Monday, July 21, 2025

 ప్రతిరోజూ…
శ్రీ కంచి పరమా:చార్య వైభవమ్…
172a;207e2.    నడిచే దేవుడు…
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌼P0272.పరమాచార్య పావన గాధలు…


        *ఔషధం - పరమ ఔషధం*
                 ➖➖➖✍️
```
ఒక రోజు పరమాచార్య స్వామి వారు వేకువజామున నదిలో స్నానం ఆచరించి మఠంకు తిరిగి వచ్చారు. ఆయన శరీరం అధిక ఉష్ణోగ్రతతో మండుతున్నట్టు అనిపించింది. ఆయనకి జ్వరం చాల అధికముగా ఉంది. 

వైద్యులు వచ్చి పరిశీలించి, “కొన్ని పాలు తీసుకొని మాత్ర వేసుకోమని” చెప్పి వెళ్లారు. 

ఆరోజు ఏకాదశి. అందువలన స్వామి వారు సంపూర్ణ ఉపవాసంలో ఉంటారు. నిర్జలోపవాసం కాబట్టి ఒక్క చుక్క నీటిని కూడా తీసుకోరు. ఇంకా పాలు గురించి ఏం చెప్పాలి? 

“పాలు కాని మాత్ర కాని నాకు అవసరం లేదు” అని మహాస్వామి వారు ఖచ్చితంగా చెప్పారు. 

శ్రీమఠం మేనేజర్ వచ్చి మహాస్వామి వారిని వేడుకున్నారు. చాలా ప్రాధేయపడ్డారు. “జ్వరంతో ఉన్నప్పుడు ఈ ఉపవాస దీక్ష ఉండవలసిన అవసరం లేదు. ఇది ఆహారం కాదు కేవలం ఔషదం మాత్రమే కనుక స్వీకరించవలసింది” అని వాదించారు. 

వారి వాదనలో చివరి మాట సరైనది అనిపించింది అందరికి.

పరమాచార్య స్వామి వారు తన దగ్గరలో ఉన్న శిష్యునితో చిన్నగా, బొంగురు గొంతుతో ఇలా చెప్పారు “వైద్యులు ఇచ్చినది ఔషధము. కాని నాకు నేనే పరమ ఔషధం ఇచ్చుకున్నాను”. 

మేనేజరు గారికి ఏమీ అర్ధం కాలేదు. వారి అయోమయ పరిస్థితి చూసి స్వామివారే మళ్ళా అర్థమయ్యేట్టు “వేదం ‘లంఖణం పరమఔషధం’ అని చెప్పింది కాబట్టి ఈ ఉపవాసమే అత్యంత పరమ ఔషధం” అని వివరించారు.

మరుసటి రోజు ఉదయం మహాస్వామి వారు రోజువారీ పద్ధతిలోనే వేకువఝామునే లేచి, చల్లటి నీటితో స్నానమాచరించి, వారి పద్ధతి ప్రకారం అనుష్టానము మరియు పూజ ముగించారు. వచ్చినంత త్వరగా జ్వరం తగ్గుముఖం పట్టి మాయమైపోయింది. 

పరమాచార్య స్వామి వారి శరీరం వారి ఆధీనంలో ఉండి వారి ఆజ్ఞకు కట్టుబడి ఉండేది. దీని నిరూపణకు వేల కొలది దృష్టాంతములు కలవు.✍️
      -అనువాదం: ఈశ్వర్ రెడ్డి, 
               శ్రీకాళహస్తి.```
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*
```
#KanchiParamacharyaVaibhavam # “కంచిపరమాచార్యవైభవం”🙏
.     సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
            🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment