Sunday, July 27, 2025

 Pasupula Pullarao.8919291603... శూన్యం నుండి పుట్టింది ఓంకారం... ఓంకారం త్రిమూర్తులను స్తృష్టించింది... వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు...
     ఈ అనంత విశ్వంలొ అన్ని అనంతమే... నీరు, నిప్పు, భూమి, గాలి, ఆకాశం... నీ ఆలోచనలు సాధన వైపు అడుగులు పడినపుడు ఆనందం, ఐశ్వర్యం, ఆత్మజ్ఞానం ఇలా ప్రతి ఒక్కటి అనంతంగా ఉన్నాయనే విషయాలు అర్ధం అవుతాయి... వాటిని పొందాలి అంటే ముందుగా పాజిటివ్ అలోచనలు చేస్తూ అందు కొరకు సరైన సాధన ద్వారా భావనా క్షేత్రంలో ఆకర్షణ శక్తీ ద్వారా వాస్తవ రూపం చేసుకోవచ్చు... సాధన చేస్తూ శూన్య స్తితికి చేరుకోవడం జరుగుతుంది... సకల సృష్టి మొత్తం శూన్యం నుండి మొదలు అవుతుంది అనే అవగాహనకు వస్తారు.
     నీవు ఉంటావు... నీలోని శూన్యం ఎరుకలో ఉంటుంది, వస్తుంది.. మనసు మాయ ఉండదు, ఆత్మ శక్తి మాత్రమే ఉంటుంది... సృష్టి కర్త కొన్ని పనులు కొందరి ద్వారా చేపిస్తారు... సృష్టికర్త స్వయంగా వచ్చి చేయలేని పనులు ఎంపిక చేసిన వారి ద్వారా చేపిస్తు ఉంటాడు...
     అనంతంగా ఉన్న విస్వంలో ఏదైనా అనంతంగా నే అడగాలి... సముద్రం దగ్గరకు చెంబు తీసుకెళ్లి బిందెడు నీళ్ళు కావాలంటే సాధ్యమా?

No comments:

Post a Comment