఏదైతే ఫీల్ అవుతుందో అది ఒక రసాయనిక చర్య జరిగి బొడ్డు ద్వారా వెళ్ళిపోతుంది పుట్టిన తర్వాత అదే లక్షణాలతో పిల్లలు ఉంటారు అలానే ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కూడా కడుపుతో ఉన్న ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆ స్త్రీ కడుపు మీద ఒక బ్యాటరీ లైట్ వేశారు మనం కూడా మనమే చేసుకోవచ్చు ఎక్స్పెరిమెంట్ దాకా అవసరం ఏం లేదు అలా వేస్తే పిల్లల కదలికలో తేడా మనకి కనిపిస్తుంది వాళ్ళు ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం చేసి చూశారు అంటే మనం బయట కదలికలను గమనించగలుగుతాం కానీ కడుపులో ఉన్నదాన్ని మనం చూడలేము కదా కానీ ఆ సైంటిస్టులు ఏం చేశారు అంటే ఆ లైట్ వేసినప్పుడు లోపల ఉన్న బేబీ ఏదైతే ఉందో కళ్ళు మూసుకోవటం పక్కకు తిరగటం అలాగే నరాలు ఉద్విగ్నతకి లోనవ్వటం ఒత్తిడికి లోనవ్వటం వీళ్ళు ప్రయోగపూర్వకంగా వాళ్ళు లోపల స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమయ్యాయి అట అంతేకాకుండా చాలా అద్భుతమైన సంగీతాన్ని పిల్లలకు వినిపించినప్పుడు లోపల ఉన్న బేబీ కూడా చాలా ప్రశాంతంగా చాలా అద్భుతంగా మానసిక స్థితి ఉంది అని చెప్పి వాళ్ళు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు ఇది ప్రయోగాలు చేసి వీళ్ళు కనుక్కున్నారు కానీ మన పెద్దవాళ్ళు మనకి చెప్తారు ఇలా భయపడే సినిమాలు చూడకండి ఒంటరిగా బయటికి వెళ్ళకండి ఒంటరిగానేమో చీకట్లోకి వెళ్ళకండి జుట్టు విరబోసుకోకండి ఇలాంటివన్నీ మన పెద్దవాళ్ళు చెప్తే దాన్ని ట్రాష్ అని కొట్టి పడేస్తాం ఇక నుంచి అయినా మనం ఇలాంటివి తెలుసుకున్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు దాని వెనకాల ఏదో ఉంది ఏదీ లేకుండా మన పెద్దవాళ్ళు చెప్పరు అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకున్నాము అని అనుకోండి పుట్టే పిల్లలు అద్భుతంగా పుడతారు పుట్టిన తర్వాత మనం పిల్లల్ని ఎలా ఎలా బాగు చేయాలి ఎలా తయారు చేసుకోవాలి అని అనుకునే కంటే ప్రెగ్నెంట్ అయిన మొదటి నుంచి పుట్టిన రెండు సంవత్సరాల వరకు వాళ్ళ మీద మనం దృష్టి పెట్టాము అంటే ఒక అద్భుతమైన పిల్లవాడిని మనం దేశానికి అందించినట్లు అన్నమాట రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మనందరికీ తెలుసు కదా ఆర్ ఎస్ ఎస్ వీళ్ళు ఎంత గొప్ప దేశభక్తులో చూడండి వీళ్ళు దేశాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోటే సంవర్ధిని న్యాయాస్ అనే ఒక సంస్థ ఉందన్నమాట దానికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంతమంది వైద్యులేమో ఈ సంస్థతో అనుబంధంగా ఉంటారన్నమాట వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే ప్రెగ్నెంట్ అని తెలుసుకున్నప్పటి నుంచి ఒక స్త్రీ మూర్తి పుట్టిన రెండు సంవత్సరాల వరకు వాళ్ళకి ఏమేమి చెప్పాలి ఏ విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలి అనేది కొంత మెటీరియల్ ని తయారు చేస్తారన్నమాట వాళ్ళు తయారు చేసిన మెటీరియల్ లో భగవద్గీత సుందరకాండ రామాయణము భాగవతము ఇలా ఎన్నో విషయాలని వాళ్ళు అన్నిట్లోనూ పొందుపరిచారు అప్పటినుంచి అంటే కడుపుతో ఉన్నప్పటి నుంచి పుట్టిన రెండు సంవత్సరాల వరకు వింటే ఇంక మళ్ళీ కొత్తగా మన పిల్లలు ఇలా తయారవ్వాలి అలా తయారవ్వాలి మా పిల్లలు చదువుకోవటం లేదు మా పిల్లలు వెనకడుగులుగా ఉన్నారు ఇలా ఏం అవసరం లేదు కదా అలాగే పిల్లల యొక్క శారీరక మానసిక ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూశారట కడుపుతో ఉన్న స్త్రీ ఎవరైతే సుందరకాండని ప్రతి రోజు చదువుతూ ఉంటుందో ఆ పిల్లలు రాముడి మీద భక్తిని పెంచుకోవడం మాత్రమే కాకుండా