Sunday, August 31, 2025

 [8/30, 13:33] +91 63042 02100: అమ్మభాషకు గొడుగు

ఆధునిక తెలుగు భాషా, సాహిత్యాలకు వైతాళికులుగా పేర్కొనే వారిలో గిడుగు వెంకట రామమూర్తి ఒకరు. ఉపాధ్యాయుడిగా, చరిత్ర పరిశోధకుడిగా, విద్యావేత్తగా, వక్తగా పేరొందిన ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటున్నాం. రాతకోతల్లో వ్యావహారిక భాషా వినియోగానికి గిడుగు చేపట్టిన ఉద్యమం అసామాన్య మైనది. అలాగే సవర భాషకు సంబంధించి ఆయన చేసిన కృషి కూడా అనుపమానమైంది.

సవరల భాష, సంస్కృతుల పట్ల గిడుగుకు 1880ల్లోనే ఆసక్తి కలిగింది. మన్యం ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పని చేయడం ఇందుకు ప్రధాన కారణమనిపిస్తుంది. కష్టపడి సవరభాష నేర్చుకున్న ఆయన వారికోసం వారి భాషలోబోధించే బడులు పెట్టారు. ఆ భాషకు చేసిన కృషికి గాను ప్రభుత్వం బహు మతి ఇస్తానంటే ఆ డబ్బుతో మరిన్ని బడులు పెట్టమన్నారు. సవరభా షకు ఓ లిపిని రూపొందిం చడమే కాక, వారి జీవన విధానాన్ని, సంస్కృతీ సంప్రదాయాల్ని అధ్య యనం చేశారు. చరిత్రగా రికార్డు చేశారు. సవరభా షకు నిఘంటువు, వ్యాక రణం రూపొందించారు. వాచకాలను తయారుచేశారు. తన కృషితో సవరల హృదయాలను గెలిచిన గిడుగు వారి గురించి కథలు రాశారు. వాటిని వారికి వినిపించి, వాళ్లు సూచించిన సవరణలతో తిరగరాసిన గొప్పతనం ఆయనది.

అభివృద్ధిపరంగా మానవ సమాజం శరవేగంగా మార్పులకు లోనవుతోంది. కానీ ఎటువంటి ఆధునికతా అంటని స్వచ్ఛమైన మన్యాలూ వాటిలో ప్రజా సమూహాలూ ఇప్పటికీ ఉన్నాయి. ప్రకృతే వారికి పాఠశాల. కూడూ గూడూ ప్రకృతి ప్రసాదాలే. వన్యమృగాలే బంధువర్గాలు. అలాంటి ఓ సమూహమే సవర జాతి. ఒడిశాలోని గంజాం, ఆంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా కనిపించే సవరల జనాభా లక్షల్లో ఉంటుంది. వీరు పోడు వ్యవసాయం చేస్తారు. ఎదురెదురుగా ఇళ్లు కట్టుకుం టారు. అంటువ్యాధులు ప్రబలినా, ప్రమాదవశాత్తూ కానీ, క్రూర మృగాలవల్ల కానీ జనం చనిపోయినా, ఆ ప్రాంతాన్ని వదిలి కొత్త చోట నివాసాలు ఏర్పాటుచేసుకుంటారు. వారి జీవనవిధా నంతో మమేకమయ్యారు కాబట్టే గిడుగు సవర కథలను రాయగలిగారు. ఈ కథల రెండో పుస్తకం ముందుమాటలో 'ఇందులోని కథలన్నీ సవర వాళ్లు నాకు చెప్పినవే. ఇంచుమిం చుగా వాళ్ల మాటలే' అంటారాయన. సవర జీవన విధానంతో పాటు వారి భాష కూడా కథల్లో సహజంగా వచ్చేలా చూశారా యన. నాలుగో భాగం 'సవర కథల్లో భాషకు ప్రాధాన్యం ఎక్కువ కనిపిస్తుంది. ఇల్లు, పొలం, సంత, తగవులు, పూజలు, కల్లు తాగడం, సోది, కేసులు, పోలీసులు, జడ్జిలు, రోగాలు వంటి సందర్భాల్లో వారి మధ్య చోటుచేసుకునే సంభాషణల్లోని సహజత్వానికి గిడుగు అక్షరరూపమిచ్చారు. సవర భాషపై చేసిన కృషే ఆయనను తెలుగు గురించి కూడా ఆలోచింపజే సిందంటారు. సవర భాష లిపికర్తగా, వ్యావహారిక భాషా ఉద్య మకారుడిగా, కాలం కన్నా ముందున్న భాషా శాస్త్రవేత్తగా గిడుగు చరిత్రకెక్కారు. వర్తమానంలో ఎదురవుతున్న అవరోధా లన్నింటి నుంచి తెలుగుభాషను కాపాడుకోవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి.

భమిడిపాటి గౌరీశంకర్
[8/30, 13:33] +91 63042 02100: అనంతత్వం నిండిన అజంత భాష

తెలుగు అనేది కేవలం భావవ్యక్తీకరణ కోసం ఉపయోగించే ఒక భాష మాత్రమే కాదు. యుగయుగాలుగా కవుల ఊహలకు రెక్కలు కట్టి, మన పండితుల జ్ఞానానికి పదును పెట్టిన మన జాతి ప్రాచీన వారసత్వానికి ప్రాణం పోసిన ఊపిరి మన తెలుగు తెలుగు అమృత భాష. అన్ని భాషల పదాలను తనలో ఇముడ్చుకోగల సహృదయభాష. అందుకే ఇది అనంతత్వం కలిగిన భాష. తీయందనాన్ని అణువణువునా నింపుకున్న ఘనమైన భాష. భాషణకు అనువుగా పండితుల నోటిలోనూ, సామాన్యుల నాలికపైనా నాట్యం చేయగల సమున్నత భాష. తెలంగాణ యాస కావచ్చు. రాయలసీమ పదాలు కావచ్చు. కోస్తా మాండలికం కావచ్చు. ఎన్ని మాండలికాలున్నా తెలుగు భాష ఒక్కటే! ప్రబంధ యుగం తరువాత క్షీణ యుగం ప్రారంభమై ఈ సారస్వతం ఉన్నతిపై అనుమానాలు లేచినప్పుడు మహోత్తుంగ తరంగంలా ఎగసిన భాష. తెలుగు భాషకున్న మాన్యతలెన్నో, అసామాన్యులకు కూడా వర్ణించడం దుర్లభమేమో అనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1966లో ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించింది. దేశంలో హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు. మన తెలుగు భాష భారత్‌లో 4వ స్థానంలో, అమెరికాలో 11వ స్థానంలో ఉంది. ‘తెలుగు భాష తియ్యదనం. తెలుగు జాతి గొప్పదనం.. తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం’ అంటూ సినీకవులు పొగిడిన భాష మన తెలుగు భాష. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’గా కీర్తి పొందిన మన తెలుగు భాష, అమ్మ లాంటి మాతృభాష వెలుగు మసకబారుతున్న సమయంలో.. వెలుగుబాట చూపించేందుకు అనేక మంది కృషి చేశారు. వారిలో ప్రముఖులు గిడుగు వెంకట రామ్మూర్తి.దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పినా.. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తీ గలవోడా.. అనే వేములపల్లి గీతం ఆలపించిన తెలుగువారి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసేందుకు ఆయన ఎనలేని కృషి చేశారు.
తెలుగు ఒక ఫోనెటిక్ భాష, అంటే ప్రతి అక్షరం ఒక నిర్దిష్ట శబ్దానికి అనుగుణంగా ఉంటుంది. దీని వలన తెలుగు చదవడం మరియు వ్రాయడం నేర్చుకోవడం చాలా సులభం అవుతుంది.
తెలుగులో 11వ శతాబ్దం నాటి గొప్ప సాహిత్య సంప్రదాయం ఉంది. తెలుగు సాహిత్యంలోని అత్యుత్తమ రచనలలో "మహాభారతం" మరియు "రామాయణం" ఉన్నాయి.
తెలుగు చాలా వ్యక్తీకరణ భాష మరియు విస్తృత శ్రేణి భావోద్వేగాలను వ్యక్తపరచగలదు. దీనికి కారణం దాని గొప్ప పదజాలం మరియు అలంకారిక భాష వాడకం.
తెలుగు అభివృద్ధి చెందుతున్న భాష మరియు మీడియాలో, విద్యలో మరియు వ్యాపారంలో ఎక్కువగా ఉపయోగించబడుతోంది.
తెలుగు అనేది అక్షరాలతో కూడిన సమయానుకూల భాష, అంటే ప్రతి అక్షరానికి సమాన బరువు ఇవ్వబడుతుంది. ఇది ఇంగ్లీష్ వంటి ఒత్తిడి-సమయానుకూల భాషలకు విరుద్ధంగా ఉంటుంది, ఇక్కడ కొన్ని అక్షరాలు ఇతరులకన్నా ఎక్కువగా నొక్కి చెప్పబడతాయి.
తెలుగులో క్రియ సంయోగాల సంక్లిష్ట వ్యవస్థ ఉంది, వీటిని కాలం, అంశం, మానసిక స్థితి మరియు వ్యక్తిని సూచించడానికి ఉపయోగిస్తారు.
తెలుగు భాషలో చాలా పదాలు సంస్కృతం, అరబిక్ మరియు పర్షియన్ భాషల నుండి అరువు తెచ్చుకున్నాయి, వీటి పదజాలం చాలా గొప్పది.
అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష తెలుగు. 
రెండు లింగ వ్యవస్థను ఉపయోగించే అనేక భాషల మాదిరిగా కాకుండా, తెలుగులో మూడు లింగాలు ఉన్నాయి: పురుష, స్త్రీ, మరియు నపుంసక. ఈ సూక్ష్మ వ్యాకరణ నిర్మాణం భాష యొక్క వ్యక్తీకరణను పెంచుతుంది. ద్రావిడ భాషల నుండి క్రీ.పూ. 15వ శతాబ్దంలో వేరుపడిన మొట్టమొదటి ద్రావిడ భాష తెలుగు .
తెలుగు నేర్చుకోవడం సులభం ఎందుకంటే ఇది ఫొనెటిక్ భాష, స్పెల్లింగ్ మాట్లాడే శబ్దాలకు నేరుగా సరిపోతుంది. తెలుగు మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. తెలుగు భాషకు ఆంధ్రం, తెనుగు, తెలుగు అనే మూడు పదాలు సమానార్థకాలుగా వ్యవహారంలో ఉన్నాయి. "తెలుగు" పదం "త్రిలింగ" పదం నుంచి వచ్చిందనీ, "తెనుగు" "త్రినగ" శబ్దం నుండి వెలువడింది, కాలానుక్రమ భాషాశాస్త్ర పద్ధతుల్ని అనుసరించి తెలుగు, తమిళాలు క్రీ.పూ. 11వ శతాబ్దిలో విడివడ్డాయి.
తెలుగు అజంత భాష (అజంత భాష అంటే పదం చివరి అక్షరం అచ్చుతో అంతమయ్యే భాష. తెలుగు భాష ఈ లక్షణాన్ని కలిగి ఉంది, కాబట్టి తెలుగును అజంత భాష అంటారు. ఒక భాషలో ప్రతి పదం అచ్చుతో ముగిస్తే, అది అజంత భాష అవుతుంది. హల్లుతో అంతమయ్యే పదాలు ఇందులో ఉండవు.) అవడంవల్ల తెలుగును వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డి కోంటి "ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌" అన్నారు. మన తెలుగు భాషలో దాదాపు అన్ని పదాలు అచ్చుతోనే అంతమవుతాయి.  ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి వంటి వారు 15వ శతాబ్దంలో తెలుగు భాష స్వరూపాన్ని గమనించి, ఇది అజంత భాష అని పేర్కొన్నారు. ప్రతి పదం అచ్చు స్వరంతో అంతమవడాన్ని "అజంతం'' అంటారు. ఆ అందం నిలువెల్లా చిందే అపార మందకినిలాంటి భాష మన తెలుగు
  ఆంధ్ర జాతి ప్రస్తావన మొట్టమొదటిసారి క్రీస్తు పూర్వం 7వ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతుంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద జాతులతో కలిసి ఆర్యావర్తానికి దక్షిణాన నివశిస్తున్నట్లు ఉంది. ఆరణ్యపర్వంలో మార్కండేయుడు ధర్మరాజుతో కలియుగధర్మాల్ని చెప్పే సందర్బంలో, భారతదేశంలో నదీ, దేశ, జననామాల్ని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పే సందర్భంలో, కర్ణపర్వంలో పాండ్యవధ సందర్భంలో, అశ్వమేధపర్వంలో అర్జునుని దిగ్విజయ సందర్భంలో ఇలా వ్యాసభారతంలో అనేకచోట్ల కనిపిస్తుంది. వాల్మీకి రామాయణంలో కిష్కింధకాండలో సుగ్రీవుడు వానరుల్ని దక్షిణదిక్కుకు పంపుతూ సీతకోసం వెతకవలసిన రాజ్యాలలో ఆంధ్ర, చోళ, పాండ్య దేశాలను పేర్కొన్నాడు. సంస్కృత భాగవతంలో బలి చక్రవర్తి కొడుకులలో ఆరుగురు తమ పేర్లతో ప్రత్యేక రాజ్యాలు స్థాపించుకున్నారని వారిలో ఆంధ్రుడనేవాడు ఆంధ్రరాజ్యాన్ని స్థాపించాడని వుంది. ఇలా అనేకచోట్ల ఆంధ్రశబ్దం దేశవాచకంగా కనిపిస్తుంది. తెలుగు భాష రెండువేల ఏళ్ళకు ముందే వాడుకలో ఉందనడానికి గాథాసప్తశతి తిరుగులేని ఆధారం.
