181a;167e1;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀ఆ.స.164.
నేటి...
*ఆచార్య సద్బోధన*
➖➖➖✍️
```
ఈ శరీరం మనకే చెందినది అని మన ఇష్టం వచ్చినట్లు వినియోగపడాలని ఎలా వినియోగపరుచుకొను చున్నామో,
ఈ జీవుడు కూడా పరమాత్మకు శరీరం లాంటి వాడు కనుక ఈ శరీరం వలే జీవుడు కూడా పరమాత్మకు ‘సర్వాత్మనా స్వార్ధే నియన్తుమ్ ధారయితుంచా శక్యం’ అని పరమాత్మచే ధరింపబడే వాడుగా ఉండాలి!
దాసుడు అయింతర్వాత చేయవలసిందేమిటీ కైకార్యసేవ అవతల వానికి ఆనందం కలుగుటకు ఏ కొంచం అయినను సేవ చేయటం ‘నాకించిత్ కుర్వత శేషత్వం’ ఏ కొంచం అయిన సేవ చేయక ఉన్నట్లయితే శేషత్వం వున్నా లేనట్లే!
పరమాత్మకు చెందినవారమని అనుకుంటే సరి కాదు మనకు అత్యంత ప్రీతి ఒకరి ఎడల వున్నట్లు అయితే కొంచమైనను సేవ చెయ్యాలనిపిస్తుంది,
పరమాత్మ ఎడల ప్రీతి విశేషం ఉన్నట్లు అయితే ఆయనకు సేవ చేయకుండా వుండలేము ఇది జీవుని స్వరూపం.
‘బందే మోక్షేత దైవచ్చనాణ్యదా లక్షణం తేషామ్’ వైకుంఠంలో ఉన్నవాళ్లు అయినా ఈ లోకంలో ఉన్నవాళ్లు అయినా ఈ ఆత్మలకు ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే... ‘ఆత్మదాస్యం హారేహే స్వామ్యం స్వభావంచ సదాస్మర’ ఆత్మకు ఉండవలసిన లక్షణం దాస్యం!
పరమాత్మకు వుండే ధర్మము స్వామిత్వం! అంటే సొత్తును కలిగి వుండటం!
ఈ లక్షణం మనకు లక్ష్మణ స్వామిలో కనపడుతుంది.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment