201a;187e1;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀ఆ.స.166.
నేటి...
*ఆచార్య సద్భోదన*
➖➖➖✍️
```
“శ్రద్ధవాన్ లభతే జ్ఞానం” - శ్రద్ధ వలననే జ్ఞానం వస్తుంది. మనం ఏ పని చేసినా అందులో శ్రద్ధ లేనిదే విజయవంతం కాదు. ముఖ్యముగా ఆధ్యాత్మికత విషయములో కచ్చితంగా శ్రద్ధ ఉండి తీరాల్సిందే!
చాలామంది అంటుంటారు. దేవుని ధ్యానమో, స్మరణో, జపమో చేద్దామంటే ఆసక్తి ఉండడం లేదు, సమయం కుదరడం లేదు అని... అయితే మూడు గంటల పాటు సినిమా హాలులో కదలకుండా కూర్చుని జేబులో పర్సు కొట్టేసినా కూడా తెలియనంతగా లీనమైపోతుంటారు. కానీ దేవుని ముందు ఒక మూడు నిమిషాలు శ్రద్ధతో కూర్చోవడానికి మాత్రం పలు రకాల సాకులు చెబుతుంటారు. ఎప్పుడో పది సంవత్సరాల క్రితం చూసిన సినిమా పాట తప్పులేకుండా గుక్క తిప్పుకోకుండా పాడేస్తారు కానీ గంట క్రితం నేర్చిన భగవత్ కీర్తన మాత్రం గుర్తుకు రాదు!
ఇవే కాదు ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు జరిగిన నానా సరుకంతా బుర్రలో దాచుకుంటారు. కానీ దైవం విషయం దగ్గరకి వచ్చేసరికి బుర్ర ఖాళీ..!
దీనికి కారణం ఆ బయట విషయాల మీద ఉండే శ్రద్ధ భగవంతుని మీద లేకపోవడమే!!
స్థిరమైన మనస్సుతో, శ్రద్ధ, ఏకాగ్రతతో దైవమును స్మరించి చూడండి.. ఎట్టి ఫలితములు పొందుతారో ఆశ్చర్య పోతారు. ఏక మనస్కులై ఆ ఆత్మారాముని స్మరించి చూడండి.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment