Sunday, August 31, 2025

 తెలుసుకోండి...290825
తెలియజేయండి....
*"శ్రీ నగజా తనయం 4/11*

కుమారసంభవం లోనిఈ పద్యం

తను వసితాంబుదంబు, సితదంతముఖం బచిరాంశు, వాత్మ గ
ర్జన మురుగర్జనంబు, గర సద్రుచి శక్రశరాసనంబునై,
చన మదవారివృష్టి హితసస్య సమృద్ధిగ నభ్రవేళ నా,
జను గణనాథు గొల్తు ననిశంబు నభీష్టఫల ప్రదాతగాన్!

వినాయకుని నుంచి మనం నేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఇవే..!

విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు. అంతేనా, బుద్ధిమంతుడైన వ్యక్తి ఉన్నత వ్యక్తిత్వంతో ఏవిధంగా నడుచుకోవాలనేది ఆచరణలో చూపిన మహనీయుడు. ఆయన కథల నుండీ ఎన్నో విషయాలని మనం నేర్చుకోవచ్చు . అలాంటి ఒక ఐదువిషయాలను గురించి ఇక్కడ చూద్దాం .    

1 . విధి నిర్వహణకే అధిక ప్రాధాన్యం

పార్వతీదేవి నలుగుపిండితో వినాయకుని తయారుచేసి ప్రాణం పోసింది. తాను అభ్యంగనం ఆచరించడానికి వెళుతూ ఎవ్వరినీ లోపలికి రానీయకుండా కాపలా కాయమంది. అమ్మ మాట శిరోధార్యంగా విధి నిర్వాహణకు ఉపక్రమించారు పార్వతీనందనుడు . గజాసుర గర్భస్త చెరను వీడి కైలాసానికి చేరిన నిటలాక్షుని, లోపలి వెళ్లకుండా ద్వారం వద్దే అడ్డుకున్నారు  గణేషుడు . శివుడు తాను ఫలానా అని చెప్పినా గణపతి వినరు . తన కర్తవ్యం ఇంట్లోకి ఎవరినీ రాకుండా చూసుకోవాలి. అమ్మమాట అదేమరి ! కనుకనే సాక్షాత్తూ శివుడే వచ్చినా, తన ప్రాణాలు పోయినా విధి నిర్వహణ నుండీ వెనుతిరగరు . తన కర్తవ్యాన్ని చివరిక్షణం వరకూ విడువరు.  ఆతర్వాత గజాననుడై పునర్జీవుడైన గౌరీతనయుని కథ అందరికీ తెలిసిందే . ఆయనలో ఉన్న ఆ గుణాన్ని నిజంగా మనం కూడా అలవాటు చేసుకుంటే లక్ష్యసాధనలో, కెరీర్‌లో ఖచ్చితంగా ముందుకు దూసుకెళ్లవచ్చు.

2.మాతృదేవోభవ పితృదేవోభవ. 

గణేషుడు, కుమారస్వామిలలో ఎవరిని గణాధిపతిగా చేయాలని ఆలోచిస్తూ శివపార్వతులు వారికి ఒక పరీక్ష పెడతారు. వారిద్దరిలో ఎవరు ముందుగా ముల్లోకాల్లో ఉన్న పుణ్య క్షేత్రాలను చుట్టి వస్తారో వారే గణాధిపతి అంటారు. దీంతో కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై యాత్రలకు బయల్దేరతారు . కానీ వినాయకుడు  మాత్రం తల్లిదండ్రులైన ఆదిదంపతులనే ఈ చరాచర సృష్టిగా భావించి వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారు . దీంతో కుమారస్వామికి తానూ ఎక్కడికి వెళ్లినా, అన్నగారు తనకన్నా ముందుగా అక్కడికి చేరుకొని మారలి వెళ్తున్నట్టు దర్శనం అవుతుంది.  వినాయకుడు గణాధిపతి అవుతాడు. నిజంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాన్ని మనకు గణేషుని జీవితంలో జరిగిన ఈ సంఘటన చెబుతుంది.

..... ఇంకా ఉంది......
 సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.
 శైలజ వాస్తు జ్యోతిషాలయం 9059743812

No comments:

Post a Comment