Tuesday, July 29, 2025

 వైద్యుడికి ఉండవలసిన లక్షణాలు - సంపూర్ణ వివరణ . 

 *  వైద్యవృత్తిలో ఉన్న ప్రతివాడు తాను చేయు చికిత్స సర్వోత్తమం అనియు , దయామయుడు అగు పరమేశ్వరుడు తనను జీవదానం చేయుటకు ఏర్పరిచినాడు అని భావించవలెను . 

 *  నాకు ధనం వద్దు , స్వర్గం వద్దు , మోక్షం వద్దు ఓ భగవంతుడా ! ప్రజా సామాన్యమగు రోగంబుల బారి నుండి తప్పించే ఉపాయ జ్ఞానంబును మాత్రమే నీ నుంచి కోరుతున్నాను . అని సర్వవేళలా భగవంతుడిని ప్రార్ధించే వైద్యునకు సర్వసిద్ధులు లభించును. 

 *  వైద్యుడు తాను ఆరోగ్యవంతుడు అయి ఉండాలి. బాహ్యరూపంతో పాటు మానసికంగా కూడా పవిత్రముగా ఉండవలెను . 

 *  క్రౌర్యం , దంభం , దగా , రహస్యముగా మోసగించుట వంటి హీనగుణాలు ఉండరాదు. 

 *  రోగుల రహస్యాలను కాపాడవలెను . 

 *  సాటి వైద్యుల యందు ద్వేషబుద్ధి ఉండరాదు . 

 *  రోగి యందు దయతో ఉండటం అత్యంత ముఖ్యం . రోగి చెప్పుదాని యందు శ్రద్ద ఉండటం , వినుట యందు ఓపిక ఉండవలెను . 

 *  వైద్యుడిని చూచినంతనే , మాట్లాడినంతనే , గుణము , మాటల్లోని ఆప్యాయత , తీపి తెలిసిపోయి సగం రోగము అప్పుడేపోయినట్లు రోగి తలచవలెను . 

         పైన చెప్పిన నియమాలు పాటించుగలవారు మాత్రమే వైద్యవిద్య అభ్యాసం చేయవలెను కాని డబ్బు సంపాదించుట కొరకు వైద్యవృత్తిని ఎంచుకోవడం మానివేయడం మంచిది . అలా ఆలోచించేవారికి సంపూర్ణముగా వైద్యం ప్రాప్తించదు . 

         ముఖ్యముగా నేను ఒక్క విషయం తెలియచేయాలనుకుంటున్నాను . ఎదుటివారి అవసరాన్ని మనం ధనరూపంలో మార్చుకోవాలనుకోవడం అత్యంత హేయమైన చర్య.  అతిగా ధనమును రోగి దగ్గర నుంచి గుంజుకోను వైద్యుడు ఆ రోగి చెడు కర్మఫలం తనకు సంప్రాప్తిస్తుంది అని గుర్తుంచుకోవాలి. ఆ పాప కర్మ ఫలితం వైద్యుడు తప్పక అనుభవిస్తాడు. వైద్యం అనేది భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప వరం . 

                మనం ఇచ్చిన ఔషధాల వలన రోగికి రోగము నుంచి విముక్తి అవుతున్నప్పుడు లభించే సంతృప్తి అత్యంత గొప్పగా ఉంటుంది.. 

   
            మరిన్ని అతి సులభ యోగాల కొరకు నా గ్రంథాలను చదవగలరు.

     గమనిక  -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

            కాళహస్తి వేంకటేశ్వరరావు 

         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034
        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 
                   
                        9885030034 

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

                  కాళహస్తి వేంకటేశ్వరరావు .

              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                          9885030034

No comments:

Post a Comment