Monday, July 21, 2025

 231a;217e1
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀ఆ.స.169.
నేటి...

              *ఆచార్య సద్బోధన*
                 ➖➖➖✍️

```
మనం భౌతికత్వంలో కూరుకుపోయి ఉన్నప్పుడు ఆధ్యాత్మికత వంటబట్టదు.

ఏ మానవుడికైతే ఇంద్రియాలు బాహ్యంగా వర్తిస్తూ ఉంటాయో, అతడు బద్దుడై నిలుస్తాడు. బాహ్య విషయాల వైపుకి పరుగులు పెట్టడం అంటే ఎండమావుల వెనుకబడటం వంటిదే. అంతకు మించిన దారిద్య్రం మరొకటి ఉండబోదు.

అందుకే తెలివైనవారు బాహ్య పరిస్థితుల్లో ప్రతికూలతలు ఏర్పడినప్పుడు అంతర్ముఖులై ఉండే ప్రయత్నాన్ని చేస్తారు. ఎటువంటి ప్రతికూలతలు ఎదురైనా చలించక దృఢంగా నిలుస్తారు. 

అదే సామాన్య వ్యక్తి అయితే బాహ్య విషయాలలో తగుల్కొని ఉన్నప్పుడు ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటే, వాటిని ప్రతిఘటించైనా సరే అందులోనే ఉండాలనే సంకల్పంతో ఉంటాడు. వాటిలో సుఖం లేదనే జ్ఞానం అతనికి కలుగదు.✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment