ప్రాణాయామము తో పాపం ఎలా నశిస్తుంది ? remove negative energy with pranayama by sagar sindhuri
గురువుగారు చివరి ప్రశ్న ప్రాణాయామము ద్వారా ఏ విధంగా కర్మలు నశిస్తాయి. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న మనం ఇందాకే చెప్పుకున్నాం జ్ఞానాగ్ని దగ్ద కర్మాణం అంటే జ్ఞానము చేత మనకు బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించడం అంటే ఏది సత్యమో ఏది అసత్యమో ఏది ధర్మమో ఏది అధర్మమో ఏది మంచిదో ఏది మనకు చెడుదో మనకు తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు మనం అటువంటి కర్మలనే చేస్తాం. ఆ కర్మల వలన మనకు కేవలం శాంతి తప్ప అశాంతి అనేది కలగదు. ఎప్పుడైతే జ్ఞానము మనకు లేదో అప్పుడు మనలో ధార్మిక ప్రవర్తన ఉండదు సత్యాసత్యాలను మనం వివేచన చేయలేకపోతాం వివేకం ఉండగలిగినటువంటి శక్తి ఉండదు అప్పుడు చేసే కర్మల వల్ల నెగిటివ్ ఫలితాలని మనం పొందుతాం. మరి ఇలా కోటాను కోట్ల జన్మల్లో మనం చేసినటువంటి కర్మలు ఒక వ్యక్తి ఆత్మజ్ఞానం పొందితే గనుక ఒకేసారి సంచిత ఆగామి కర్మలన్నీ కూడా దగ్దమైపోతాయి. మరి ఇంకా నాకు ఆత్మజ్ఞానం కలగలేదు నాకు జ్ఞానం అంటే ఏంటో తెలియలేదు అన్నటువంటి సాధకులకు వారు ప్రతిరోజు గనుక ప్రాణాయామాన్ని సాధన చేస్తే తప్పకుండా వారికి ఆ యొక్క పాప పుణ్యాలు అనేటివి అంటే ప్రాణమయ కోసంలోనూ చక్రాల్లోనూ నిక్షేపమైనటువంటి నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ప్రక్షాలన జరిగిపోతాయి. ఈ విషయాన్ని మన శాస్త్రాల్లో అనేక విధాలుగా చెప్పడం జరిగింది. యోగ తత్వోపనిషత్ ఇందులో ప్రాణాయామేన శుద్ధస్య సర్వదోష క్షయే భవేత్ అంటే ప్రాణాయామము చేత శరీరము లేదా ప్రాణమయ కోసము శుద్ధి పొంది సర్వదోషములు అంటే సర్వ పాప పుణ్యములు కూడా క్షయమవుతాయి. ఇదే విషయాన్ని మన యొక్క యోగ గ్రంథాలు అనేటువంటి గెరండ సంహిత గెరండ ఋషి గెరండ ఆయన ఆ ఋషి చెప్పినటువంటి వాక్యము యధాలోహం మలయ దుష్టం దీప్తేం అగ్నో ప్రవేశియేత్ తదా శుద్ధిహి ప్రాణాయామైహి పాపమలాం వినాశియేత్ ఏ విధంగా అయితే ఇనుములోకి అగ్ని ప్రవేశింపబడినప్పుడు అందులో ఉన్నటువంటి మలినాలన్నీ శుద్ధి అయిపోయి ఇనుము శుద్ధి అవుతుందో అదేవిధంగా ప్రాణశక్తి మన ప్రాణనాడుల్లోకి ప్రాణాయామం ద్వారా ప్రవేశించినప్పుడు సర్వ మలాలు అంటే పాపము పుణ్యము పూర్వజన్ములకు సంబంధించినటువంటి ఆ యొక్క మలములు అంటే మెంటల్ టాక్సిన్స్ కార్మిక్ టాక్సిన్స్ అనేటివి పూర్తిగా నాశనం అవుతాయి. ఇదే విషయాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడు శివ సంహితలో ఈ విధంగా వివరించారు యత్కిం కర్మ కృతం పుణ్యం పాపం వా సుకృతం కృతం తత్సర్వం నశ్యతే సద్విహి ప్రాణాయామః ప్రవర్తితః అంటే యోగులు ప్రాణాయామం ద్వారా ఒక నియమించబడినటువంటి ప్రాణాయామము ద్వారా వారు తమ యొక్క పాపములైనా సరే పుణ్యములైనా సరే జన్మ జన్మల పాప పుణ్యాల రాశులను ఆ యొక్క సంస్కారాలను