*_జరిగేవన్నీ మంచికని..!_*
************************
_మాస్టర్ వేణు జయంతి_
25.07.1916
_______________________
(*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*)
9948546286
7995666286
✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽
*_ఈ పగలు రేయిగా_*
*_పండు వెన్నెలగ_*
*_మారినదేమి చెలీ.._*
*_ఆ కారణమేమి చెలీ.._*
ఈ పాటలో ఎంత మెలోడీ..
హీరో ప్రశ్నల గారడీ..
హీరోయిన్ రాగాలతో ఢీ..
నిర్మాతకు సిరిసంపదలు..
ఆకట్టుకున్న సరిగమపదలు!
మాస్టర్ వేణు..
*_ఏరువాక_*
*_సాగరోరన్నో చిన్నన్నో.._*
*_నీకష్టమంతా_*
*_తీరునురోరన్నో చిన్నన్నో.._*
ఇలాంటి పల్లేపదమూ
ఆయన పథమే..!
*_అద్దమంటి మనసు ఉంది_*
*_అందమైన వయసు ఉంది.._*
*_ఇంతకంటే ఉండేదేంది_*
*_కిట్టయ్యా..ఈ పేదవాళ్ళు_*
*_తెచ్చేదేంటి చెప్పయ్యా.._*
ఈ పాటలో
అద్భుతమైన రాగం..
ఈ మాస్టర్ ఆ మాస్టారు
కలిసి చేసిన మ్యాజిక్..
వీనుల విందైన మ్యూజిక్!
*_ఎక్కడ ఉన్నా ఏమైనా_*
*_మనమెవరికి వారే వేరైనా.._*
*_నీ సుఖమే నే కోరుకున్నా_*
*_నిను వీడి అందుకే వెళుతున్నా..!_*
అప్పటికీ..ఇప్పటికీ..ఎప్పటికీ
భగ్నప్రేమికుల నోట ఈ పాట
కన్నీటి మూట..
కనిపించని బాధ..
వినిపించే పాటలో..
అంతరంగాన్ని పిండేసే
అంతర్మధనం..
వేణు సంగీతమే సాధనం..!
పద్నాలుగేళ్ల లేతప్రాయంలోనే
అబ్బిన సంగీతం..
బొంబాయి చేర్చింది..
అక్కడ స్కూల్ ఆఫ్
మ్యూజిక్ లో
ఆరు నెలల్లో
సాధించిన పట్టా..
పేరుకు ముందు మాస్టర్ ను
జత చేసి కత మార్చింది..
*_అందాల చేతులు కందేను పాపం.._* అన్నట్టు పాటల మోత మోగించింది..!
************************
No comments:
Post a Comment