Monday, July 21, 2025

 191a;177e1;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀ఆ.స.165.
నేటి...

                *ఆచార్య సద్బోధన*
                   ➖➖➖✍️
```
దుఃఖానికి మూలం స్వార్థమే...! విపరీతమైన కోరికలు, ఆశలు, వికారాలు మనిషిని మృగముగామార్చి, స్వార్థమనే అగ్నిలో దగ్ధం చేస్తుంది.

ప్రేమా, ఔదార్యం, సహనం నిస్వార్ధాన్ని వృద్ధిచేస్తాయి. ఇంద్రియ సంయమనం పారమరమార్థిక చింతనకు పాదు చేస్తుంది.

సత్ సాంగత్యం ఆత్మ జ్ఞాన ప్రాప్తికై దోహదం చేస్తుంది. సత్ కర్మలతో హృదయాన్ని, శరీరాన్ని పునీతం చేసుకోవాలి. సృష్టి యందలి  ప్రతీ  అణువులో దైవాన్ని చూసే దృష్టిని అలవర్చుకోవాలి.

ప్రకృతి నుండి పాఠాలు నేర్చుకోవాలి.     చెట్టు, చెఱువు, గోవు, నదులు, మొదలైనవి పరులకోసమే జీవిస్తున్నాయి. వాటిలో ఇసుమంతయు స్వార్థం లేదు.

మనస్సు, బుద్ది, వాక్కు, లాంటి అనంతమైన శక్తి సామర్థ్యలను భగవంతుడు మనకు వరాలుగా నొసగాడు. అలాంటి మానవులమైన మనలో ఎంత నిస్వార్థమైన కార్యాచరణ ఉండాలి...?

ఉడుత, జఠాయువు వంటి ప్రాణులు సైతం రామునికి మహోపకారం చేస్తే, ప్రతిగా రాముడు చేసిన ధర్మవర్తనం మనకు తెలియనిదా...!

ఈ  నిస్వార్థ గుణం పశు, పక్షాదుల నుండి నేర్చుకోవాలిసిన దౌర్భాగ్యస్థితి మనిషికి దాపురించింది అంటే... మానవ జాతి భవిత రేపు ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహిస్తే... మనిషి ఎంత స్వార్థ పరుడిగా మారిపోతున్నాడో అవగతమౌతుంది.

అవయవదానం, రక్తదానం, వస్త్రదానం, అన్నదానం వంటి దానగుణాలు అలవర్చుకొంటూ, మన పిల్లలకు చిన్ననాటినుండే పరులకు ఉపకారం చేసే సంస్కార భావాన్ని నేర్పించాలి.
```
*పరోపకారః పుణ్యాయ పాపాయ పర పీడనమ్॥* ```
పరులకు మేలుచేస్తే అది పుణ్యం, అపకారం చేస్తే  అది పాపం... పరులకు మేలుచేయడం దేవుడెరుగు కానీ, అపకారం మాత్రం  తలపెట్టవద్దు.

సొంత లాభం కొంతమానుక పొరుగు వాడికి తోడుపడవోయ్... అన్న గురజాడ గారి సందేశం మనకు వెలుగు మేడ అని గ్రహించగలిగితే... అన్ని అనర్థాలకు మూలమైన స్వార్థాన్ని తరిమికొట్టగలం.✍️```
 .          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment