111b8;232c6;245d4;217e5;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*దానం*
➖➖➖✍️
```
వామనావతారంలో విష్ణువు బలి చక్రవర్తిని మూడడుగుల నేల దానమడిగాడు.
వచ్చిన వాడు విష్ణువని, ఇవ్వడం వల్ల తనకు నాశనం తప్పదని తెలిసీ బలి చక్రవర్తి విష్ణువుకు ఇచ్చాడు.
విష్ణువు తీసుకున్నాడు.
అలా అడగడం, ఇవ్వడం రెండూ అద్భుత సన్నివేశాలు.
యాచించే వాడు ఎంత గొప్పవాడయినా చేయిచాస్తాడు. ఎదుటి వాని ఆధిక్యతను అంగీకరిస్తాడు. వాని చేయి కింద ఉంటుంది. ఇచ్చేవాడూ చేయి చాస్తాడు. తీసుకునే వాని గొప్పదనాన్ని గుర్తిస్తాడు. కానీ, వాని చేయి పైన ఉంటుంది.
ఈ ప్రక్రియలో ఇచ్చేవాడు, ‘నేను’ ‘ఇస్తున్నాను’ అనే అహంభావాన్ని తెలిసిగానీ, తెలియక గానీ ప్రదర్శిస్తాడు.
ఆ అహంకారం తామస, రాజస, సాత్వికాహంకారాలుగా ప్రదర్శితమౌతుంది. తీసుకునే వానిపై ఆధిక్యతాభావన చూపితే అది తామసాహంకారమవుతుంది. ఉన్నది పంచుకుంటున్నాననే భావనతో ఇస్తే అది రాజసాహంకారమవుతుంది. ఇవ్వడం వల్ల నా సంపద చరితార్ధమవుతుందనే భావనతో ఇవ్వడం సాత్వికాహంకారమవుతుంది.
ఏ భావనా లేకుండా ఇవ్వడం దివ్యత్వం అవుతుంది.
వామనుడు బలి వద్దకు వస్తూనే…```*‘స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు’* అనడంలో.. *‘ముల్లోకాలనూ శాసించగలిగిన బలికి శుభము’* అంటూ ఆశీస్సులున్నా.. *“ఇక నీ శాసనానికి, నీకు కూడా స్వస్తి!”* అనే భావన వ్యక్తమౌతుంది.
బలి చేయిసాచి *‘ఆదిన్ శ్రీసతి కొప్పుపై’..* అంటూ తీసుకునే వాని అర్హతను చెప్పి... *‘తిరుగన్ నేరదు నాదు జిహ్వ’* అనడం ద్వారా ఇచ్చే వాని నిబద్ధత చెప్పబడింది.```
ఇక్కడ ఆడిన మాట ప్రకారం దానాన్ని ఇచ్చిన బలిని విష్ణువు శిక్షించడం కనిపిస్తుంది.
బలి చక్రవర్తిలో సాత్వికాహంకారం ఉంది. “నా జన్మ సఫలమయింది, నేను ధన్యుడనయ్యాను, ఇక నాకు కల్యాణమే!” అని చెప్పడం ద్వారా తన లక్ష్యాన్ని గుర్తించిన విధానం..
ఈ భౌతిక విభవం చాలనే భావన.. వ్యక్తమైనా, ఆయనలో నా’ అనే అహంభావం కనిపిస్తుంది.
“ఏదైనా ఎంతైనా ఇవ్వగలిగిన నన్ను ‘ఈ అల్పంబుు (కొద్దిగా) అడుగుతావా’ అనడంలో సాత్వికాహంకారం వెలుగు చూస్తుంది.
ఆ అహంకారాన్ని తొలగిస్తే కాని బలికి ముక్తిని ఇవ్వలేడు భగవంతుడు.
అందుకే బలి తలపై మూడవ పాదం పెట్టి ఆ అహంభావాన్ని తొలగించి ఐహిక బంధనాల నుండి విముక్తుడిని చేసాడు.
ఈ సన్నివేశాన్ని మరొక విధంగా చూస్తే.. అడగడం.. అమాయకత. ఇందులో ఆశ ఉంది, ఆశ్చర్యం ఉంది. ఇది బాల్యావస్థకు సంకేతం. తీసుకోవడం.. విలువలకు ప్రాతిపదిక, ఇది యౌవనావస్థకు ప్రతీక. ఇతరులతో పంచుకుంటే.. ఆప్యాయత, ఆదరణ. ప్రౌఢత్వానికి చిహ్నం. ఉదారంగా ఇవ్వడం.. వివేకం. సమైక్య వివేచనను పొందుతాము. ఇది వార్ధక్యాన్ని సూచిస్తుంది. ఆయా అవస్థలను సమన్వయపరచుకొని అభ్యుదయకారకమైన ‘ఇవ్వడం’ అనే భావనలోని ఔన్నత్యాన్ని గాథలోని అంతరార్థంగా గుర్తిస్తూ, మనందరమూ ఆ ఇవ్వడంలోని ఆనందాన్ని పొందాలి.✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment