*బాబా నామ కేవలమ్*
*ఆనంద సూత్రము- ధర్మము మరియు విశ్వస్వభావము- ద్వితీయోధ్యాయము-24 సూత్రములు.*
*సూత్రము: బ్రహ్మ సత్యం జగదపి *సత్యమాపేక్షికమ్.2/14/24/25.*
*S'UTRAM: Brahma satyam jagadapi satyama'peks'ikam*.
2/14/24/85
*[సూత్రార్థము: బ్రహ్మ పరమ సత్యమైన సత్తా(Absolute Truth). సృష్ట జగత్తు కూడా సత్యమే కాని అది సాపేక్షిక సత్యము.]*
*బ్రహ్మము పరమ సత్యము (absolute truth.) జగత్తు ఆపేక్షిక( relative truth)సత్యము కథనము.*
*భావార్థము: బ్రహ్మము సత్యము అనగా మార్పు లేనిది; కాని ఆపాత దృష్టియందు(apparently) బ్రహ్మదేహములో , ప్రకృతి ప్రభావము మరియు మౌలిక సాపేక్షిక(relative) అంశములైన దేశ కాల పాత్రలచే ఏ ఏ మార్పులు గమనింపబడునో అట్టివి అసత్యములు కావు మరియు శాశ్వత సత్యములు కూడా కావని చెప్పవచ్చును.ఆయా పరిణామములు దేశ,కాల పాత్రల ఆపేక్షిత త్రిదండముపై ఆధారితమై యుండుట కారణంగా ,వాటిని ఆపేక్షిక సత్యము(relative truths)లని నుడువబడినవి. ఇంతేగాక వ్యష్టి సత్తా లేదా వ్యష్టి మానసము పురోగమించు క్రమములో ఈ త్రిదండి అంశములతో అవి పెనవేసుకొని యుండును. కాబట్టి వాటి సత్తా ఆపేక్షికమైనది. ఒక ఆపేక్షికమైన సత్తా ,ఇంకొక ఆపేక్షిక సత్తాకై పారమార్థిక సత్యరూపంగా గోచరిస్తుంది. అట్టి కారణంగా మార్పుచెందు జీవి(individual living entity)కి, మార్పుచెందుతుండు జగత్తు సత్యరూపముగా గోచరిస్తుంది.*
*శ్రీ శ్రీ ఆనంద మూర్తి*
*(Translation: KBR)*
No comments:
Post a Comment