Wednesday, July 30, 2025

 *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏼‍♂️భక్తుడు : భగవాన్ ! దృష్టిని భ్రూమధ్యంలో నిలుపమన్నారు ; అది సరియేనా !?_*
*_🦚 మహర్షి : తాను ఉన్నానని ప్రతివానికి తెలుసు. ఆ ఎఱుకను వదలి, దైవాన్ని వేరుగా వెదుకబోతారు. భ్రూమధ్యంలో దృష్టినిల్పి ప్రయోజనం ఏమి ? దైవం అక్కడ ఉన్నాడని అనటం తెలివి తక్కువ. అట్లు చేయుమన్న సలహా మనసుకు ఏకాగ్రత కుదరటానికే. మనస్సు చెదరక నిలిపే అనేక ఉపాయాలలో అది ఒకటి. అది మనసును ఒకే మార్గంలో బలవంతగా చొప్పించడం అవుతుంది. ఏకాగ్రతకు అది సాయం చేస్తుంది. కాని దానికన్న ఉత్తమం ఆత్మవిచారణ. ఇప్పటి తగవు అంతా మనసుతోనే. ఆ మనసును మనసుతోనే తొలగించాలి !!_*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచలా...!*🙏🏻

No comments:

Post a Comment