అత్యద్భుతమైన తెలివితేటలతో పుట్టారట కాబట్టి కడుపుతో ఉన్న ఆడవాళ్ళు ఎక్కువగా శ్లోకాలని స్తోత్రాలని సంస్కృత శ్లోకాలని తెలుగు పద్యాలని వాళ్ళంతట వాళ్ళు చదవటం నేర్చుకోండి అలా చదవటం నేర్చుకుంటే ఏమవుతుంది అంటే మన గొంతుని లోపల ఉన్న బేబీ ఐడెంటిఫై చేస్తుంది అలా ఐడెంటిఫై చేసింది అనుకోండి పుట్టిన తర్వాత మనం ఏం చెప్తే అది వాళ్ళు వింటారు టేప్ రికార్డర్ పెట్టి వినే కంటే కూడా మనమే చదివి వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు వింటారు మనం అనుకుంటాం మనం ఒక్కలే ఉన్నాం కదా లోపల ఉన్న బేబీకి ఏం తెలియదు అని మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి ఇందులో ఈవిడ రెండు రకాల మ్యూజిక్ ని లోపల ఉన్న బేబీకి వినిపించింది ఒకటేమో వెస్టర్న్ మ్యూజిక్ ఒకటేమో హనుమంతుడి భజన ఈ వెస్టర్న్ మ్యూజిక్ పెట్టినప్పుడు లోపల ఉన్న బేబీ పెద్దగా స్పందించలేదు కానీ హనుమంతుడి భజన పెట్టినప్పుడు మాత్రం చూసారా ఆ పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళ అమ్మగారు ఈ అమ్మాయిని కడుపుతో ఉన్నప్పటి నుంచి కూడా ఈ హనుమంతుడి భజనలు విన్నారన్నమాట ఆ భజనలకి ఈ అమ్మాయి అలవాటు అయిపోవడం వల్ల అలా లోపల స్పందించింది మీకు ఇంకా ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ కి సంబంధించి వివరాలు ఇంకా ఏం కావాలి అంటే ద సీక్రెట్ ఆఫ్ అన్బోర్న్ చైల్డ్ అనే ఒక పుస్తకం ఉంటుంది దాన్ని తీసుకొని చదివితే ఇంకా అద్భుతమైన విషయాలు మనకి తెలుస్తాయి మనం చాలా మందిని చూస్తుంటాం కదా పుట్టగానే వాళ్ళు భగవంతుడి పేరు చదివేశారని అలాగే రామ మంత్రం చదివారని కృష్ణ మంత్రం చదివారని ఇవన్నీ వాళ్ళకి ఎలా వచ్చాయి కడుపుతో ఉండగా ఆ తల్లి ఏదైతే చేసిందో పుట్టిన తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహం వాళ్ళకి అలా కలిగింది అన్నమాట ఈ దేశానికి మనం అద్భుతమైన పిల్లల్ని ఇవ్వాలి అని అనుకున్న పిల్లలు చక్కగా మంచి దారిలో ఉండాలి అని అనుకున్న భగవంతుని అనుగ్రహం పిల్లలకి కలిగేలా చేయాలి అని అనుకున్న మనం కడుపుతో ఉన్నప్పుడు మన పిల్లలకి అలాగే మనకి తెలిసున్న వాళ్ళకి చెప్పవలసిన విషయం ఏంటంటే రామాయణ భాగవత భగవద్గీతలను వినమని చెప్పండి ఇప్పుడు ఆ కోకిల చూడండి చిన్నప్పుడే ఎంత దైవ భక్తి ఎంత అద్భుతంగా భగవద్గీత నాలుగు సంవత్సరాల వయసులోనే 700 శ్లోకాలను గుర్తుపెట్టుకుంది అంటే వాళ్ళ అమ్మగారు ఆ అమ్మాయికి చేసింది ఆ అమ్మాయికి ఇచ్చింది ఎంత గొప్ప సంపదో ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతాయి మనందరం కూడా వీటిని ప్రయత్నిస్తాయి నేను కూడా నా పిల్లల్ని నేను కడుపుతో ఉన్నప్పుడు నేను కూడా ఇలాంటిదే చేశాను భగవంతుడి దయ వల్ల వాళ్ళు కూడా నేను ఏ విధంగా అయితే భగవత్ సేవ చేసుకున్నానో వాళ్ళకి కూడా అలాంటి మెంటాలిటీ వచ్చింది నేను మా పెద్దమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఎక్కువగా చదివేదాన్ని అమ్మవారు అంటే ఎక్కువ ఇష్టం ఇప్పుడు శ్లోకాలు అవి చదువుతుంది మీరు వింటూనే ఉంటున్నారు కదా భగవంతుడు దేవల్లా గొప్ప జీవితం జీవితం తనకి వచ్చింది అలాగే మా అబ్బాయిలు ఇద్దరు ఆ ఇంపాక్ట్ నాకు ఇప్పటికీ వాళ్ళ మీద కనిపిస్తుంది ఇది నేను స్వయంగా అనుభవించాను అందుకే నేను మీతో పంచుకుంటున్నాను ఇలాంటి ఎన్నో అద్భుతాలు అందరి జీవితాల్లో జరగాలి దేశానికి అద్భుతమైన సంపదను మనం అందించాలి అంటే మనకి బీజం పడిన దగ్గర నుంచి ప్రయత్నిస్తే దేశానికి ఇచ్చే అద్భుతమైన కానుక మన పిల్లలే అంతకు మించి ఇంకేమైనా ఉంటుందా చెప్పండి లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు
No comments:
Post a Comment