*శీర్షిక: ఆశ - శాశ్వత సహచరి*
*******
అలసిన ఆశ కూలిపోని కలల వేదిక,
ఎదురుచూపుల్లోనూ వెలిగే దారి.
పడిపోతూ, లేస్తూ కొత్త ఆశ పుంజుకుంటుంది, కొత్త ఆశ జీవం పోస్తుంది, అదే శ్వాసగా చిగురిస్తుంది
ఆశే – మనిషి గుండె చప్పుడు
అదే జీవితం సాగించే శక్తి.
ఆశ కదలక పోతే జీవం అంతట
నిర్వీర్యం, కానీ ఆకాంక్షలు ఆకాశంలో తేలే మేఘాలాంటివి, అవి కొత్త వానలుగా మారుతాయి.
నిస్సహాయమైన మనసు మరోసారి జీవించి, నేలకొచ్చి పుష్పంగ మళ్లీ పూస్తుంది. ప్రతి అలసట వెనుక ఒక
మేల్కొలుపు ఉంటుంది,....
పట్టుదలతో కలలే ఆధారంగా నడవాలి, నిరాశ అనే మార్గాలు తొలగిపోవాలి.....
ముందుకు సాగే ఆశ ఓ పిలుపు కావాలి మనకు, అందులో దాగి ఉంటుంది జీవ చైతన్యం....
అలసిన ఆశకి నీరు ఒకటి కావాలి,
అందులో వెలుగుల పంట పూయాలి. జీవితం ఎండమావిలా అనిపించినా, ఒక చినుకే పచ్చదనం తెస్తుంది.
ఆశ పరిమళం తగిలితే
జీవితం ఆనంద విందుగా మారుతుంది....
అలసిన ఆశ కేవలం తాత్కాలికం,
నిరాశ శాశ్వితం కాదు,...
ప్రతి మలుపులో అవకాశాలు పునర్జీవం పొందుతాయి....
అలసినా… ఆశ మళ్లీ లేస్తుంది,
మనిషిని గమ్యానికి చేర్చే
*శాశ్వత సహచరిగా నిలుస్తుంది.*
~~~~~~~~~~
✍🏻భారతీదేవి చేరెడ్డి
No comments:
Post a Comment