Xx.Vi.1H1744;2012b8;207e7;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍇M.A.12.
*మన ఆరోగ్యం…!*
*‘D’ విటమిన్*
➖➖➖✍️
*ప్రశ్న:*```
‘డి’ విటమిన్ ఉదయపు సూర్యకిరణాల్లో మాత్రమే ఉంటుందా? పగలు, సాయంత్రపు సౌర కాంతిలో 'డి' విటమిన్ ఉండదా.. ?```
*జవాబు:*```
‘డి’ విటమిన్ సూర్యకిరణాల్లో ఉండదు. సూర్యకిరణాలు ‘డి’ విటమిన్‌ను దాచి పెట్టుకున్న సంచులు కావు.
‘డి’ విటమిన్ సూర్యకిరణాల సమక్షంలో మన చర్మంలోనే తయారవుతుంది.
ఉదయం పూట వాతావరణం కాస్త చల్లగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే కాసేపు మనం సూర్య కాంతిలో ఉంటే.. కొంత వరకు సౌకర్యంగా ఉంటుంది. మనలో 'డి' విటమిన్ తయారు కావడానికి అది మనకు సరిపోతుంది.
మధ్యాహ్నపు ఎండ వల్ల, సాయంత్రం ఎండ వల్ల కూడా ‘డి’ విటమిన్ మన శరీరంలో తయారవుతుంది.
*కానీ ...
ఎండ తీవ్రత మూలంగా ఎవరూ పగటి పూట ఆరుబయట (ఎండలో) నిలబడటానికి ఇష్టపడరు.
పగటి పూట ఎండ ఉండటం వల్ల మరియూ సాయంత్రం పూట దుమ్ము, ధూళి వాతావరణంలో అధికంగా ఉండటం వల్లా, మనం అలసిపోతూ ఉంటాం.
ఆ సమయాల్లో ఆరు బయట ఎండలోకి రావడానికి ఎవరికీ సౌకర్యంగా ఉండదు. అందుకే పగలూ సాయంత్రాలూ బయటకు రావడానికి ఎవరికీ మనస్కరించదు.
ఉదయం పూట కూడా చాలా తక్కువ సేపు మాత్రమే ఎండలో ఉండాలి. ఎక్కువసేపు ఎండలో ఉంటే చర్మపు క్యాన్సరు వచ్చే అవకాశం (ప్రమాదం) కూడా ఉంటుంది.(రావొచ్చు)
మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ సూర్యకాంతి సమక్షంలో
‘కోలి కాల్సిఫిరాల్’ను తయారు చేస్తుంది. ఇది కాలేయం, మూత్రపిండాల సహకారంతో విటమిన్ 'డి-3'గా మారుతుంది. ఈ ‘డి’ విటమిన్ వల్లే రక్తంలో కాల్షియం స్థాయి పెరిగి ఎముకల పెరుగుదల సక్రమంగా సాగుతుంది.
ఎండ తీవ్రతతో నిమిత్తం లేకుండా నిత్యం ఆరుబయట పనిలో నిమగ్నమయ్యే శ్రమజీవుల శరీరాల్లో, సాధారణంగా 'డి' విటమిన్ కొరత ఉండదు.
*PS:-
పైన ఒక చోట, “ఎక్కువ సేపు ఎండలో ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశం (ప్రమాదం) ఉంది” అన్నాను గానీ, విధిగా (క్యాన్సర్) వస్తుందని అనలేదు.
బెంజీన్ ను కార్సినోజన్ (cancer agent) అంటారు. దాన్ని పదేపదే వాడితే క్యాన్సరు వచ్చే అవకాశంఉంది.
నేను, నా స్కాలర్లు, మా కెమిస్ట్రీ సమూహం దాన్ని వాడకుండా ఉండలేము.
అయినా మాకు (ఇంకా) క్యాన్సర్ రాలేదు. రాకూడదనే ఆశిస్తాను.”✍️`
- ప్రొ॥ఎ.రామచంద్రయ్య,NIIT,
వరంగల్,జన విజ్ఞాన వేదిక,
తెలంగాణ.
-Rajeshwer Chelimela Jvv
Telangana.
-సేకరణ.```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment