Monday, July 21, 2025

 రాముడు జలప్రవేశం ద్వారా దేహాన్ని వదిలాడు..

రామరావణ యుద్ధం తరువాత శ్రీరాముడు అయోధ్యను 11వేల సంవత్సరాల పాటూ పాలించిన విషయం తెలిసిందే. 

ఆ తరువాత ఇక తాను స్వధామానికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైందని యముని ద్వారా విని లవకుశులకు పట్టాభిషేకం చేసాడు. భరతునికి పట్టాభిషేకం చేద్దామనుకున్నా భరతుడు నిరాకరించి రామునితో కలిసి నడిచాడు. 

అలా సపరివారంగా బయల్దేరిన రాముడు సరయూ నదికి చేరుకుని వేదపండితుల మంత్రోచ్చారణం మధ్య దేవదుందుభులు మ్రోగుతూ ఉండగా దేవతలందరి హర్షధ్వానాల మధ్య సరయూ నదిలోకి దిగి శరీరాన్ని విడిచివేసాడు. 

రామునితో పాటూ పురప్రముఖులు వానరప్రముఖులు భరతుడు మొదలైన వారు కూడా రాముణ్ణి అనుసరించారు.  రాముణ్ణి కలవడానికి బ్రాహ్మణుని రూపంలో వచ్చిన యమధర్మరాజు ఏకాంతభేటీ కోరాడు. ఎంతటి ముఖ్యులైనా మధ్యలో వచ్చి ఏకాంత భంగం చేస్తే రాజ్యబహిష్కారం విధించాలన్నాడు. అలా వారి భేటీ జరుగుతూ ఉండగా దుర్వాస మహర్షి రాముణ్ణి కలవడానికి వచ్చాడు. రామునికి చెప్పమని లక్ష్మణునికి చెప్పాడు.

 ఏకాంతంలోకి వెళ్ళరాదన్నాడు. వెళ్ళకపోతే రఘువంశాన్నే శపిస్తానని చెప్పడంతో గతిలేక లక్ష్మణుడు లోపలికి వెళ్ళి రాముని చేత రాజ్యబహిష్కార శిక్ష వేయించుకున్నాడు. ఆ శిక్ష విధించగానే లక్ష్మణుడు సరయూ నదిలో యోగసమాధి అయిపోయాడు. అలా రాముని కంటే ముందే వైకుంఠానికి వెళ్ళిన ఆదిశేషు రామునికి ఎదురేగి స్వాగతించాడు. 

సీతగా అవతరించిన లక్ష్మి మందిరంలో రామునికై ఎదురుచూడసాగింది. అలా వారివారి కార్యాలు పూర్తయ్యాక దేవపురుషులు మళ్ళీ ఏదో ఒక విధంగా అవతార సమాప్తి చేస్తారు...

No comments:

Post a Comment