‘అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమించే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ అయిన ఆంధ్రులు అoటూ, ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల లో పేర్కొన్నాడు .
కాని నేడు పరిస్తితి చాలా ఘోరంగా ఉంది .కాల ప్రవాహంలో, జీవనగమనంలో చాలామంది ఈ మూడింటికీ దూరమవుతున్నారు. కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ.. ముగ్గురు అమ్మలూ ఏడ్చే పరిస్థితులే కాన వస్తున్నాయి. తెలుగు భాషా సంస్కృతులు పరాయిభూముల్లోనే పరిఢ విల్లుతున్నాయి. ఉద్యోగ ఉపాధి కోసం విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు నిత్యం తెలుగుతల్లిని గుండెల్లో నిలుపుకునేలా కార్యక్రమాలు చేపడుతూ ఉండడం అభినందనీయం.కానీ మాతృ భూమిలో తెలుగు బాష తీవ్రమైన అవమానాన్ని ఎదుర్కొంటుంది.  ఏదో ఒక రూపంలో తల్లి భాషకు దగ్గరయ్యే కృషి విదేశాల్లో ఉన్న తెలుగువారు చేస్తున్నారు. కవులను, కళాకారులను ఇక్కడ నుంచీ అక్కడకు పిలుపించుకుని మన పద్యాలు, అవధానాలు, వాగ్గేయకార కీర్తనలు,కూచిపూడి నృత్యాలు,భువన విజయరూపకాలకు పట్టం కడుతున్నారు.
మన దేశాన్ని దోచేద్దామని వచ్చిన బ్రౌన్ దొర గుండెను సైతం మన పద్యం దోచేసింది.దొరగారు వేమన్న వెర్రిలో పడిపోయాడు. తమిళవారు మహాకవిగా భావించే సుబ్రహ్మణ్యభారతికి తెలుగువంటి తీయనైన భాష ఇంకొకటి లేనేలేదని అనిపించింది. శ్రీకృష్ణదేవరాయల పితృభాష తుళు. "దేశ భాషలందు తెలుగు లెస్స" అని శ్రీకృష్ణదేవరాయలు పలికినా, వినుకొండ వల్లభరాయడు చెప్పినా, అవి అక్షర సత్యాలు.
"జనని సంస్కృతంబు సకల భాషలకు " అంటారు. మన జ్ఞానం మొత్తం ఇందులోనే దాగి వుంది. మనం మాట్లాడే చాలా మాటలు సంస్కృతం నుంచి పుట్టినవే. ఇంతటి సంస్కృత భాషకు మనం దూరమై చాలా కాలమైంది. బ్రిటిష్ వాళ్లు మన విద్యా విధానాన్ని పాడు చేసిన క్రమంలో, సంస్కృతం మనకు దూరమైపోయింది. సంస్కృతాన్ని అభ్యసించడం, పరిరక్షించుకోవడం అత్యంత కీలకం. దేశంలో ఎన్ని భాషలు ఏర్పడినా, సంస్కృతంలో అవలీలగా, అలవోకగా ఒదిగిన భాషల్లో తెలుగుదే అగ్రతాంబూలం. సంగీత,సాహిత్యాలకు జీవంపోసే రసపుష్టి తెలుగులో ఉన్నంతగా మిగిలిన భాషలకు లేదు.
ఏ భాషలోనైనా చదువుకునే వెసులుబాటు కల్పించడమే వివేకం. మనో వికాసానికి, మేధో వైభవానికి తల్లిభాష తల్లిపాల వంటిది. వివిధ స్థాయిల్లోని తెలుగు పాఠ్యాంశాలలో పద్యం దూరమవుతోంది. వ్యాకరణం, ఛందస్సు దూరమవుతున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. ఆధునిక సాహిత్య ప్రక్రియలకు స్థానం కలిపిస్తూనే, సంప్రదాయమైన పద్యాన్ని సమున్నతంగా గౌరవించేలా పాఠ్యాంశాలు ఉండాలి. పద్యం మన తెలుగువాడి సొత్తు. భాషలు జీవ నదుల వంటివి.  కాకపోతే మురికినీరు చేరకుండా, చేరినా, చెడు జరుగకుండా చూసుకోవడం మన కర్తవ్యం. తల్లి తెలుగు భాషను నెత్తిపై పెట్టి పూజించుకుంటూ, ఆ వెలుగులో, ఆ వెలుతురులో రసమయంగా జీవిద్దాం. పిల్లలకు ఉగ్గుపాల దశ నుంచే తల్లిభాషపై మమకారం పెంచడం పెద్దల బాధ్యత.

No comments:

Post a Comment