Tuesday, July 29, 2025

 *మౌనమే మేలు*
కలహాలు తెచ్చు 
వాదులాట కంటే

*ధ్యానమే మేలు*
స్పర్ధలు వచ్చు 
పరుల సంగతుల కంటే

*నిరాడంబరమే మేలు*
కొంప ముంచు 
అప్పుల భోగము కంటే 

పూరిపాకలోని పేదే మేలు 
శాంతి కరువైన 
మేడలోని ధనికుని కంటే 

చదువరాని చవటే మేలు 
సంస్కారం నశించిన
 *విధ్యాధికుని కంటే*

*చిన్న చెలమే మేలు*
దాహము తీర్చని 
మహా సంద్రము కంటే 

సంతానము లేనివారే మేలు 
పిల్లలుండి అనాథలైన
 తల్లిదండ్రుల కంటే 

సన్యాసియే మేలు
బాధ్యతల బరువు మోసే
 *సంసారి కంటే...!!*

No comments:

Post a Comment