వాళ్ళు శుద్ధి చేసుకోగలుగుతారు. అంటే ఇక్కడ చెప్తున్నారు ప్రాణాయామము చేత నీ పాపములు లేదా పుణ్యములు కూడా అంటే మరు జన్మకు చేరుకోవాల్సిన అవసరం లేకుండా పాప పుణ్యాలఅన్నీ కూడా నాశనమైపోతాయి అని చెప్తున్నారు. మనం ప్రాణాయామం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనము ఎడా మరియు పింగల నాడుల్లో చాలా వేగంగా ఇప్పుడు బస్త్రికా చేస్తాం కపాలభాతి చేస్తాం అదేవిధంగా నాడి శుద్ధి ప్రాణాయామం చేస్తాం. ఇటువంటి ప్రాణాయామాలు చేయడం వల్ల ప్రాణశక్తి చాలా ఫోర్స్ గా నాడుల్లోకి ప్రవేశింపబడుతుంది. అలా ప్రాణశక్తి అత్యంత ఎక్కువగా వేగంగా ప్రాణనాడులోకి ప్రవేశింపబడినప్పుడు ఆ నాడుల్లో ఉన్నటువంటి పాప కర్మలకు సంబంధించినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సప్టల్ ఫామ్స్ లో వీటిని ఇంప్రెషన్స్ అంటారు వీటిని ఇవన్నీ కూడా బర్న్ అయిపోతూ వచ్చేస్తాయి ఎందుకంటే ప్రాణాయామం చేసినప్పుడు సాక్షాత్తు విశ్వమయ చైతన్య శక్తి ఆ పరాశక్తియే మన నాడుల గుండా లోపలికి వెళ్తుంది. ఈ జగత్తును నడిపిస్తున్నటువంటి ఆ విశ్వమయ ప్రాణశక్తి ఆ వైటల్ ఎనర్జీ అనేది మన నాడుల్లోకి పోయినప్పుడు ఆ నాడుల్లో ఉన్నటువంటి పాపాలు లేదా పుణ్యాలన్నిటిని కూడా సర్వనాశనం చేస్తుంది బస్మి పటలం చేసి నాడి శుద్ధిని చేస్తుంది. ఈ విధంగా జన్మ రాహిత్య స్థితిని మనం పొందుతాం. కాబట్టి ప్రాణాయామముతో మనము మన యొక్క ఆరోగ్యమే కాదండి చాలామంది అనుకుంటారు ప్రాణాయామం కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కానీ మనము కోటాను కోట్లుగా ఎన్నో పనులు ఎన్నో కర్మలు చేయాలనుకొని చేయకుండా లోపల సంస్కారాలుగా మారి మనం మలినమైపోయి ఉన్నాం. మరి అటువంటి అవాంచనీయ సంకల్పాలు ఆ సంస్కార రూపంలో విత్తనాల రూపంలో ఉన్న ప్రతి కర్మ బంధము కూడా ప్రాణాయామం అనే అగ్ని చేత దగ్దమైపోతుంది. అలా దగ్దమైపోయిన ప్రాణము శుద్ధి కలుగుతుంది శరీర శుద్ధి కలుగుతుంది ఎప్పుడైతే ప్రాణమయ కోసం శుద్ధి కలుగుతుందో మన చిత్తము శుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధియే మోక్షానికి మార్గం బాధ బంధ విముక్తికి మార్గం బాధా విముక్తికి మార్గం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాణాయామాన్ని తక్కువగా అంచన వేయకండి కేవలం ఆరోగ్యం కోసం అని మాత్రం భావించకండి మన పూర్వజన్మల యొక్క సమస్త పాప కర్మలు కూడా ప్రాణాయామం చేత నశించిపోతాయి. ప్రతిరోజు కూడా గురువు దగ్గర మీరు నేర్చుకొని ప్రాణాయామాన్ని ఆచరించండి కేవలం మూడు ప్రాణాయామాలు కనీసం కపాలభాతి బస్త్రిక మరియు నాడి శుద్ధి ప్రాణాయామం రోజు 15 నిమిషాల పాటు ప్రాణాయామాన్ని ఆచరించి మన యొక్క జీవితాన్ని దివ్యమయం చేసుకోవాల్సి ఉంటుంది మన ప్రాణాన్ని మనసును శుద్ధిని మన యొక్క పంచకోశాలను కూడా శుద్ధి చేసుకొని మనం అత్యున్నతమైనటువంటి జీవితాన్ని జీవించాల్సి ఉంటుంది. నమస్తే
No comments:
Post a Comment